News
News
X

Gruhalakshmi August 18th Update: తులసి మీద అరిచిన సామ్రాట్, నీచంగా మాట్లాడిన లాస్య- ప్రేమ్ దగ్గరకి వెళ్లనని తేల్చి చెప్పిన శ్రుతి

తులసి సముద్రంలో కొట్టుకుపోయిందని సామ్రాట్ కంగారు పడతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

తులసి సముద్రంలో కొట్టుకుపోయిందని భయపడిపోయిన సామ్రాట్ తులసి తులసి అని గట్టిగా అరుస్తూ చాలా బాధపడతాడు. అప్పుడే సామ్రాట్ గారు అని తులసి పిలుస్తుంది. అటువైపు వెళ్తే మీరే ప్రమాదం అని నాకు చెప్పి మీరే వెళ్తున్నారు ఏంటి మర్చిపోయారా? అని అడుగుతుంది. సామ్రాట్ తులసిని అలా చూస్తూ ఉంటాడు. ఎందుకు అలా చూస్తున్నారు నా మొహంలో కోతులు ఆడుతున్నాయా అని తులసి జోక్ గా అడిగితే సామ్రాట్ కోపంగా షటప్ అని అరుస్తాడు. ‘ఎందుకు అలా టెన్షన్ పెడతారు, ఇంతక ముందు వరకు నా కళ్ల ముందే ఉన్నారు కదా ఎక్కడికి వెళ్లారు నాకు చెప్పక్కర్లేదా, ఎవరో ఒక ఆవిడ అలలతో పాటు లోపలికి కొట్టుకుని పోయిందంట అది మీరే అనుకుని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇంకొక్క క్షణం ఉంటే నేను కూడా లోపలికి వెళ్లిపోయేవాడిని మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత నాదే కదా మీకేమైన అయి ఉంటే మీ వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి, చిన్న పిల్లల సముద్రంలో ఆడుకున్నంత మాత్రాన మీరేమి చిన్న పిల్లకాదు కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి’ అనేసి సామ్రాట్ కోపంగా వెళ్ళిపోతాడు.

Also Read: యష్ ఇంట ఖైలాష్ తుఫాన్ - భర్త ఇచ్చిన చీర కట్టుకుని మురిసిన వేద, యష్ కంటతడి

తులసి సామ్రాట్ దగ్గరకి వస్తుంది. చిన్న పిల్లని కాదు కాబట్టే మీరు చెప్పిన వైపు వెళ్లలేదు. వేడి వేడిగా మొక్కజొన్న పొత్తులు తినాలని అనిపించింది మీకు చెప్దామని అనుకుంటే ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉన్నారు అందుకే నేనే వెళ్ళాను అని అమాయకంగా మొహం పెట్టి చెప్తుంది. ఇంత జరుగుతుందని ఈ కాసేపటిలో ఇంత టెన్షన్ పడతారని తెలియదు క్షమించండి అని మొక్కజొన్నతినమని ఇస్తుంది. ఆ మూమెంట్లో తులసి ఎక్స్ప్రెషన్స్ చూస్తే దేవుడా అని ప్రేక్షకులకి తలబాదుకోవాలని అనిపిస్తది. ఆ మాటలకి సామ్రాట్ నవ్వుతాడు. ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ వెళ్తుంటే నందు, లాస్య ఎదురుపడతారు.

అంకిత ప్రేమ్ గురించి ఆలోచిస్తూ ఉంటే తనకి ఫోన్ వస్తుంది. వెంటనే అదిలాబాద్ రమ్మని హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేస్తారు. వెంటనే బయల్దేరుతుంది. ఇక లాస్య తులసికి మల్లెపూలు ఇస్తుంది. మీరు పెట్టుకుంటారా లేకపోతే నేను అని వెటకారంగా అంటుంది. నాకు మల్లెపూలు ఇష్టం లేదని తులసి కోపంగా చెప్తుంది. పాపం ప్రేమగా ఇస్తుంది తీసుకోండి తులసి గారు అని సామ్రాట్ చెప్తాడు. లాస్య వెళ్ళి తులసి తలలో పెడుతుంది. ఇద్దరి కోసం తీసుకున్నామని చెప్పావ్ కదా మరి నీకేవీ అని అడుగుతాడు. బ్యాగ్ లో ఉన్నాయని అబద్ధం చెప్తుంది. జడ వేసుకుని రూమ్ కి వెళ్ళినాక పెట్టుకుంటాను అని చెప్తుంది. రూమ్ కి వెళ్దామని తులసి అంటే అప్పుడే ఎందుకు తులసి సరదాగా బీచ్ కి వచ్చావ్ కదా కాసేపు ఎంజాయ్ చెయ్యి బాస్ కూడా చెప్తున్నారు కదా అని ఇన్ డైరెక్ట్ గా నీచంగా మాట్లాడుతుంది.

Also Read: దేవి ముందు ఆదిత్యని ఇరికించి పైశాచికానందం పొందిన మాధవ- రాధ, ఆదిత్యల ఆవేశం

శ్రుతి ప్రేమ్ మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ప్రేమ్ ని హార్ట్ చేసి అసలు నీ వైపు రాకుండా నీ గురించి ఆలోచించకుండా చేశావ్ అని కౌసల్య అంటే అసలు నేను ఏం తప్పు చేశాను అని శ్రుతి అడుగుతుంది. ప్రేమతో అతన్ని దారిలోకి తెచ్చుకుంటావ్ అనుకున్నాను కానీ నువ్వు అతని ఇగో మీద దెబ్బకొట్టావ్ ప్రేమ్ ని వాళ్ళ నాన్నతో పోల్చి బాధపెట్టావ్. తనకి వాళ్ళ నాన్న అంటే చచ్చేంత కోపం అని తెలిసి కూడా ఎందుకు అలా రెచ్చగొట్టావ్ అని అడుగుతుంది. ప్రేమ్ పద్ధతి నాకు నచ్చలేదు అందుకే రియాక్ట్ అయ్యానని చెప్తుంది. ‘తను మాట్లాడిన పద్ధతి నీ మీద అరవడం నాకు నచ్చలేదు మర్యాద పోగొట్టుకున్నాడు. ఎంత అవసరం ఉన్నా రాజకం చెయ్యడం అంటే మనసు చంపుకోవడం కానీ నేను చేశాను ఎందుకు ప్రేమ్ కోసం, సంసార బాధ్యతల్లో పడి తన శక్తి మర్చిపోకుండా ఉండటం కోసం ఇలా చేస్తే దాన్ని అర్థం చేసుకోకుండా ఇలా అంటాడా, నేను గిరి గీసుకుని కూర్చుని అతని ఉద్యోగానికి నాకు ఎలాంటి సంబంధం లేదని అంటే ఏం జరిగేది ఎక్కడ ఉండాల్సిన పనులు అక్కడే ఉండేవి ఆ మాత్రం తెలియదా? నా మీద  ప్రేమతో వచ్చి ఉంటే సంతోషంగా వెళ్ళేవాడిని కానీ అంకిత చెప్పిందని తన మనసు మార్చుకుని వచ్చాడు. ఇలాంటి వాడిని నమ్మి ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ ఇలా ప్రవర్తించడని నమ్మకం ఏంటి’ అని అడుగుతుంది. అలా ఉండకూడదు నేను వెళ్ళి ప్రేమ్ తో మాట్లాడతాను అంటే శ్రుతి వద్దు నమ్మకం కుదిరే వరకు వెళ్ళను అని తేల్చి చెప్తుంది. తులసి, సామ్రాట్ రెస్టారెంట్ లో కూర్చుని సరదాగా గడుపుతూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. నందు, లాస్య కూడా అదే రెస్టారెంట్ కి వస్తారు.      

Published at : 18 Aug 2022 08:21 AM (IST) Tags: Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Today Episode Written Update Gruhalakshmi Serial Gruhalakshmi Serial August 18th

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Rana Naidu Web Series: బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానానాయుడు' టీజర్ రిలీజ్

Rana Naidu Web Series: బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానానాయుడు' టీజర్ రిలీజ్

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల