Laila Pre Release Event : 'లైలా' కోసం రంగంలోకి స్టార్ హీరో - ప్రీ రిలీజ్ ఈవెంట్ మోత మోగాల్సిందే!
Laila Pre Release Event : విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లైలా' ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఓ స్టార్ హీరో రంగంలోకి దిగబోతున్నారని టాక్ నడుస్తోంది.

Viswek Sen Laila Pre Release Event: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. విశ్వక్ సేన్ ఈ సినిమాలో లేడీ గెటప్‌లో నటిస్తుండడంతో అనౌన్స్మెంట్ టైమ్ నుంచే సినిమాపై డీసెంట్ బజ్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే నిర్వహించబోతున్న 'లైలా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రంగంలోకి ఓ స్టార్ హీరో దిగిబోతున్నాడని టాక్ నడుస్తోంది.
'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా స్టార్ హీరో
ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా, ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ 'లైలా'. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌కు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 9న 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున జరగబోతోంది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరు కాబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఇంకా మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. కానీ ఈ వార్తలు గనక నిజమైతే 'లైలా' మూవీపై మెగా హైప్ నెలకొనడం పక్కా. అనిల్ రావిపూడితో చిరంజీవి నెక్స్ట్ మూవీని నిర్మిస్తున్న నిర్మాత సాహు గారపాటి 'లైలా'కు కూడా నిర్మాత కావడమే ఈ రూమర్స్‌కు కారణం. ఇదిలా ఉండగా 'లైలా' మూవీకి సంబంధించిన స్పెషల్ ఈవెంట్‌లోనే ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేయబోతున్నారు.
'లైలా'కు ఏ సర్టిఫికెట్ ?
ఇదిలా ఉండగా మరోవైపు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం, విశ్వక్ సేన్ నటించిన 'లైలా' మూవీకి సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ లభించింది. నిజానికి యూ/బై ఏ సర్టిఫికెట్ వచ్చి ఉంటే, ఈ సినిమాను ప్రేక్షకులు ఫ్యామిలీలతో కలిసి చూసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఏ సర్టిఫికెట్ కావడంతో మూవీ ఎంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్‌కు రీచ్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో అమ్మాయి పాత్రను పోషించాల్సి రావడంతో చాలామంది హీరోలు 'లైలా'ను రిజెక్ట్ చేశారని రీసెంట్‌గా నిర్మాత సాహూ గారపాటి వెల్లడించిన సంగతి తెలిసిందే.
మరోవైపు 'లైలా' కోసం ముందుకొచ్చిన విశ్వక్ సేన్ ఈ మూవీ తన కెరీర్‌లోనే మంచి మూవీ అవుతుందని, హిట్టు కొడతామని నమ్ముతున్నారు. ఇక సినిమాను కూడా కొత్తగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్‌గా ఈ మూవీ ఈవెంట్లో విశ్వక్ సేన్ ఈ వాలెంటైన్స్ డేకి పార్ట్నర్ లేని అబ్బాయిలకి 'లైలా' ఉంటుంది అంటూ ఆసక్తికర కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు 'లైలా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా హాజరైతే మరింత అంచనాలు పెరగడం ఖాయం. మరి మేకర్స్ మూవీ ప్రీ రిలీజ్ విషయంలో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే.
Read Also : Actress : సినిమాల కారణంగా సమాజం బహిష్కరించిన మొట్టమొదటి నటి ఎవరో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

