News
News
X

Gruhalakshmi August 20th Update: తులసి, సామ్రాట్ పెళ్లి చేస్తానన్న నందు- పరంధామయ్యకి గుండె నొప్పి

నందు, సామ్రాట్ తప్పతాగి రచ్చ రచ్చ చేస్తారు. వాళ్ళ ఇద్దరినీ తులసి, లాస్య అతి కష్టం మీద హోటల్ కి తీసుకుని వస్తారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

తప్పతాగిన సామ్రాట్, నందుని తులసి, లాస్య కలిసి హోటల్ రూమ్ కి తీసుకొస్తారు. నందు తాగిన మైకంలో తులసి వెళ్ళిన వైపు చూపించి నచ్చిందా అని సామ్రాట్ ని అడుగుతాడు. నిజంగా నువ్వు ఇష్టపడితే రాయబారం చేసి దగ్గరుండి మరి మీ పెళ్లి చేస్తాను అని అంటాడు. నేను నిజంగానే తులసి గారిని చాలా ఇష్టపడుతున్నాను అని అంటాడు. ఆ మాటకి బిత్తరపోయిన నందు పేరెంటి అన్నావ్ తులసినా అభి వాళ్ళ అమ్మ చదువు రాదు అత్తామామాల్ని తనదగ్గరే ఉంచుకుంటుంది ఆ తులసే కదా అని అంటాడు. వద్దు తమ్ముడు తులసిని మర్చిపో దూరంగా ఉండు అని నందు అంటాడు. అదేంటి అన్నయ్యా ఇప్పుడేగా తులసితో పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చావ్ అప్పుడే నా ఆశల మీద నీళ్ళు చల్లుతావా అని సామ్రాట్ అంటాడు. అది కాదురా తమ్ముడు.. ఆ తులసి నా భార్య అని నందు ఏడుస్తూ చెప్తాడు. వెంటనే సామ్రాట్ పెద్దగా నవ్వుతూ నీకు మతిమరుపు వచ్చిందన్నయ్యా నీ భార్య తులసి అంటే నందు మరి ఇంకెవరూ అని అడుగుతాడు. లూసీ కాదు కాదు లాస్య అంటాడు. భలే గుర్తు చేశావ్ పొరపాటున నా మాటలు లాస్య విని ఉంటే నా పని దబిడీ డిబిడె అని అనుకుంటారు.

Also Read: వాయమ్మో ఏందయ్యా ఈ రచ్చ- చిందులేసిన నందు, సామ్రాట్- తలలు పట్టుకున్న తులసి, లాస్య

ఎందుకో తులసిని నేను పెళ్లి చేసుకుని వదిలేశాను అని అనిపిస్తుంది. అభి పుట్టాడా.. ప్రేమ్ పుట్టడా.. దివ్య పుట్టిందా అప్పటికి కూడా నాకు తులసి మీద ప్రేమ పుట్టలేదు తమ్ముడు అని నందు వాగుతూ ఉంటే అటు లాస్య, ఇటు తులసి వాళ్ళ కోసం వస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక గాలిపటం ఉంది అది ఎగరేస్తుంటే తెగిపోయింది ఎవరిది అంటావ్ అని సామ్రాట్ అంటే ఎవరికి దొరికితే వాళ్ళది అని నందు అంటాడు. నాకు దొరికింది అని సామ్రాట్ అంటాడు. నందు తలగోక్కుంటూ అంటే తెగిపోయిన నా గాలిపటం నీది అంటావా అని అంటాడు. అవును తులసి గాలిపటం కూడా నాదే అని సామ్రాట్ చెప్పేస్తాడు. అప్పుడే అక్కడికి తులసి వస్తుంది. తెగిపోయిన గాలిపటమా అని సామ్రాట్ అంటే అవును నీదే అని చెప్తాడు. ఇక నందుని లాస్య తన గదికి తీసుకెళ్లిపోతుంది.

పరంధామయ్య గుండెల్లో నొప్పితో బాధపడుతూ ఉంటే అనసూయ లేచి చూసి కంగారు పడుతుంది. సమయానికి తులసి కూడా ఇంట్లో లేదు అని అనసూయ టెన్షన్ పడుతుంది. మరో వైపు సామ్రాట్ ని తులసి స్ట్రెచర్ మీద పడుకోబెట్టుకుని గదికి తీసుకొస్తుంది. ఇక తెల్లారిపోతుంది లేచి టైం చూసుకునేసరికి 11.30 అవుతుంది. ఇక తులసి అయినా లేపాలి కదా మీటింగ్ ఉంది కదా అని తులసి గదికి వెళ్ళి డోర్ కొడతాడు. లక్ చేసి ఉండటంతో ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటాడు. ఇక నందు, లాస్య గది డోర్ కొడతాడు. టైం ఎంత అయ్యిందో తెలుసా 11.30.. క్లయింట్ తో మన మీటింగ్ 10 కి అంటాడు. మీరు వెళ్లొచ్చేశారా అని నందు అంటాడు లేదు నేను ఇప్పుడే నిద్ర లేచానని చెప్తాడు. మనం పడుకున్నాం తులసి అయినా లేపాలి కదా అని లాస్య అంటుంది. అప్పుడే తులసి బయట నుంచి వస్తుంది. ఏమైపోయారు తులసిగారు అని సామ్రాట్ అడిగితే బాధ్యతతో మీటింగ్ కి వెళ్ళొస్తున్నాను అని చెప్తుంది.

Also Read: రెచ్చిపోతే సచ్చిపోతావంటూ మాధవకి వార్నింగ్ ఇచ్చిన రాధ - భాగ్యమ్మ చివరి కోరిక రుక్మిణి తీరుస్తుందా?

తెల్లారి మీ అందరినీ నిద్రలేపడానికి ప్రయత్నించాను ఎవరు లేవలేదు, ఇక చేసేది ఏమి లేక నేనే మీటింగ్ కి వెళ్ళి మన ప్రపోజల్ ఏంటో చెప్పి వచ్చాను అంటుంది. అసలు నీకు బుద్ధి ఉందా నువ్వేంటి నీ చదువు ఏంటి బాస్ కి చెప్పకుండా పక్కన ఎవరు లేకుండా నువ్వు ప్రపోజల్ చెప్పడం ఏంటని లాస్య అరుస్తుంది. నువ్వు వెళ్ళి చెప్పడానికి ఆదేమైన వంటా వార్పు ప్రోగ్రామ్ అనుకుంటున్నావా అని నందు కూడా తిడతాడు. మీ ఆలోచన బాగానే ఉండి తులసిగారు కానీ ఒక్కరే వెళ్తే ఎలా అని సామ్రాట్ కూడా అనేసరికి తులసి కలల నిండా నీళ్ళతో సోరి సామ్రాట్ గారు చదువు లేని దాని తెలితక్కువ దాన్ని కదా ఇంకోసారి ఇలా ఎప్పుడు చెయ్యను అని బాధగా వెళ్ళిపోతుంది. అప్పుడే క్లయింట్ సామ్రాట్ కి ఫోన్ చేస్తాడు.  

తరువాయి భాగంలో..

పరంధామయ్య గుండెల్లో నొప్పితో అల్లాడిపోతుంటే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ప్రేమ్ తులసికి ఫోన్ చేసి విషయం చెప్తాడు. దీంతో తులసి కంగారుగా సామ్రాట్ వాళ్ళ దగ్గరకి వచ్చి మా మావయ్య గారికి గుండెల్లో నొప్పి వచ్చిందంట అని చెపేసరికీ నందు షాక్ అవుతాడు.

Published at : 20 Aug 2022 09:02 AM (IST) Tags: Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Today Episode Written Update Gruhalakshmi Serial Gruhalakshmi Serial August 20th

సంబంధిత కథనాలు

SSMB28: మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ - త్రివిక్రమ్ ఒప్పుకుంటారా?

SSMB28: మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ - త్రివిక్రమ్ ఒప్పుకుంటారా?

Godfather Vs Ghost : 'గాడ్ ఫాదర్' వర్సెస్ 'ఘోస్ట్' - ఒకటి టమోటా, ఇంకొకటి ఉల్లిపాయ్  

Godfather Vs Ghost : 'గాడ్ ఫాదర్' వర్సెస్ 'ఘోస్ట్' - ఒకటి టమోటా, ఇంకొకటి ఉల్లిపాయ్  

Chiranjeevi: 'దర్శకుడు చెప్పినట్లే చేశా' - 'ఆచార్య' ప్లాప్ పై చిరు కామెంట్స్!

Chiranjeevi: 'దర్శకుడు చెప్పినట్లే చేశా' - 'ఆచార్య' ప్లాప్ పై చిరు కామెంట్స్!

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?