Jacqueline Fernandez: టాలీవుడ్ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సినిమా?
జాక్వలిన్ ఫెర్నాండేజ్ మెయిన్ లీడ్‌గా టాలీవుడ్ డైరెక్టర్ ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఆ దర్శకుడు ఎవరు? ఆ సినిమా ఏది? అనే వివరాల్లోకి వెళితే...

Actress Jacqueline Fernandez Is In Talks With Tollywood Director: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా తెలుసు. బహ్రెయిన్‌లో జన్మించిన ఈ శ్రీలంక సుందరి బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీ. అప్పుడప్పుడూ సౌత్ ఇండియా సినిమాల్లో కూడా తళుక్కున మెరుస్తారు. రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో'లో స్పెషల్ సాంగ్ చేశారు. కన్నడ స్టార్ సుదీప్ 'విక్రాంత్ రోణ'లో 'రా రా రక్కమ్మ' సాంగ్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే... ఆవిడతో సినిమా చేయాలని సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఇంతకు ముందు ట్రై చేశారు. కానీ, కుదరలేదు. ఇప్పుడు మాత్రం ఒక డైరెక్టర్ ఓ ప్రాజెక్ట్ వర్కవుట్ చేయడానికి చూస్తున్నారు.
'పేపర్ బాయ్' దర్శకుడితో జాక్వెలిన్ సినిమా?
Paper Boy Director Jayashankar Next with Jacqueline Fernandez?: సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన 'పేపర్ బాయ్' సినిమా గుర్తు ఉందా? ఆ చిత్రానికి జయ శంకర్ దర్శకుడు. ఇప్పుడు ఆయన ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ రెడీ చేశారు. ఆ కథను పాన్ ఇండియా సినిమాగా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆ మధ్య నయనతారకు కథ వినిపించారని ఇండస్ట్రీ టాక్. మరి, నయన్ ఏమన్నారో కానీ... ఇప్పుడు బాలీవుడ్ భామ దగ్గరకు జయ శంకర్ వెళ్లారట.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చెయ్యడానికి జయ శంకర్ రెడీ అవుతున్నారని లేటెస్ట్ టాలీవుడ్ టాక్. నయన్ కంటే ఆమెకు హిందీలో ఫాలోయింగ్ ఎక్కువ. సౌత్ ఆడియన్స్‌కు కూడా తెలుసు. అందుకని, ఆమెకు ఓటు వేశారట. మరి, జయ శంకర్ కథ విని జాక్వెలిన్ ఏం చెబుతారో చూడాలి.
Also Read: చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
జూన్ నెలలో 'అరి' విడుదలకు సన్నాహాలు?
Ari Movie Release In June:'పేపర్ బాయ్' సినిమాలో సున్నితమైన భావోద్వేగాలను చక్కగా చూపించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు జయ శంకర్. దర్శకుడిగా తన రెండో ప్రయత్నంగా 'అరి' తీశారు. ఆ సినిమాను అరిషడ్వర్గాల మీద తీశారు. ఇండస్ట్రీలో పలువురికి 'అరి'ని చూపించారు. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రజెంట్ ఎన్నికల హడావిడి ఉండటంతో... అది పూర్తి అయ్యాక జూన్ నెలలో 'అరి' సినిమాను థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ఏపీ, తెలంగాణలో భారీ ఎత్తున విడుదల చేస్తామన్నారు.
Also Read: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
మరి, 'అరి' సినిమా విడుదలకు ముందు జయ శంకర్ కొత్త సినిమా ప్రకటన వస్తుందా? లేదంటే ఆ తర్వాత వస్తుందా? అనేది చూడాలి. ఆ మధ్య జయ శంకర్ సమర్పణలో 'బిగ్ బాస్' సన్నీ హీరోగా 'సౌండ్ పార్టీ' సినిమా వచ్చింది. థియేటర్లలో పెద్దగా సౌండ్ చేయకుండా వెళ్ళింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

