Ilaiyaraaja Biopic: మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజాపై ధనుష్ బయోపిక్ ఆగిపోయిందా? అసలు నిజం ఏంటంటే?
Ilaiyaraaja Biopic : ధనుష్ హీరోగా ఇళయరాజా బయోపిక్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బయోపిక్ ఆగిపోయింది అని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ?

ఎంతో ప్రతిష్టాత్మకంగా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బయోపిక్ ను అనౌన్స్ చేశాడు ధనుష్. కానీ మూవీని ప్రకటించిన ఏడాది కావస్తున్నా, అప్డేట్స్ విషయంలో మేకర్స్ సైలెన్స్ మెయింటైన్ చేస్తుండడం కొత్త అనుమానాలకు దారి తీసింది. దీంతో మూవీ ఆగిపోయింది అనే ప్రచారం జోరందుకుంది.
ఇళయరాజా బయోపిక్ ఆగిపోయిందా ?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 2024 మార్చ్ లో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్ లో హీరోగా నటించబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్మెంట్ వేడుకకు లోకనాయకుడు కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా హాజరు కావడంతో, సినిమా గ్రాండ్ గా ఉంటుందని అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఈ మూవీ గురించి ప్రకటించి దాదాపు ఏడాది కావస్తోంది. ఇప్పటిదాకా ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దీంతో ఇళయరాజా బయోపిక్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
నిజం ఏంటంటే అవి జస్ట్ రూమర్స్ మాత్రమే. అరుణ్ మాథేశ్వరం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇంకా ట్రాక్ లోనే ఉందనేది తాజా సమాచారం. అయితే ఈ మూవీ విషయంలో జరిగిన మార్పు ఏంటంటే, అప్పటికే కమిట్ అయిన నిర్మాతలు మరో కొత్త నిర్మాణ సంస్థతో కలిసి పని చేయబోతున్నారు. ఇళయరాజా బయోపిక్ ను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ బ్యానర్ తో ఇప్పుడు మరో నిర్మాణ సంస్థ కూడా చేతులు కలిపినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ బయోపిక్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తిగా ట్రాక్ లోనే ఉందని చెబుతున్నారు. అయితే ఈ సినిమా ఆగిపోలేదు అనే విషయంపై ధనుష్ లేదా నిర్మాతల వైపు నుంచి మరొక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నారు ధనుష్ అభిమానులు.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్
మరోవైపు ధనుష్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'నీక్' మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఫిబ్రవరి 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఒక రొమాంటిక్ మెలోడీ. ఇందులో కొత్త నటినటులు నటించారు. మరోవైపు ధనుష్ తాను నటిస్తున్న కొత్త మూవీ 'ఇడ్లీ కడై'తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందులో నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రాజ్ కిరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే 'ఇడ్లీ కడై' మూవీ నుంచి కొన్ని లుక్స్ రివీల్ చేయగా, సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: తండేల్ రివ్యూ: సముద్రంలో చిక్కిన ప్రేమ... తీరానికి ఎలా చేరింది? నాగచైతన్య సినిమా హిట్టా? ఫట్టా?
'ఇడ్లీ కడై' మూవీతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర' అనే మూవీలో కూడా నటిస్తున్నారు ధనుష్. ఇందులో నాగార్జున, రష్మిక మందన్న తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధనుష్ ఖాతాలో ఉన్న మూడవ చిత్రం హిందీ మూవీ. 'తేరే ఇష్క్ మే' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీకి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ మూవీలో ధనుష్ తో కృతి సనన్ రొమాన్స్ చేయబోతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

