Brahmamudi April 22nd: అబ్బబ్బ, వాట్ ఏ ట్విస్ట్- రంగంలోకి దిగిన కావ్య, ఇక రాహుల్ కి దబిడి దిబిడే
స్వప్న వెళ్ళిపోయింది రాహుల్ తో అని తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్యని పుట్టింట్లో వదిలి రావడానికి ఇందులో తన తప్పేమీ లేదని రాజ్ చెప్తాడు. నీ కొడుకే తప్పేమీ లేదని చెప్పినప్పుడు నీకేంటి అభ్యంతరమని ఇంద్రాదేవి అడుగుతుంది. ఉంది పెళ్ళికి ముందు రాజ్ వేరు ఇప్పుడు రాజ్ వేరు ఈ పిల్ల మామూలుది కాదు నా కొడుకుని మాటలతో మార్చేసింది. రకరకాల పిండి వంటలు పెట్టి వాడికి వాళ్ళ మీద కోపం పోయేలా చేసుకున్నారు. ఈ పిల్ల ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి నా కొడుకు నా మాట వినడం లేదు. అత్తమామ నన్ను మాట్లాడనివ్వడం లేదు. అటువంటి ఈ పిల్ల ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. నిన్ను కన్నందుకు నీ తప్పులు క్షమిస్తాను. కానీ తనని నేను క్షమించలేను. కోడలిగా ఒప్పుకోలేను. నువ్వు నా కొడుకుగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఆమెని గడప బయటే వదిలేసి రా. లేదు తనని తీసుకుని వస్తానంటే నాకు కొడుకే లేడని అనుకుంటాను. నువ్వు కేవలం దుగ్గిరాల కుటుంబ వారసుడిగా మాత్రమే మిగిలిపోతావని అంటుంది.
Also Read: కృష్ణనా మజాకా, పెళ్లి మండపానికి చేరుకున్న గౌతమ్- భవానీ ఏం చేయనుంది?
ఇంద్రాదేవి: కొడుకుగా మిగలడం కోసం భర్తగా వదులుకోమని అంటున్నావా? నీకు కోడలి మీద కోపం ఉంటే ఎప్పటిలా మాట్లాడకు అంతే కానీ నా మనవడిని బలి పశువు చేయకు
రుద్రాణి: ఏంటి వదిన నువ్వు ఇంత మంది మాట వినకుండా ఇలా చేస్తావ్ వాడికి ఎప్పటికీ నువ్వు అంటే గౌరవమే. ఎంతమంది కాపురాలు విచ్చిన్నం చేస్తావ్. నా కాపురం విడగొట్టింది చాలదా
ధాన్యలక్ష్మి: నన్ను తిడితే తిట్టు కానీ భార్యాభర్తలను ఎవరు విడిపొమ్మని చెప్పరు రాజ్ ని ఇరకాటంలో పెట్టకు
ఇది మీ తల్లీకొడుకుల సమస్య నువ్వే తేల్చుకోమని సీతారామయ్య అంటాడు. దీంతో రాజ్ కావ్య ఇచ్చిన మాట గుర్తు చేసుకుని లోపలికి వెళ్ళమని అంటాడు. ఇందులో నీ తప్పేమీ లేదు నిన్ను మీ పుట్టింటికి వెళ్ళమని చెప్పే హక్కు లేదని చెప్తాడు. కావ్య మాత్రం క్షమించండి నేను లోపలికి రాలేనని అంటుంది. ఏంటి నిన్ను బతిమలాడుకోవాలా అంటే నన్ను కాదు మీ అమ్మని బతిమలాడుకోండి ఇంతమంది ముందు ఆమెని అవమానించారని చెప్తుంది.
చెంప పగలగొడతాను నోరు మూసుకుని ఇంట్లోకి అడుగుపెట్టమని కావ్యని ఇంద్రాదేవి తిడుతుంది. స్వప్న రాహుల్ కి కాల్ చేస్తుంది. రాహుల్ చేసిన కాల్ కావ్య లిఫ్ట్ చేసి ఏం విన్నదని స్వప్న టెన్షన్ పడుతూ ఉంటుంది. ఫోన్ కారులో ఉండటంతో లిఫ్ట్ చేయడు. నా కాపురం నిలబడాలి అంటే దాని వెనుక ఉన్న వాడు బయటకి రావాలి. దాన్ని నమ్మించి మోసం చేసిన వాడిని కనిపెట్టాలని కావ్య చెప్పిన విషయం అప్పు గుర్తు చేసుకుంటుంది. రాజ్ తల్లి దగ్గరకి వస్తాడు కానీ మొహం తిప్పేసుకుంటుంది. రాజ్, అపర్ణ మాట్లాడుకోవడం కళ్యాణ్ వింటాడు.
రాజ్: ఇదంతా నటన మమ్మీ నిజమే చెప్తున్నా. నేను కళావతి ఇంటికి వెళ్ళింది తన మీద ప్రేమతో కాదు స్వప్న తన ఇంట్లో ఉందనే అనుమానంతో. నా అనుమానమే రుజువు అయ్యింది. తనని రాత్రి ఆ ఇంట్లో చూశాను. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. నీ మాట కాదని వెళ్ళడానికి అదే కారణం. కావ్య వల్లే స్వప్న వెళ్లిపోయిందని రుజువు చేసి తనని వెళ్లగొడతాను
Also Read: దివ్య, విక్రమ్ ఫస్ట్ నైట్ జరగకుండా చేసిన రాజ్యలక్ష్మి- తులసికి నందు నిజం చెప్పేస్తాడా?
అపర్ణ: అంటే నీ భార్య అందరినీ మోసం చేసిందా
రాజ్: అవును నన్ను పెళ్లి చేసుకోవడం కోసం స్వప్నని తప్పించింది. కాదని కళావతి వాదిస్తుంది. కళావతి ఈ ఇంట్లో ఉండాలా వెళ్లిపోవాలా అనేది తన మీద ఆధారపడి ఉంటుంది.
అపర్ణ: ఏది ఏమైనా ఆ నిజం బయట పెట్టడం కోసం నీ భార్యని మోసం చేయడం కరెక్ట్ కాదు ఇది ఇక్కడితో ఆపేసేయ్ తను ఏం నిరూపించుకుంటుందో నిరూపించుకొనివ్వు
స్వప్న మళ్ళీ రాహుల్ కి కాల్ చేస్తుంది. పక్కకి వచ్చి మాట్లాడతాడు. ఫోన్ చేస్తే ఏం మాట్లాడకుండ ఉన్నావ్ ఏంటని ఆ కాల్ లిఫ్ట్ చేసింది తను కాదు కావ్య అని చెప్పేసరికి షాక్ అవుతాడు. ఏం మాట్లాడాను జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అసలు వాళ్ళు ఉండగా నిన్ను ఇంటికి వెళ్లవద్దంటే ఎందుకు వెళ్ళావని తిడతాడు. స్వప్న రాహుల్ తో మాట్లాడుతున్నది మొత్తం అప్పు వీడియో తీస్తుంది. నువ్వు మీ వాళ్ళని తీసుకొచ్చి సంబంధం మాట్లాడితే సరే లేదంటే నేనే ఇంటికి వచ్చి మీ తాతతో మొత్తం చెప్పేస్తానని బెదిరిస్తుంది. అలా మాట్లాడకు స్వప్న అని పక్కకి తిరిగే సరికి కావ్య ఎదురుగా ఉంటుంది. మీరు మా అక్క స్వప్నని రౌడీల నుంచి కాపాడారంట కదా