By: ABP Desam | Updated at : 25 Apr 2022 02:13 PM (IST)
'గొలుసుకట్టు గోసలు' సాంగ్ రిలీజ్
ప్రముఖ యాంకర్, టీవీ హోస్ట్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జయమ్మ పంచాయతీ'. ఈ సినిమాతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలను, మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. రీసెంట్ గా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. నాని, రాజమౌళి, పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీలు ఈ సినిమాను ప్రమోట్ చేశారు.
మే 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా సినిమా నుంచి 'గొలుసు కట్టు గోసలు' లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. 'కలిసి బతికే కాలమేమాయే నేడే..పగటి వేళ పీడ కలలాయే, అలసి పోని ఆశలేమాయే అయ్యో... గొలుసు కట్టు గోసలైపోయే' అంటూ చాలా ఎమోషనల్‌గా సాగింది ఈ పాట. సినిమాలో సుమ పరిస్థితిని ఈ పాట వివరిస్తుంది.
ఈ పాటకు కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అలానే హరిహరన్ తో కలిసి ఆలపించారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఇదివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించింది సుమ. ఆ తరువాత పూర్తిగా బుల్లితెరకే పరిమితమైంది. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ నటిగా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. మరి 'జయమ్మ పంచాయతీ'తో సుమ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి!
Also Read: ఈ వారం థియేటర్-ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే
Also Read: ఇకపై హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు - స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్స్టాప్?
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం