Suriya, Aamir Khan: ఒకే ఫ్రేమ్‌లో ‘గజినీ’ స్టార్స్ - సూర్య, అమీర్ ఎక్కడ కలిశారో తెలుసా?
‘గజినీ’ సినిమా స్టార్స్ సూర్య, అమీర్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో ఇద్దరూ కలిసి ఫోటోకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘గజనీ’ సినిమాతో సౌత్ లో సూర్య సత్తా చాటగా, నార్త్ లో అమీర్ ఖాన్ దుమ్మురేపారు. తాజాగా ఈ ఇద్దరు ‘గజినీ’ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించి అభిమానులకు మాంచి కిక్ ఇచ్చారు. తాజాగా లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ తన బర్త్ డే సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలో అన్ని సినిమా పరిశ్రమలకు సంబంధించిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పార్టీకి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు ఫోటోకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రవి. కె చంద్రన్
ఈ ఫోటోలో అమీర్, సూర్యతో పాటు సినిమాటోగ్రాఫర్ రవి. కె చంద్రన్ కూడా ఉన్నారు. ఆయనే ఈ సెల్ఫీని తీశారు. ఫోటోను కూడా ఆయనే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ట్రెండింగ్ లో నిలిచింది. ఇద్దరు స్టార్ హీరో కలిసి ఒకే సినిమాలో నటించకపోయినా, ఒకే ఫ్రేమ్ లో కనిపించారు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ముగ్గురూ సేమ్ సేమ్!
ఈ ఫోటోలో సూర్య గడ్డంతో చక్కగా దువ్విన జట్టుతో నవ్వుతూ కనిపించారు. ఆయనకు కాస్త వెనుకగా అమీర్ ఖాన్ ఉన్నారు. ఆయన హెయిర్ స్టైల్ కూడా సూర్య మాదిరిగానే నున్నగా దువ్వి ఉంది. అయితే, అమీర్ మాత్రం క్లీన్ షేవ్ తో కనిపించారు. ఇద్దరూ చక్కటి కళ్ల జోళ్లు కూడా ధరించారు. అటు రవి చంద్రన్ జీన్స్ షర్టు ధరించి ఉన్నారు. ఆయన కూడా కళ్లద్దాలు పెట్టుకున్నారు. చాలా మంది అభిమానులు ఈ ఫోటోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలా సెల్ఫీలు దిగమే కాదు, ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేయాలని కోరుతున్నారు.
Two ghajinis in one frame at @ikamalhaasan birthday party @Suriya_offl #AamirKhan pic.twitter.com/W5JjVOk8nJ
— ravi k. chandran (@dop007) November 7, 2023
సూర్య, అమీర్ బిజీ బిజీ
ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో ‘కంగువా’ అనే సినిమా చేస్తున్నారు. శివ దర్శకత్వంలో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా 'కంగువా' రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ భారీ నిర్మాణ విలువలతో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'కంగువా'ను పది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'కంగువా'లో సూర్య సరసన హిందీ హీరోయిన్, తెలుగు సినిమా 'లోఫర్' ఫేమ్ దిశా పటానీ నటిస్తున్నారు. అటు సుధా కొంగర దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్టుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అమీర్ ఖాన్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘సితారే జమీన్ ఫర్’లో నటిస్తున్నారు. ఇది ఆయన గతంలో నటించిన ‘తారే జమీన్ ఫర్’కి సీక్వెల్ గా రూపొందుతోంది. RS ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు.
Read Also: అనౌన్స్ మెంటే ఇలా ఉంటే మూవీ ఎలా ఉంటుందో - కమల్, మణిరత్నం టైటిల్ వీడియో అదుర్స్ అంతే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial