అన్వేషించండి

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ - అబ్బా అబ్బా ఓ అబ్బాయా!

Geeta Sakshiga Movie Songs : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'అబ్బా అబ్బా ఓ అబ్బాయా' పాటను విడుదల చేశారు.  

చిత్రా శుక్లా, ఆదర్శ్, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'గీత సాక్షిగా' (Geeta Sakshiga Movie). ఈ సినిమాలోని రెండో పాట 'అబ్బా అబ్బా ఓ అబ్బాయా' పాటను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) విడుదల చేశారు.

రెహమాన్ రాత...
సాహితీ స్వరం!
'గీత సాక్షిగా' సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన బాణీ అందించిన 'అబ్బా అబ్బా ఓ అబ్బాయా...'ను రెహమాన్ రాయగా... సాహితీ చాగంటి హస్కీ వాయిస్‌లో పాడారు. సాధారణంగా అమ్మాయిలను వర్ణిస్తూ అబ్బాయిలు ఎక్కువగా పాటలు పాడుతుంటారు. అబ్బాయిలపై అమ్మాయిలు తమ ఇష్టాన్ని వ్యక్తం చేసే పాటలు తక్కువగా వస్తుంటాయి. అటువంటి పాటల్లో ఇదొకటి. 

'అబ్బా అబ్బా ఓ అబ్బాయా...' పాట విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ ''సాంగ్ చాలా క్యాచీగా ఉంది. పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ చాలా చాలా బాగున్నాయి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రేక్షకులు అంద‌రికీ న‌చ్చేలా పాట ఉంటుంద‌ని కచ్చితంగా చెప్ప‌గ‌ల‌ను'' అన్నారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, ఇతర చిత్ర బృందం ఆయనకు థాంక్స్ చెప్పారు. 
చేతన్ రాజ్ కథ అందించడంతో పాటు చేతన్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మించారు. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. 

వాస్తవ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. కంటెంట్ బేస్డ్ చిత్రమిదని వారు పేర్కొన్నారు. ఒక చిన్నారి చుట్టూ ఈ కథ తిరుగుతుందట. చిన్నారిని ఎవరో పట్టుకోవాలని ప్రయత్నించడం, ఆ పెద్దల నుంచి తప్పించుకోవడానికి చిన్నారి వేసే అడుగులు ఆసక్తిగా ఉంటాయట.

Also Read : 'వండర్ ఉమెన్' రివ్యూ : అమ్మ కాబోయే మహిళలు, భర్తలు తప్పకుండా చూడాల్సిన సినిమా!

'గీత సాక్షిగా'లో ఎవరి క్యారెక్టర్లు ఏంటి?
'గీత సాక్షిగా' సినిమాలో ఆదర్శ్ జైలులో ఖైదీగా కనిపించనున్నారు. అతని తరపున వాదించే న్యాయవాది పాత్రలో చిత్రా శుక్లా, ఆమెకు ప్రత్యర్థి న్యాయవాదిగా శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించారు. 

టీజర్‌లో ఏముంది?
'గీత సాక్షిగా' టీజర్ విషయానికి వస్తే... ఆదర్శ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకు వెళ్లడం, అతని కోసం చిత్రా శుక్లా జైలుకు వెళితే... ముఖం మీద ఒకరు ఇంక్ పోయడం వంటివి టీజర్‌లో చూడవచ్చు. జైలులో కొంత మంది ఎటాక్ చేయబోతే... అందరినీ చితక్కొట్టిన ఆదర్శ్... 'పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు, వాడి బాబు అర్జునుడిని రా' అంటూ చెప్పిన డైలాగ్, ఆయన సిక్స్ ప్యాక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాపై ఆసక్తి పెంచాయి. 

Also Read : 'ఐరావతం' రివ్యూ : థ్రిల్స్ ఉన్నాయా? లేదంటే టార్చర్ చేశారా?

భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు గోపీసుందర్ (Gopi Sundar Music Director) స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ, ఎడిటర్: కిశోర్ మద్దాలి, సాహిత్యం: రెహమాన్, కళ: నాని, నృత్యం : యశ్వంత్ - అనీష్, ఫైట్స్ : పృథ్వీ.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget