News
News
X

Tollywood: సొంత సొమ్ములు, బడా బ్యానర్ - యంగ్ హీరోల నయా ఫార్ములా ఇదేనా?

టాలీవుడ్ యువ హీరోలు ప్లాపుల్లో ఉన్నా సరే పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నారు. అయితే దీని వెనుక అసలు విషయం వేరే ఉందని తెలుస్తోంది.

FOLLOW US: 
Share:
టాలీవుడ్ లో ఇటీవల కాలంలో కుర్ర హీరోలందరూ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. హిట్టు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే వారిలో గత కొన్నేళ్లుగా సక్సెస్ రుచి చూడని హీరోలు సైతం పెద్ద పెద్ద బ్యానర్స్ లో ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
 
కెరీర్ ప్రారంభంలో ఒకటీ రెండు హిట్లు కొట్టి కాస్త క్రేజ్ సంపాదించుకున్న యువ హీరోలు కొందరు, ఆ తర్వాత రోజుల్లో తమ జోరును కొనసాగించలేకపోయారు. బ్యాక్ టూ బ్యాక్ పరాజయాలు చవిచూశారు. అయినప్పటికీ వాళ్ళు బిగ్ ప్రొడక్షన్ హౌజెస్ లలో సినిమాలు చేసే ఛాన్స్ లు అందుకుంటున్నారు. అదే ఇప్పుడు పలు సందేహాలను లేవనెత్తుతోంది.
 
సాధారణంగా పెద్ద నిర్మాణ సంస్థలు తమ బ్యానర్ నేమ్ కు తగ్గట్టుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తాయి. సక్సెస్ లో ఉన్న యంగ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. కానీ ఇక్కడ ఏమాత్రం మార్కెట్ లేని ఫ్లాప్ హీరోలతో చిత్రాలు చేస్తున్నారు. క్రెడిబిలిటీ ఉన్న బడా బ్యానర్లు ఫ్లాప్ హీరోలతో సినిమాలు తీసి రిస్క్ చేయడం వెనుక రీజన్ వేరే ఉందని తెలుస్తోంది.
 
అదేంటంటే, ఈ యంగ్ హీరోలు తాము నటించే సినిమాలకు తమ సొంత డబ్బును ఖర్చు పెడుతున్నారట. కానీ ఆ సినిమాలను పెద్ద బ్యానర్లు నిర్మిస్తున్నాయని ప్రొజెక్ట్ చేస్తున్నారట. ఆ బ్యానర్లకు ఆడియన్స్ లో క్రేజ్, ఫేమ్ ఉన్నాయి కాబట్టి, ఆ ఇమేజ్ తమ సినిమాలకు కచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. పెద్ద బ్యానర్ల ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనే యంగ్ హీరోలు ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 
నిజానికి హీరోలు బ్యాక్ ఎండ్ లో ఉండి, బడా బ్యానర్లో సినిమాలు చేయటం అనేది కొత్త విషయమేమీ కాదు. ఆన్ స్క్రీన్ నిర్మాతలు నిర్మించని సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. ఇప్పుడు యువ హీరోలు అదే బాటలో నడుస్తున్నారట. పోస్టర్ మీద పెద్ద సంస్థ పేరు ఉంటుంది కానీ.. సినిమా బడ్జెట్ మాత్రం హీరో జేబులో నుంచే వస్తోందట.
 
యువ హీరోలు ఇలా ఉంటే టాలీవుడ్ లో మరికొందరు హీరోలు మాత్రం డబ్బులు పెట్టకుండానే, నిర్మాతగా తమ పేరు పోస్టర్స్ మీద వేసుకుంటున్నారు. సినిమాలో హీరోలుగా నటిస్తూనే, పైసా ఖర్చు చేయకుండానే నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. హిట్టయితే బ్యానర్ కు మంచి పేరు వస్తుంది.. అలానే లాభాల్లో వాటా ఉంటుంది. 
 
అదే ఫ్లాప్ అయితే మాత్రం భారం మొత్తం ప్రొడ్యూసర్ మీద వేస్తున్నారట. తమ రెమ్యునరేషన్ ఎలాగూ ఉంటుంది కాబట్టి, ఇక్కడ హీరోలు నష్టపోయేది ఏమీ లేదు. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలే కాదు, మీడియం రేంజ్ హీరోలు కూడా ఇదే పద్ధతిలో ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తున్నారట. సినిమా నిర్మాణంలో తమ బ్యానర్ పేరు కూడా ఉండేలా చూసుకుంటున్నారట. ఇలా కుర్ర హీరోలు సొంత డబ్బులు ఖర్చు చేసి పెద్ద బ్యానర్ల పేరు మీద సినిమాలు చేస్తుంటే.. స్టార్ హీరోలు మాత్రం ఏమీ ఖర్చు పెట్టకుండానే తమ పేరుని నిర్మాతల జాబితాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. 
 
Published at : 12 Mar 2023 09:44 AM (IST) Tags: Tollywood Producers young heroes Tollywood Heroes Movies Low Budget Movies

సంబంధిత కథనాలు

Naga Chaitanya New House : ఆ ఇంటిలో సమంత - కొత్త ఇంట్లో నాగ చైతన్య!

Naga Chaitanya New House : ఆ ఇంటిలో సమంత - కొత్త ఇంట్లో నాగ చైతన్య!

Weight Loss Diet: ఓట్స్ Vs గోధుమరవ్వ: వీటిలో ఏది తింటే త్వరగా బరువు తగ్గుతారు

Weight Loss Diet: ఓట్స్ Vs గోధుమరవ్వ: వీటిలో ఏది తింటే త్వరగా బరువు తగ్గుతారు

Prabhas Health : రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఫారిన్‌లో ప్రభాస్

Prabhas Health : రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఫారిన్‌లో ప్రభాస్

Ram Charan fans On Oscars : ఆస్కార్ గొడవ - ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఎందుకు, రామ్ చరణ్ ఎక్కడ? మెగా ఫ్యాన్స్ ఫైర్

Ram Charan fans On Oscars : ఆస్కార్ గొడవ - ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఎందుకు, రామ్ చరణ్ ఎక్కడ? మెగా ఫ్యాన్స్ ఫైర్

NTR30 Update : ఎన్టీఆర్ సినిమాకు భారీ ప్లానింగ్ - హాలీవుడ్ నుంచి...

NTR30 Update : ఎన్టీఆర్ సినిమాకు భారీ ప్లానింగ్ - హాలీవుడ్ నుంచి...

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌