Serial Actor Chandu Death: చందు సూసైడ్ కేసులో కీలకం కానున్న వాట్సాప్ ఛాట్ - మెసేజులు చెక్ చేస్తున్న పోలీసులు?
Trinayani Actor Chandu Death: పవిత్రా జయరాం యాక్సిడెంట్ డెత్ తర్వాత 'త్రినయని' సీరియల్ యాక్టర్ చందు సూసైడ్ టీవీ ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఈ కేసులో వాట్సాప్ ఛాట్ కీలకం కానుందని టాక్.
Serial Actor Chandu Death News: తెలుగు టీవీ ఇండస్ట్రీ ఐదు రోజుల్లో ఇద్దరు ఆర్టిస్టుల్ని కోల్పోయింది. 'త్రినయని' సీరియల్ ఫేమ్, నటి పవిత్రా జయరామ్ ఈ నెల 12న (ఆదివారం) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ కారులో ఉన్న నటుడు, ఆమెతో ఆరేళ్లుగా సహ జీవితం చేస్తున్న చందు అలియాస్ చంద్రకాంత్ శుక్రవారం రాత్రి బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నారు. తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో చందు వాట్సాప్ ఛాట్ కీలకం కానున్నట్లు తెలిసింది.
చందు చివరగా ఎవరికి మెసేజ్ చేశారు?
Pavitra Jayaram Lover Chandu Death: పవిత్రా జయరామ్ మరణం తర్వాత చందు నిరాశలోకి వెళ్లారు. ఆమె లేని జీవితం ఊహించుకోవడం తన వల్ల కాదని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. డిప్రెషన్ కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. అయితే, ఈ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో వాట్సాప్ ఛాట్ కీలకం కానుందట.
పవిత్రా జయరామ్ తర్వాత చందు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు చూస్తే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందనేది ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో అటువంటి పోస్టులు చేస్తే దగ్గర వ్యక్తుల దగ్గర ఆయన ప్రవర్తన ఎలా ఉంది? సన్నిహితుల దగ్గర ఏమైనా చెప్పారా? ఆత్మహత్యకు ముందు ఎవరెవరికి వాట్సాప్ మెసేజులు చేశారు? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. చందు స్నేహితులు తమతో ఛాటింగ్ వివరాల్ని పోలీసులకు అందించారట.
చంద్రకాంత్ మణికొండ ఏరియాలోని అల్కాపూర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అది రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చందు పార్థీవ దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించి విచారణ చేపట్టారు.
పవిత్రతో చందుది వివాహేతర సంబంధమే!
'త్రినయని' సీరియల్ పవిత్రా జయరామ్, చంద్రకాంత్ భార్యాభర్తలుగా నటించారు. వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులతో పాటు టీవీ సీరియల్ యూనిట్ సభ్యులు సైతం నిజ జీవితంలోనూ వివాహమైందని నమ్మారు. అయితే, పవిత్రతో చందుది వివాహేతర సంబంధం అని తెలిసింది. సుమారు ఆరేళ్లుగా వాళ్లిద్దరూ సహ జీవనంలో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని ప్రణాళికలు వేసుకున్నారు. ఇంతలో ఈ విధంగా జరిగింది.
Also Read: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
పవిత్రే తన జీవితమని భావించినట్టు చందు చెప్పిన మాటలు, ఆయన చివరి ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే, ఆయన ఆత్మహత్య చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు.
పవిత్రా జయరామ్ (Pavitra Jayaram)తో పరిచయం కంటే ముందు చందుకు పెళ్లి అయ్యింది. శిల్పా అనే యువతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. చందు, శిల్పా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 'త్రినయని' కాకుండా 'రాధమ్మ పెళ్లి' సీరియల్ కూడా చేస్తున్నారు చందు.
Also Read: పాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?