అన్వేషించండి

Gaalodu Movie Song: సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ నుంచి కొత్త సాంగ్ వచ్చేసింది, చూశారా ?

'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌', '3 మంకీస్‌' లాంటి సినిమాల్లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న 'గాలోడు' సినిమా నుంచి కొత్త పాట విడుదల చేసారు.

సుడిగాలి సుధీర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదనుకుంటా.. జబర్దస్త్ షోతో టివి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. బుల్లి తెరపై  మొదలైన సుడిగాలి సుధీర్ ప్రస్థానం అనతికాలంలోనే సిల్వర్ స్క్రీన్ పైకి చేరుకుంది. కామెడీ స్టార్ గా మొదలై సిల్వర్ స్క్రీన్ పై హీరోగా మారాడు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం ఆయన 'గాలోడు' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. నిజానికి ఈ 'గాలోడు' సినిమా గురించి గత సంవత్సరంలోనే వార్తలు వచ్చాయి. అయితే చాలా రోజులు 'గాలోడు' సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ వచ్చిన సుధీర్ కెరీర్ ప్రారంభంలో ఓ వైపు అవకాశాల కోసం తిరుగుతూనే మరోవైపు బతుకుతెరవు కోసం మ్యాజిక్ షో లు చేస్తుండేవాడు. 

అలా కొన్నాళ్ళు చేసిన తర్వాత జబర్దస్త్ షోలో సుధీర్ కు అవకాశం వచ్చింది. మొదట్లో స్కిట్ లలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సుధీర్ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు. ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనుతో కలసి తిరుగులేని టీమ్ గా జబర్దస్త్ లో ఎదిగారు. ఇక రష్మీ, సుధీర్ ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ లు సుధీర్ కెరీర్ ను ఇంకా వేగవంతం చేశాయి. అటు జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా ఇటు టీవీ షోలలో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్. తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హీరో గా ట్రై చేశాడు. 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌', '3 మంకీస్‌' లాంటి సినిమాల్లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ సినిమాలు అంతగా హిట్ అవ్వకపోయినా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. 

ఆ సినిమాల తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న సుధీర్ 'గాలోడు' సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి గతంలోనే టీజర్ ను విడుదల చేసింది సినిమా టీమ్. టీజర్ లో కూడా సుధీర్ లుక్స్ బాగుండటంతో మంచి టాక్ వచ్చింది. టీజర్ లో డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఈ టీజర్ చూసిన సుధీర్ అభిమానులు ఈసారి సుధీర్ కు సూపర్ హిట్ పక్కా, సుధీర్ మాస్ హీరో గా సెటిల్ అయిపోతాడని కామెంట్స్ కూడా చేశారు. ఈ టీజర్ తర్వాత చాలా రోజులు సినిమా నుంచి అప్డేట్ రాలేదు.

చాలా గ్యాప్ తర్వాత 'గాలోడు' సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. సినిమాలో ఒక సాంగ్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. సినిమాలో 'వైఫై నడకలదాన' అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. పాట మధ్య మధ్యలో సుధీర్ తన స్టైల్ లో స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాపై సుడిగాలి సుధీర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతోన్న ఈ సినిమాను  ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌ లో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య & ఇంకా - సమంత 'యశోద'కు పాన్ ఇండియా హీరోల సపోర్ట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Turmeric Water : రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
Avatar Fire And Ash: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Embed widget