VD 12 : నెగెటివ్ షేడ్ ఉన్న రోల్లో యంగ్ హీరో... విజయ్ దేవరకొండతోనే ఫైట్ - ఈ సీన్‌కు థియేటర్లు విజిల్స్‌తో దద్దరిల్లాల్సిందే
VD 12 : విజయ్ దేవరకొండ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ VD 12. ఈ మూవీలో సత్యదేవ్ ఎలాంటి రోల్ చేస్తున్నారు అనే విషయం తాజాగా వెల్లడైంది.
Vijaya Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం VD 12. ఈ సినిమాలో సత్యదేవ్ కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఈ మూవీలో ఎలాంటి పాత్రను పోషించబోతున్నారనే విషయం బయటకు వచ్చింది.
VD 12లో సత్యదేవ్ నెగెటివ్ రోల్
ఇటీవల కాలంలో వరస డిజాస్టర్లు చవిచూసిన రౌడీ హీరో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో VD 12 అనే సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ముందుగా ఇందులో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో భాగ్యశ్రీని కన్ఫర్మ్ చేశారు. పోలీస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ ఇంటెన్స్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.
ఇక ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషించబోతున్నారనే వార్త ఎప్పుడో బయటకు వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో సత్యదేవ్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రను చేస్తున్నారని తెలుస్తోంది. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సత్యదేవ్ అద్భుతమైన నటనను కనబరిచాడని, ఆయన చేసే నెగెటివ్ రోల్ సినిమాకి హైలెట్ గా మారుతుందని అంటున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ - సత్యదేవ్ కాంబోలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్ అవుతాయని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక VD 12 మూవీని 2025 మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం అనౌన్స్ చేసింది. కానీ అదే టైంకి పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమా పోస్ట్ పోన్ కానుందా అనే ఆసక్తి నెలకొంది.
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'జీబ్రా'
సత్యదేవ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ఇదే మొదటిసారి కాదు. కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'గాడ్ ఫాదర్' మూవీలో కూడా సత్యదేవ్ విలన్ గా కనిపించారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండతో పోరుకు సిద్ధం అయ్యారు. ఇదిలా ఉండగా సత్యదేవ్ రీసెంట్ గా 'జీబ్రా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నవంబరు 22న ఈ 'జీబ్రా' సినిమా విడుదలైంది. ఈ మూవీలో జెన్నిఫర్ పిసినాటో, ప్రియా భవానీ శంకర్ కథానాయికలుగా నటించారు. ఈశ్వర్ కార్తీక్ 'జీబ్రా' మూవీకి దర్శకత్వం వహించారు. ఎస్ పద్మజ, బాలసుందరం, ఎస్‌ఎన్ రెడ్డి, దినేష్ సుందరం ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఇందులో 'పుష్ప' ఫేమ్ జాలిరెడ్డి డాలీ ధనంజయ, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచిన 'జీబ్రా' ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే