Idli Kadai Postponed: ధనుష్ మూవీ 'ఇడ్లీ కడై' విడుదల వాయిదా పడిందా? ఆ వార్తల్లో నిజం ఎంత?
Idli Kadai : ధనుష్, నిత్యా మీనన్ కొత్త మూవీ 'ఇడ్లీ కడై' రిలీజ్ వాయిదా పడబోతోంది అనే రూమర్లు విన్పిస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం ఎంత ?

కోలీవుడ్ స్టార్ ధనుష్, నిత్యా మీనన్ జంటగా నటించిన మూవీ 'ఇడ్లీ కడై'. 2025లో మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటింగ్ సినిమాలలో ఇది కూడా ఒకటి. 'రాయన్' తర్వాత ధనుష్ దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా ఇది. ఏప్రిల్ 10న ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడబోతుందని కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది.
ధనుష్ మూవీ వాయిదా తప్పదా?
ధనుష్ నటించిన 'ఇడ్లీ కడై' మూవీ రిలీజ్ డేట్ ని వాయిదా వేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ రూమర్స్ ప్రకారం ఈ మూవీని 2025 ఆగస్టులో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. కానీ చిత్ర బృందం ఇంకా ఈ రిలీజ్ డేట్ రూమర్స్ పై స్పందించలేదు. అయితే రీసెంట్ గా 'నీక్' మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా 'ఇడ్లీ కడై' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ మూవీని ఏప్రిల్ 10నే రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ధనుష్ ప్రస్తుతం 'ఇడ్లీ కడై' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని, అందుకే ఆయన 'నీక్' ఈవెంట్ కి హాజరు కాలేకపోయారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెల్లడించారు.
అదే కార్యక్రమంలో ధనుష్ దర్శకత్వంలో 'ఇడ్లీ కడై' మూవీలో పని చేయడం పట్ల నటుడు అరుణ్ విజయ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా 'ఇడ్లీ కడై' మూవీకి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోందని, ఓ పాటను షూట్ చేస్తున్నామని వెల్లడించారు. దీంతో 'ఇడ్లీ కడై' మూవీ రిలీజ్ వాయిదా పడబోతోంది అని వస్తున్న రూమర్లు ఫేక్ అని తేలిపోయింది. రీసెంట్ గా 'ఇడ్లీ కడై' మూవీలో నుంచి అరుణ్ విజయ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
Also Read: 'మాస్ జాతర' తర్వాత రవితేజ సినిమా ఫిక్స్... సమ్మర్‌లో సెట్స్ మీదకు, దర్శకుడు ఎవరంటే?
మరో సినిమా ఆగిపోయిందని రూమర్లు
ధనుష్ సినిమాలకు సంబంధించిన రూమర్లు ఇటీవల కాలంలో ఎక్కువగా విన్పిస్తున్నాయి. ఇప్పుడు 'ఇడ్లీ కడై' మూవీ వాయిదా పడబోతోంది అనే టాక్ నడుస్తుండగా, రీసెంట్ గా ధనుష్ నటిస్తున్న మరో చిత్రం 'ఇళయరాజా' బయోపిక్ ఆగిపోయింది అన్నారు. కానీ ఈ రెండూ వట్టి రూమర్స్ మాత్రమే.
ఇక ధనుష్ ఈ రెండు సినిమాలతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. అందులో 'కుబేర' సినిమా గురించి ధనుష్ తెలుగు, తమిళ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత ధనుష్ దర్శకుడు రాజకుమార్ పెరియాసామితో నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు. ధనుష్ సినిమాలపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా ఆసక్తి నెలకొంది.
Also Read: మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?






















