News
News
X

Gruhalakshmi December 12th: తులసి కోరిక తీర్చాలని డిసైడ్ అయిపోయిన సామ్రాట్- ఆవేశంతో రగిలిపోయిన ప్రేమ్

లాస్య తన వంకర బుద్ధితో ఇంట్లో వాళ్ళని రోడ్డు మీదకి లాగాలని ప్లాన్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

సామ్రాట్ తనకొచ్చిన వింత సమస్య గురించి తులసితో చెప్తాడు. ఇద్దరూ కలిసి గుడికి వెళతారు. సామ్రాట్ ముడుపు కట్టి తన కోరిక నెరవేర్చమని అమ్మవారిని వేడుకుంటాడు. తులసి కూడా తన మనసులో కోరిక నెరవేరాలని పేపర్ మీద రాసి ముడుపు కడుతుంది. సామ్రాట్ అది చూసి ఏం కోరుకున్నారని అడుగుతాడు. ఆ ముడుపులో ఏం రాశారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. తెలుసుకోండి కానీ తను మాత్రం చెప్పనని తులసి అంటుంది. దేవుడిని కోరుకున్న మొక్కు పైకి చెప్పకూడదంట అని తులసి వెళ్ళి ముడుపు కడుతుంది. కానీ సామ్రాట్ మాత్రం ముడుపులో ఏం రాసిందో తెలుసుకోవాలని అనుకుంటాడు.

Also Read: ఆదిత్యకి ఆరు నెలల జైలు శిక్ష- వేద జీవితాన్ని మార్చేందుకు వచ్చిన కొత్త క్యారెక్టర్లు

తులసి కారులో కూర్చున్న తర్వాత సామ్రాట్ మళ్ళీ గుడిలోకి వెళ్తాడు. ఇంట్లో శ్రుతి బాధగా ఉండటం చూసి ఏమైందని ప్రేమ్ అడుగుతాడు. కట్టుకున్న వాడు అడిగిన కోరిక నెరవేర్చలేకపోయానని శ్రుతి బాధపడుతుంది. ఫ్రైడ్ రైస్ చెయ్యమని అడిగావ్ కానీ లాస్య అడ్డుపడిందని జరిగిందంతా చెప్తుంది. ఫ్రిజ్ కి తాళం వేసిన విషయం తెలుసుకుని ప్రేమ్ ఆవేశపడతాడు. కోపంగా వెళ్లబోతుంటే శ్రుతి ఆపుతుంది. కావాలని ఇలా చేస్తుంది, మనం గొడవ పడితే అంకుల్ ముందు తెలివిగా మనల్ని చెడుగా చూపించాలని చూస్తుందని శ్రుతి అంటుంది. ప్రేమ్ కోపంగా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకుని దర్జాగా ఆమె ముందే కూర్చుని తింటానని అంటాడు.

గుడిలో సామ్రాట్ తులసి కట్టిన ముడుపు విప్పడానికి వెళతాడు. తులసి రాసిన చీటీ తెరవబోతుంటే పూజారి అక్కడికి వస్తాడు. కట్టిన ముడుపు విప్పితే కోరుకున్న కోరిక నెరవేరదని పూజారి చెప్తాడు. ఎలాంటి చెడు ఉద్దేశంతో ముడుపు విప్పలేదని సామ్రాట్ అంటాడు. కానీ ఎంతో ఆశతో దేవుడికి తన కోరిక విన్నవించుకుంటూ ముడుపు కట్టింది, అది అమ్మవారికి చేరేలోపే నువ్వు విప్పావ్ కాబట్టి అది ఎటువంటి కోరిక అయినా దాన్ని తీర్చాలసిన బాధ్యత నీదే అలా చేయకపోతే అమ్మవారి ఆగ్రహానికి గురవుతావని పూజారి సామ్రాట్ తో చెప్పి వెళ్ళిపోతాడు. ఎలాగైనా కోరిక తిరుస్తానని సామ్రాట్ అనుకుంటాడు. పుట్టిన ఊరుకి వెళ్ళి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకోవాలి అని చీటీలో ఉంటుంది. ఇంత చిన్న కోరిక కోరారు ఏంటని సామ్రాట్ అనుకుని తన కోరిక నెరవేర్చాలని అనుకుంటాడు. అది చిన్న కోరిక అని అందరూ అనుకుంటారు కానీ అది ఎంత కష్టమో తనకి మాత్రమే తెలుసని తులసి కారులో కూర్చుని అనుకుంటుంది.

Also Read: కార్తీక్ ని చూసిన శౌర్య- కన్న కూతురి కోసం తల్లడిల్లిపోతున్న దీప

తులసి పుట్టిన ఊరు ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. సామ్రాట్ కోసం తులసి వస్తుంటే తనే ఎదురుపడతాడు. సామ్రాట్ సంతోషంగా ఉండటం చూసి ఎందుకు అంత ఆనందం అని అడుగుతాడు. అమ్మవారి కుంకుమ తీసుకొస్తానని చెప్పి అంతసేపు ఎందుకు ఉన్నారని అడుగుతుంది. తులసి ముడుపులో ఉన్న కోరిక అమ్మవారు చదివారో లేదో అని అంటే చదివేసిందని సామ్రాట్ నోరు జారతాడు. అదేంటి మీకు ఎలా తెలుసని తులసి అనుమానంగా అడుగుతుంది.

Published at : 12 Dec 2022 10:18 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial December 12th Update

సంబంధిత కథనాలు

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?

‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?

K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్

K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్

టాప్ స్టోరీస్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !

Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !

YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల

YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల