Naresh Pavitra Marriage : లిప్ కిస్సుతో గుడ్ న్యూస్ చెప్పిన నరేష్, పవిత్రా లోకేష్
సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ రోజు నరేష్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.
సీనియర్ నటుడు నరేష్ (Actor Naresh) త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు. ఇది సినిమా స్టంట్ కాదు... లేదంటే పబ్లిసిటీ అంత కంటే కాదు! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) తో ఆయన ఏడు అడుగులు వేయనున్నారు.
లిప్ కిస్సుతో...
కొత్త ఏడాదిలోకి!
''కొత్త ఏడాది... కొత్త ప్రారంభం... మీ అందరి అశీసులు కావాలి! మీ ఇద్దరి నుంచి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - మీ పవిత్రా నరేష్'' అని ఈ రోజు నరేష్ ఓ ట్వీట్ చేశారు. అందులో ఓ వీడియో ఉంది. వీడియోలో ఏముంది? అని చూస్తే... నరేష్, పవిత్రా లోకేష్ కలిసి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత వైన్ గ్లాసులు పట్టుకుని కనిపించారు. తర్వాత లిప్ కిస్ పెట్టుకున్నారు. అప్పుడు ''త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాం'' (getting married soon) అని వీడియోలో అనౌన్స్ చేశారు. 'పవిత్రా లోకేష్' అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పోస్ట్ చేశారు.
నరేష్... నాలుగో పెళ్ళి!
పవిత్ర... రెండో పెళ్ళి!
నరేష్ (Actor Naresh Fourth Marriage) కు ఇది నాలుగో పెళ్ళి. నరేష్ మొదటి భార్య సంతానమే హీరో నవీన్ విజయ్ కృష్ణ. ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి కూడా ఓ కుమారుడు ఉన్నారు. నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh Second Marriage) కు రెండో పెళ్ళి. ఐదేళ్ళ క్రితం సుచేంద్ర ప్రసాద్ నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు.
నరేష్ - పవిత్ర ప్రేమ...
బయటపెట్టిన రమ్య!
నరేష్, పవిత్రా లోకేష్ కొన్ని సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. ఆ సినిమాల్లో 'సమ్మోహనం' సూపర్ హిట్. ఓటీటీలో విడుదలైన ఆలీ సినిమా 'అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి' సినిమాలోనూ జంటగా కనిపించారు. ఎప్పుడో ప్రేమ చిగురించిందో... వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందంటూ నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి కొన్నాళ్ళ క్రితం ఆరోపణలు చేశారు. బెంగళూరులో పెద్ద హంగామా కూడా నడిచింది. నరేష్, పవిత్ర హోటల్‌లో ఉండగా... రమ్య రఘుపతి పోలీసులతో వెళ్ళారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని ఆమె తెలిపారు. అప్పట్లో నరేష్ చర్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమకు మద్దతు ఇవ్వమని పవిత్రా లోకేష్ కోరడం కూడా చర్చనీయాంశం అయ్యింది.
Also Read : చేసుకుంటా, రాసి పెట్టిలేదు, క్లారిటీ లేదు - పెళ్ళిపై కన్‌ఫ్యూజ్ చేసిన ప్రభాస్
New Year ✨
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022
New Beginnings 💖
Need all your blessings 🙏
From us to all of you #HappyNewYear ❤️
- Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
పెళ్ళి జరిగిందని ప్రచారం జరిగినా...
నరేష్, పవిత్రా లోకేష్ పెళ్ళి చేసుకున్నారని ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే, నరేష్ ఈ రోజు చేసిన ప్రకటన బట్టి వాళ్ళిద్దరూ ఇంకా పెళ్ళి చేసుకోలేదని తెలుస్తోంది. 2022 ఇయర్ ఎండింగ్ రోజున నరేష్ చేసిన ప్రకటన, ఈ ఏడాదిలో జరిగిన టాప్ 10 సూపర్ డూపర్ షాకింగ్ అనౌన్స్‌మెంట్స్‌లో ఒకటిగా ఉంటుందని చెప్పవచ్చు. ఆల్రెడీ కొంత మంది వాళ్ళిద్దరికీ విషెష్, కంగ్రాట్స్ చెబుతుంటే... లేటు వయసులో ఘాటుగా రొమాన్స్ చేస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నరేష్ 62 ఏళ్ళు. పవిత్రా లోకేష్ వయసు 43 ఏళ్ళు.
Also Read : 'కోరమీను' రివ్యూ : మీసాలు తీయడమే కాదు, అంతకు మించి ట్విస్టులు ఉన్నాయ్ - ఆనంద్ రవి సినిమా ఎలా ఉందంటే?