Gruhalakshmi April 22nd: విక్రమ్ ఆశ అడియాస అయిపోయిందే- వెళ్ళిపోయిన ప్రేమ్, కంటతడి పెట్టించిన తల్లీకొడుకులు
విక్రమ్ దివ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ప్రేమ్ ని కూడా ఊరు వెళ్లిపొమ్మని తులసి బాధగా చెప్తుంది. పెళ్ళికి మీరు వచ్చారు చాలా సంతోషంగా ఉంది. నా కడుపున పుట్టిన వాడివి అయినా నీకు థాంక్స్ చెప్తున్నానని ఎమోషనల్ అవుతుంది. మీకు దూరంగా ఉండాల్సి వచ్చినందుకు చాలా బాధపడుతున్నా ఉద్యోగం మానేసి రావాలని అనిపిస్తుందని ప్రేమ్ బాధపడతాడు. కాసేపు తల్లీకొడుకుల ప్రేమ కంటతడి పెట్టిస్తుంది. కొడుకు, కోడలికి బొట్టు పెట్టి బట్టలు ఇచ్చి వాళ్ళని సాగనంపుతుంది. తల్లిదండ్రులు తనని కలవకుండా వెళ్లినందనుకు దివ్య బాధపడుతుంది. అక్కడి దాకా వెళ్ళి దివ్యని చూడకుండా వచ్చినందుకు తులసి బాధపడుతుంది. అప్పుడే దివ్య ఫోన్ చేస్తుంది.
నాకు కోపం వచ్చింది, నీ దోస్త్ కటీఫ్. అసలు ఏమనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీరే గుర్తుకు వస్తున్నారు. నేను కన్నీళ్ళు పెట్టుకుంటున్నారని తెలిస్తే మీరు బాధపడతారని దిగమింగుకుంటున్నా. అమ్మ ఒడిలో పడుకోలేను, నా దిగులు మీకు తెలుసా ఇక్కడి దాకా వచ్చి నన్ను చూడకుండా మాట్లాడకుండా ఎలా వెళ్లాలని అనిపించింది. పెళ్లి చేస్తే బాధ్యత తిరిపోయిందని అనుకుంటున్నారా అని ఏడుస్తుంది. నీ గురించి మీ అత్తని అడిగితే నిద్రపోతున్నావని చెప్పారు అందుకే వచ్చేశామని తులసి చెప్తుంది.
Also Read: అబ్బబ్బ, వాట్ ఏ ట్విస్ట్- రంగంలోకి దిగిన కావ్య, ఇక రాహుల్ కి దబిడి దిబిడే
దివ్య: నేను నిద్రపోలేదు నాకు మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు లేదని నీకు తెలుసు కదా
తులసి: ఎక్కువ సేపు గదిలో ఉంటే పడుకున్నావని అనుకున్నారు ఏమో. ఆవిడ లోపలికి వెళ్ళమంటుందని ఎదురుచూశాం కానీ అనలేదు. రేపు వ్రతం ఉంది కదా అప్పుడు కలుసుకుందామని అంటుంది. దివ్య నిద్రపోతుందని ఎందుకు అబద్ధం చెప్పిందని తులసి రాజ్యలక్ష్మి మీద అనుమానపడుతుంది. నందు నిజమేనని మనసులో అనుకుని పైకి మాత్రం అదేమీ లేదులే అని సర్ది చెప్తాడు. విక్రమ్ శోభనం గురించి తెగ ఆరాటపడుతూ ఉంటాడు. బయట నుంచి వచ్చిన విక్రమ్ ని ఎక్కడికి వెళ్లారని బసవయ్య అంటాడు. పూజకి పూలు కావాలని దివ్య అడిగితే దగ్గర్లో దొరుకుతాయేమోనని విక్రమ్ అంటుంటే నేను ఎప్పుడు తెమ్మన్నానని దివ్య వచ్చి ఇరికిస్తుంది. దేవుడు నువ్వే చెప్పావు కదా విక్రమ్ తనని ఇరికిస్తాడు.
Also Read: కృష్ణనా మజాకా, పెళ్లి మండపానికి చేరుకున్న గౌతమ్- భవానీ ఏం చేయనుంది?
పొద్దున్నే లేవాలి అలారం పెట్టుకోమని రాజ్యలక్ష్మి అంటే పెళ్లి అయింది కదా అంటాడు. పొద్దున్నే నిద్రలేపడానికి దివ్య పక్కనే ఉంటుందని విక్రమ్ చెప్తాడు. మీకు ఫస్ట్ నైట్ అని ఎవరు చెప్పారని అనేసరికి విక్రమ్ షాక్ అవుతాడు. రేపు వ్రతం అయ్యాక పంతులు ముహూర్తం పెడతాడని రాజ్యలక్ష్మి చెప్తుంది. పాపం విక్రమ్ మొహం మాడిపోతుంది. ఈరోజు దివ్యని తన గదిలో పడుకోమని అంటుంది. వద్దులే నేను తాతయ్య దగ్గర పడుకుంటా దివ్య నా గదిలో పడుకుంటుందని అంటాడు. నందు బాధగా ఆలోచిస్తూ ఉంటే తులసి వస్తుంది. రాజ్యలక్ష్మి గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు.