NC 24 Update : నాగ చైతన్య - కార్తీక్ దండు సినిమాకు క్రేజీ టైటిల్... 'విరూపాక్ష' అంత పవర్ ఫుల్గా ఉందా?
NC 24 Update : నాగ చైతన్య - కార్తీక్ దండు సినిమాకు మేకర్స్ క్రేజీ టైటిల్ ను అనుకుంటున్నారనే రూమర్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆ టైటిల్ ఇదేనా ?

NC 24 Movie Name : అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా వచ్చే నెల భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందే నాగ చైతన్య నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందబోతున్న నాగచైతన్య నెక్స్ట్ మూవీకి మేకర్స్ క్రేజీ టైటిల్ ను అనుకుంటున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
నాగచైతన్య - కార్తీక్ దండు మూవీ టైటిల్ ఇదే ?
నాగ చైతన్యం 'విరూపాక్ష' ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీని చేయబోతున్నారు. ఇప్పటికి దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసిన విషయం తెలిసిందే. షూటింగ్ లాంచనాలతో మూవీ స్టార్ట్ అయ్యింది కూడా. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. 2025 చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఇంకా ఈ మూవీకి మేకర్స్ టైటిల్ ని ఖరారు చేయలేదు.
తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య - కార్తీక్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు 'వృషకర్మ' అనే టైటిల్ ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కార్తీక గత చిత్రం 'విరూపాక్ష' అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఆడియన్స్ ని ఇట్టే అట్రాక్ట్ చేసింది. మరి ఇప్పుడు 'వృషకర్మ' అనే ఈ టైటిల్ అలా జనాలని ఆకట్టుకోగలదా ? అనే అయోమయంలో ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. దీంతో ఇంకా ఈ టైటిల్ ని లాక్ చేయలేదు కానీ, ప్రస్తుతం 'వృషకర్మ' అనే టైటిల్ తో పాటు మరికొన్ని టైటిల్స్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
'తండేల్' తరువాత చిన్న బ్రేక్
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రూపొందుతుంది 'తండేల్'. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను దాదాపు 96 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాకుళం ప్రాంతంలోని ఓ సముద్రతీర గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా 'తండేల్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను మేకర్స్ మొదలు పెట్టేశారు. 'తండేల్' మూవీ రిలీజ్ అయ్యాక నాగ చైతన్య చిన్న బ్రేక్ తీసుకుని, తన నెక్స్ట్ మూవీ ని మొదలు పెట్టబోతున్నారని సమాచారం.
Also Read: నీ మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి - తమన్ ఎమోషనల్ కామెంట్స్‌పై చిరంజీవి రియాక్షన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

