Lokesh Kanagaraj - Aamir Khan: ఆమిర్... లోకేష్ కనగరాజ్... మైత్రిలో పాన్ ఇండియా ఫిల్మ్!
Lokesh Kanagaraj New Movie: ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అంటే... 'అవును' అని కోలీవుడ్ అంటోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
సౌత్ ఇండియా దర్శకులతో సినిమాలు చేయడానికి హిందీ హీరోలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సౌత్ దర్శకులు తీసే సినిమాలు భారీ విజయాలు సాధిస్తుండటంతో ఇక్కడ దర్శకులతో మాస్ మూవీస్ తీసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆ హీరోల జాబితాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సైతం చేరుతున్నారని లేటెస్ట్ ఖబర్. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఆమిర్... లోకేష్... మైత్రిలో పాన్ ఇండియా!
తమిళ దర్శకుడు అట్లీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కలయికలో వచ్చిన 'జవాన్' కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ 'సికందర్' సినిమా చేస్తున్నారు. సౌత్ దర్శకులతో సినిమాలు చేసే ఖాన్ హీరోల లిస్టులో ఆమిర్ ఖాన్ సైతం జాయిన్ అవుతున్నారట.
'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్', 'లియో'తో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఆయన దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ (Aamir Khan) కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా సినిమా రూపొందే అవకాశం ఉందని లేటెస్ట్ కోలీవుడ్ ఖబర్. విశేషం ఏమిటంటే... ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనుంది.
టాలీవుడ్ టాప్ హీరోలతో భారీ పాన్ ఇండియా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది మైత్రి. ప్రభాస్ - హను రాఘవపూడి సినిమా 'ఫౌజి', రామ్ చరణ్ - బుచ్చి బాబు సానా సినిమా 'పెద్ది', అల్లు అర్జున్ - సుకుమార్ 'పుష్ప 2' వంటి సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. బాలీవుడ్ సీనియర్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఇప్పుడు మరొక హిందీ హీరోతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
Also Read: 'కల్కి 2898 ఏడీ'లో ప్రభాస్ జోకర్‌లా ఉన్నాడు - కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటుడు!
రెండేళ్ల క్రితం విడుదలైన 'లాల్ సింగ్ చద్దా' తర్వాత ఆమిర్ ఖాన్ మరొక సినిమా చేయలేదు. హీరోగా కొత్త సినిమాలు ఏవీ ఓకే చేయలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా సరిగా ఆడలేదు. దాంతో బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ పేరు వినబడంతో హిందీ ఇండస్ట్రీలో సైతం ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది.
రెండేళ్ల క్రితం వరకు లోకేష్ కనగరాజ్ సామాన్య దర్శకుడు. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో మంచి స్టేజికి వచ్చే వారిలో ఒకడిగా మాత్రమే ఉన్నాడు. దర్శకుడిగా పరిచయమైన 'మానగరం', కార్తీ కథానాయకుడిగా తీసిన 'ఖైదీ' విజయాలు సాధించినా... విజయ్ 'మాస్టర్' ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ, కమల్ హాసన్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'విక్రమ్' భారీ విజయం సాధించడమే కాదు... బాక్సాఫీస్ బరిలో రూ. 400 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్ల జాబితాలో చేరాడు. 'లియో' ఫ్లాప్ అతడి మీద ఎఫెక్ట్ చూపించలేదు. ప్రజెంట్ రజనీకాంత్ 'కూలీ' సినిమాకు లోకేష్ దర్శకత్వం వహిస్తున్నారు.