Gruhalakshmi August 19th Update: వాయమ్మో ఏందయ్యా ఈ రచ్చ- చిందులేసిన నందు, సామ్రాట్- తలలు పట్టుకున్న తులసి, లాస్య
తులసి విషయంలో నందు సామ్రాట్ తో గొడవపడటంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసి, సామ్రాట్ ఉన్న రెస్టారెంట్ కి నందు లాస్య కూడా వస్తారు. అక్కడ తులసిని చూస్తాడు. అప్పుడే సామ్రాట్ కి పొలమారడంతో తులసి తన తల మీద నిమిరి నీళ్ళు తాగిస్తుంది. అది చూసి నందు రగిలిపోతాడు. తులసి వెనక్కి తిరిగి తన సీట్ లో కూర్చోడానికి వెళ్లబోతుంటే అటుగా వెళ్తున్న వెయిటర్ తనకి తగలడంతో తులసి సామ్రాట్ ఒళ్ళో పడిపోతుంది. తర్వాత సామ్రాట్ ఫ్రెండ్ కలవడంతో మాట్లాడటానికి పక్కకి వెళ్ళగానే నందు వచ్చి తులసి ముందు కూర్చుంటాడు. వెటకారంగా గుడ్ ఈవినింగ్ మేడమ్ అంటాడు. మొన్న ఎక్కడో చదివాను ఏవో ఐదు రాశులు ఉన్నవారికి అదృష్టం జలగలా పట్టుకుంటుందంట, పట్టిందల్లా బంగారామేనంట.. ఆ ఐదు రాశుల్లో మీ రాశి కూడా ఉన్నట్టుండి అని నందు వెటకారం చేస్తాడు. నన్ను వదిలించేసుకున్నా నా జాతకాన్ని బాగానే ఫాలో అవుతున్నట్టు ఉన్నారే అని తులసి చురకేస్తుంది. ఈర్ష్యగా ఉందా అని తులసి అంటే ఉంది అని చెప్తే సంతోషపడదామనా అని నందు అంటాడు. లేదు అని చెప్పినా నేను నమ్మనులే అని గాలి తీసేస్తుంది.
ఇక తులసి సామ్రాట్ కోసం, లాస్య నందు కోసం వెతుక్కుంటూ ఉంటారు. లాస్య వచ్చి చిలక ఒక్కతే ఉంది మరి గోరింక ఎక్కడా నందు అసలే చిరాకులో ఉన్నాడు సామ్రాట్ కనిపిస్తే రెచ్చిపోతాడేమో చూసుకోవాలి అని మనసులో అనుకుంటుంది. నందు వాష్ రూమ్ లో ఉండగా పక్కనే సామ్రాట్ కూడా ఉంటాడు. తులసి జోలికి వెళ్లకు, తన విషయంలో అతిగా వెళ్లకు అని నందు సామ్రాట్ తో అంటాడు. అర్థం లేకుండా మాట్లాడకు అని సామ్రాట్ కోపంగా చెప్తాడు. అర్థం లేకుండా కాదు అర్థం చేసుకున్నాక నీ ప్రవర్తన చూసినాకే మాట్లాడుతున్నా.. తులసి విషయంలో నీ లిమిట్స్ లో నువ్వు ఉండు అని నందు హెచ్చరిస్తాడు. సేమ్ టు యు నా విషయంలో కూడా నోరు జారకని సామ్రాట్ చెప్తాడు. అయిన నువ్వు ఏ హక్కుతో నాకు వార్నింగ్ ఇస్తున్నావ్ నేను నీ బాస్ ని ఆ సంగతి మర్చిపోకూ అని సామ్రాట్ అంటే నేను తులసి మాజీ భర్తని ఆ విషయం నువ్వు తెలుసుకో అని అరుస్తాడు. ఓ తులసిని టార్చర్ చేసి ఏడిపించి బాధపెట్టి డైవర్స్ తీసుకుంది నువ్వేనా ఇడియట్ అని సామ్రాట్ నందు కాలర్ పట్టుకుంటాడు. ఎవడ్రా ఇడియట్ అని నందు కూడా ఆవేశంగా సామ్రాట్ కాలర్ పట్టుకుని తోసేస్తాడు. వెళ్ళి తులసి కూర్చున్న టేబుల్ మీద పడతాడు. ఇద్దరు కలబడి కొట్టుకుంటారు. తులసి, లాస్య వెళ్ళి వాళ్ళని పక్కకి లాగేందుకు ప్రయత్నిస్తారు. లాస్య పక్కన పడిపోయి తెరుకుంటుంది. ఇదంతా లాస్య కన్న కల.
Also Read: రెచ్చిపోతే సచ్చిపోతావంటూ మాధవకి వార్నింగ్ ఇచ్చిన రాధ - భాగ్యమ్మ చివరి కోరిక రుక్మిణి తీరుస్తుందా?
తులసి కూడా సామ్రాట్ కోసం టెన్షన్ పడుతుంది. దేవుడా నా కల నిజం కాకుండా చూడు అని లాస్య వణికిపోతుంది. అటు తులసి కూడా సామ్రాట్ ఎటుపోయాడా అని ఆలోచిస్తూ వెతుకుతుంది. ఎవరి కోసం వెతుకుతున్నావ్ అని లాస్య వచ్చి అడుగుతుంది. ఫోన్ చెయ్యమని లాస్య అంటుంది. నందు కూడా ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు అని ఇద్దరు కలిసి వాళ్ళిద్దరినీ వెతుకుతూ వెళతారు. ఒక చోట నందు, సామ్రాట్ తాగుతూ కూర్చుని పగలబడి నవ్వడం చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఫుల్ గా తాగేసి నందు, సామ్రాట్ చిందులు వేస్తారు. ఇద్దరు డాన్స్ ఇరగదీసేస్తారు. పెద్ద మనిషిలాగా ఉండే సామ్రాట్ గారు మందు పడగానే ఇలా ఆయనతో కలిసి చిందులేస్తున్నారు ఏంటి అని తులసి అనుకుంటుంది. ఇక లాస్య నందుని, తులసి సామ్రాట్ ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు.
తాగిన మత్తులో నందు, సామ్రాట్ భయంకరమైన కామెడీ చేస్తారు. నందుని సామ్రాట్ అన్నయ్యా అని పిలిస్తే నందు తమ్ముడూ అని కౌగలించుకుంటాడు. అది చూసి లాస్య తలబాదుకుంటుంది. మందు పడగానే వీళ్ళకి ఎక్కడ లేని చుట్టరికాలు బయటకి వస్తాయి అని లాస్య అని వీడియో తీస్తాను అని తిక్క కుదురుతుంది అనుకుంటుంది. వద్దు లాస్య బాగోదని తులసి చెప్తుంది.
Also Read: నేను గెలిచాను వసుధార అన్న ఈగోమాస్టర్, జగతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి
తరువాయి భాగంలో..
తెల్లారేసరికి నందు, సామ్రాట్ మందు దిగిపోతుంది. లాస్య గది నుంచి బయటికి రాగానే సామ్రాట్ కోపంగా టైం ఎంత అయిందో తెలుసా 11.30. క్లయింట్ తో మన మీటింగ్ 10 గంటలకి అని అరుస్తాడు. అప్పుడే తులసి మీటింగ్ కి వెళ్ళి వస్తున్నా అని చెప్తుంది. నువ్వేంటి నీ చదువు ఏంటి అని లాస్య అంటే. నువ్వు వెళ్ళి ఎక్స్ ప్లేన్ చెయ్యడానికి ఇదేమన్నా వంట వారపు ప్రోగ్రామ్ అనుకుంటున్నావా అని నందు ఎగురుతాడు. సామ్రాట్ మాత్రం తప్పు చేసిన వాడిలాగా తల దించుకుంటాడు.