Republic Day Telugu Movies : తెలుగులో రిపబ్లిక్ డేకి మరో సినిమా - 26న 'గీత సాక్షిగా'
Geeta Sakshigaa Movie Release Date : సంక్రాంతికి వచ్చే సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి. ఆ తర్వాత? ఒక్కో సినిమా రిలీజ్ డేట్స్ మీద కర్చీఫ్‌లు వేసే ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.
సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు ఏవేవి? అనే ప్రశ్నకు సమాధానం లభించింది. 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య', 'వారసుడు', 'తెగింపు', 'విద్యా వాసుల అహం', 'కళ్యాణం కమనీయం'... మొత్తం ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి, ఆ తర్వాత? ఇప్పుడిప్పుడు ఓ క్లారిటీ వస్తోంది.
సంక్రాంతి తర్వాత జనవరిలో మరో మంచి రిలీజ్ డేట్... రిపబ్లిక్ డే (Republic Day Telugu Movie Releases 2023)! జనవరి 26న గురువారం వచ్చింది. ఆ తర్వాత శుక్ర, శని, ఆది వారాలు కూడా ప్రేక్షకులు హాలిడే మూడ్‌లో ఉంటారు. అందుకని, అప్పుడు రావడానికి కొన్ని సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో 'గీత సాక్షిగా' ఒకటి.
జనవరి 26న 'గీత సాక్షిగా'
చిత్రా శుక్లా (Chitra Shukla), ఆదర్శ్, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గీత సాక్షిగా' (Geeta Sakshigaa Movie). చేతన్ రాజ్ కథ అందించడంతో పాటు చేతన్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26, 2023న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
న్యాయవాదిగా చిత్రా శుక్లా
'గీత సాక్షిగా'లో ఆదర్శ్ జైలులో ఖైదీగా కనిపించనున్నారు. సినిమాలో ఆయన ప్యాక్డ్ బాడీతో కనిపించనున్నారు. అతని తరపున వాదించే న్యాయవాది పాత్రలో చిత్రా శుక్లా, ఆమెకు ప్రత్యర్థి న్యాయవాదిగా శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించారు.
కొన్ని రోజుల క్రితం 'గీత సాక్షిగా' టీజర్ విడుదల చేశారు. ఆదర్శ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకు వెళ్లడం, అతని కోసం చిత్రా శుక్లా జైలుకు వెళితే... ముఖం మీద ఒకరు ఇంక్ పోయడం వంటివి అందులో చూడవచ్చు. జైలులో కొంత మంది ఎటాక్ చేయబోతే... అందరినీ చితక్కొట్టిన ఆదర్శ్... 'పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు, వాడి బాబు అర్జునుడిని రా' అంటూ డైలాగ్ చెప్పారు.
Also Read : లిప్ కిస్సుతో గుడ్ న్యూస్ చెప్పిన నరేష్, పవిత్రా లోకేష్ - త్వరలో పెళ్లి
వాస్తవ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. కంటెంట్ బేస్డ్ చిత్రమిదని వారు పేర్కొన్నారు. ఒక చిన్నారి చుట్టూ ఈ కథ తిరుగుతుందట. చిన్నారిని ఎవరో పట్టుకోవాలని ప్రయత్నించడం, ఆ పెద్దల నుంచి తప్పించుకోవడానికి చిన్నారి వేసే అడుగులు ఆసక్తిగా ఉంటాయట.
'హంట్' విడుదల కూడా ఆ రోజే!
సుధీర్ బాబు, శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా 'హంట్' కూడా జనవరి 26న విడుదల కానుంది. 'గీత సాక్షిగా' సినిమాతో పాటు ఆ రోజు ఇంకెన్ని సినిమాలు వస్తాయో? వెయిట్ అండ్ సి.
Also Read : 'కోరమీను' రివ్యూ : మీసాలు తీయడమే కాదు, అంతకు మించి ట్విస్టులు ఉన్నాయ్ - ఆనంద్ రవి సినిమా ఎలా ఉందంటే?
భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు గోపీసుందర్ (Gopi Sundar Music Director) స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ, ఎడిటర్: కిశోర్ మద్దాలి, సాహిత్యం: రెహమాన్, కళ: నాని, నృత్యం : యశ్వంత్ - అనీష్, ఫైట్స్ : పృథ్వీ.