అన్వేషించండి

Ramyakrishna: మరో స్టార్ హీరోకు తల్లిగా రమ్యకృష్ణ, 'పారడైజ్'లోకి ఎంట్రీ ఇస్తున్న శివగామి

నాని సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను పోషించబోతోందని తెలుస్తోంది. ఇందులో ఆమె నానికి తల్లిగా నటిస్తుందని తెలుస్తోంది.

Ramyakrishna playing mother role | ఒకప్పుడు లేడి లీడ్ గా నటించిన చాలామంది హీరోయిన్లు... ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తల్లిగా, అత్తగా, వదినగా నటించడం అనేది కామన్. కానీ నదియా, రమ్యకృష్ణ లాగా అందరికీ ఆ పాత్రలు కలిసి రావు. 'అత్తారింటికి దారేది' సినిమాలో నదియా చేసిన పాత్ర ఎవర్ గ్రీన్. అలాగే 'బాహుబలి' సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయేదే. 'బాహుబలి' తల్లి శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ ఇప్పుడు మరో స్టార్ హీరోకి తల్లిగా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. 

ఆ కాంబోతో పెరిగిన అంచనాలు

నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'దసరా' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వచ్చింది. ఇప్పుడు మరోసారి నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ 'ప్యారడైజ్' సినిమా సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ స్టోరీ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, సినిమాలోని కీలక పాత్రల కోసం నటీనటులను సెలెక్ట్ చేసే పనిలో ఉందట చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణను నాని తల్లి పాత్ర కోసం సంప్రదించారట మేకర్స్. ఇప్పటికే స్టోరీ విన్న ఆమె మేకర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

ప్యారడైజ్ లోకి అడుగుపెడుతున్న రమ్యకృష్ణ

రమ్యకృష్ణ చివరిసారిగా రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'పురుషోత్తముడు' అనే సినిమాతో తెరపై మెరిసింది. ఈ మూవీలో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేసింది. ఈ సినిమాకు 'ది పారడైజ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉండగా, ఇప్పుడు రమ్యకృష్ణ కూడా ప్యారడైజ్ లోకి అడుగు పెట్టబోతున్నారనే వార్త మరింత బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక రమ్యకృష్ణ ఇప్పటికే టాలీవుడ్ ప్రభాస్ తో పాటు విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు తల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు నాని వంతు వచ్చింది.

బాలీవుడ్ భామను ఫిక్స్ చేస్తున్నారా?

ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ 'ప్యారడైజ్' సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇందులో నానికి జంటగా నటించిన హీరోయిన్ ఎవరు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే జాన్వి కపూర్ లేదా శ్రద్ధా కపూర్ నటించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి కాగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 'ప్యారడైజ్' మూవీ షూటింగ్ జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ప్రముఖ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు నటిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అలాగే మోహన్ బాబు 'కన్నప్ప' అనే సినిమాలో కూడా ముఖ్యమైన పాత్రలో కన్పించబోతున్నారు. మొత్తానికి శ్రీకాంత్ ఓదెల ఈసారి నానితో కలిసి పెద్ద ప్లానే వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. 'దసరా' మూవీ తో పోలిస్తే 'ప్యారడైజ్' 100 రెట్లు ఎఫెక్టివ్ గా ఉంటుందని మొదటి నుంచి టీం చెప్తూ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ కాగా, అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

Read also : Bachhala Malli Teaser: 'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Realme V60 Pro: రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Realme V60 Pro: రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget