News
News
X

Game On Movie : తాజ్ మహల్ రెంట్‌కు తీసుకుంటాడట - బుర్జ్ ఖలీఫా కొంటాడట!

గీత్ ఆనంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఆన్'. అందులో తొలి గీతం 'రిచో రిచ్'ను విడుదల చేశారు. 

FOLLOW US: 
Share:

అనగనగా ఓ యువకుడు. జీవితంలో ఏమీ సాధించలేని వ్యక్తిగా... నిరాశతో లూజ‌ర్ కింద మిగిలిపోతున్న సమయంలో విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకుంటాడు. అతని జీవితం ఓ ఆట మొదలవుతుంది. ఆ ఆట యువకుడిని ఏ తీరాలకు చేర్చింది? అనే కథతో రూపొందిన సినిమా 'గేమ్ ఆన్' (Game On Movie). ఇందులో గీతానంద్, నేహా సోలంకి (Neha Solanki) జంటగా నటించారు. సినిమాలో తొలి పాటను ఈ మధ్య విడుదల చేశారు. 

'దా చిన్న కూర్చో నీకో కథ చెపుతా...
అనగనగా ఊళ్ళో కుర్ర కథ!
బాధలన్నీ నిండి ఉన్న బుర్ర కథ!
ఒక్కసారి మారిపోయే కథ మొత్తం!
గడియారం వచ్చింది చేతికి...
గేమ్ తెచ్చిపెట్టింది నెత్తికి...
తాజ్ మహల్ ఎంతమ్మ రెంట్ కి!
క్యాష్ ఇచ్చి కొంటా నేను బుర్జ్ ను!
అయ్యా నేను...
రిచ్ రిచీ రిచీ రిచీ రిచ్' అంటూ సాగే ఈ గీతాన్ని అసుర రాశారు. రిక్కీతో కలిసి ఆలపించారు కూడా!

గేమ్ ఆన్... ఇదొక ఎమోషనల్ జర్నీ!
'గేమ్ ఆన్' చిత్రాన్ని (Game On Movie) క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ పతాకాలపై రవి కస్తూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇంటెన్స్ క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య జ‌రిగే ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా సినిమాను రూపొందించామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Also Read : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్

'రిచో రిచ్...' సాంగ్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ ''సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొత్తగా ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ ఫేమస్ నవాబ్ గ్యాంగ్ బ్యాండ్ మా సినిమాకు మ్యూజిక్ అందించారు. ప్రోమోకు వాళ్ళు అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ కూడా బావుందని చెబుతున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్, ప్రచార చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. దాంతో సినిమాపై మాకు చాలా మంచి నమ్మకం ఏర్పడింది. కొత్తదనంతో కూడిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. మా సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమాకు ఇద్దరు అన్న దమ్ములుగా వర్క్ చేస్తున్నారు. మా గీతానంద్, దర్శకుడు దయానంద్ అన్నదమ్ములే. వాళ్ళు చెప్పిన చెప్పిన కంటెంట్ నచ్చడంతో సినిమా నిర్మించా. టీమ్ అందరూ చక్కగా పని చేశారు. అర‌వింద్ విశ్వనాథన్ అద్భుతమైన విజువ‌ల్స్ అందించారు. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం'' అని చెప్పారు. 

Also Read రోజుకు రెండు కోట్లు - రెమ్యూనరేషన్ రివీల్ చేసిన పవన్ 

చిత్ర దర్శకుడు ద‌యానంద్ మాట్లాడుతూ ''రొటీన్ సినిమాలకు భిన్నమైన కథతో తీసిన చిత్రమిది. ఇప్పుడు తెలుగులో డిఫ‌రెంట్ సినిమాలు వస్తున్నాయి. వరుస విజయాలు సాధిస్తున్నాయి. ఆ జాబితాలో మా 'గేమ్ ఆన్' కూడా చేరుతుందని భావిస్తున్నాను. ఈ సినిమాలో చాలా ట్విస్టులు, ట‌ర్నులు ఉన్నాయి. యాక్ష‌న్‌, రొమాన్స్, ఎమోష‌న్స్... అన్ని అంశాలు ఉన్నాయి. మా కథ నచ్చి సినిమా చేయడానికి వచ్చిన నిర్మాతకు థాంక్స్. ఆయన ఆస్ట్రేలియాలో ఉంటారు. కానీ, ప్రతి విషయంలో అప్ టు డేట్ ఉంటారు. ఇటువంటి నిర్మాతలు చిత్రసీమకు అవసరం'' అని అన్నారు.

ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, 'బిగ్ బాస్' వాసంతి కృష్ణన్, కిరిటీ, 'శుభ‌లేక' సుధాక‌ర్‌ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు : క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్‌, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎడిట‌ర్ : వంశీ అట్లూరి, స్టంట్స్‌:  రామ‌కృష్ణ‌న్‌, న‌భా స్టంట్స్‌, సంగీతం : న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ - అరుణ్‌, నేపథ్య సంగీతం : అభిషేక్ ఎ.ఆర్‌ మాటలు :  విజ‌య్ కుమార్ సిహెచ్‌, ఛాయాగ్రహణం :  అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌, నిర్మాత‌ : ర‌వి క‌స్తూరి, ద‌ర్శ‌క‌త్వం : ద‌యానంద్‌.

Published at : 15 Mar 2023 12:49 PM (IST) Tags: Neha Solanki Game On Movie Geetanand Richo Rich Song

సంబంధిత కథనాలు

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం