Flora Saini: అతను నా దవడ విరిగేలా కొట్టాడు, ఆ దెబ్బలకు చనిపోతా అనుకున్నా: ఆశా షైనీ
నటి ఫ్లోరా సైనీ మరోసారి సంచలన విషయాలను వెల్లడించింది. తాను ఎదుర్కొన్న దారుణమైన గృహ హింస గురించి వివరించింది. మాజీ బాయ్ ఫ్రెండ్ కొట్టిన దెబ్బలకు చనిపోతాననుకున్నట్లు తెలిపింది.
![Flora Saini: అతను నా దవడ విరిగేలా కొట్టాడు, ఆ దెబ్బలకు చనిపోతా అనుకున్నా: ఆశా షైనీ Flora Saini Recalls Facing Domestic Violence By Ex-Boyfriend Flora Saini: అతను నా దవడ విరిగేలా కొట్టాడు, ఆ దెబ్బలకు చనిపోతా అనుకున్నా: ఆశా షైనీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/05937843d9227e1d95ca061bf84c69831670401024777544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సినీ నటి ఫ్లోరా షైనీ (ఆశా షైనీ) తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత దారుణమైన గృహహింస గురించి షాకింగ్ విషయాలు చెప్పింది. 2007లో తన మాజీ బాయ్ ఫ్రెండ్ గౌరంగ్ దోషి తనను చిత్ర హింసలకు గురి చేశాడని చెప్పింది. తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వివరించింది. 2018లో మొదలైన #MeToo ఉద్యమ సమయంలో ఆమె తనకు ఎదురైన డొమెస్టిక్ వాయిలెన్స్ గురించి నోరు విప్పింది. తాజాగా మరో ఇంటర్వ్యూలోనూ ఆ చేదు జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంది.
నాదీ శ్రద్ధా వాకర్ పరిస్థితే!
సినిమా ప్రొడ్యూసర్ గా ఉన్న గౌరంగ్ దోషితో ఫ్లోరాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి సహజీవనం కొనసాగించారు. అతడి కోసం ఫ్లోరా తన కుటుంబ సభ్యులను కాదని మరీ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తొలుత తనను బాగానే చూసుకున్నాడు. కొంత కాలం తర్వాతే తన నిజ స్వరూపం బయటపడిందని వెల్లడించింది. తాజాగా జరిగిన శ్రద్ధా వాకర్ హత్య గురించి స్పందించిన ఫ్లోరా, తనూ అలాంటి బాధనే అనుభవించినట్లు చెప్పింది.
ఆ దెబ్బలకు చనిపోతా అనుకున్నా!
“శ్రద్ధా వాకర్ కు ఎలాంటి పరిస్థితి ఎదురయ్యిందో తనకు కూడా అలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఆమె బాయ్ ఫ్రెండ్ లాగే, నా బాయ్ ఫ్రెండ్ కూడా ముందుగా మా కుటుంబం నుంచి దూరం చేశాడు. అతడి కోసం నేను ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. కొద్ది రోజుల్లోనే తనలో దారుణమైన మార్పు కనిపించింది. తన కోసం నేను అయిన వాళ్లను అందరినీ వదిలేసి వస్తే, తను తీవ్ర హింసలకు గురి చేశాడు. అతడు పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించే వాడు. ఎందుకు తనను కొడుతున్నాడో అర్థం అయ్యేది కాదు. ఒకరోజు తను కొట్టిన దెబ్బలకు నా దవడ విరిగింది. ఇవాళ నిన్ను చంపేస్తా అంటూ దారుణంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక చనిపోతా అనుకున్నా. కానీ, తన నుంచి నెమ్మదిగా బయటపడ్డాను. ఒంటి మీద బట్టలు ఉన్నాయా? లేదా? అని చూసుకోలేదు. దారుణమైన దెబ్బలతో నడిచేందుకు ఓపిక లేకున్నా, ప్రాణ భయంతో పారిపోయాను. లేదంటే అతడి కారణంగా నేను చనిపోయేదాన్ని. తిరిగి అతడి దగ్గరికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. మరుసటి రోజు తన మీద పోలీసులకు ఫిర్యాదు చేశా. మొదట్లో నేను చెప్పే విషయాన్ని పోలీసులు నమ్మలేదు. కానీ, రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేశారు” అని వివరించింది.
తెలుగులో పలు సినిమాలు చేసిన ఫ్లోరా
ఫ్లోరా టాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది. ‘నరసింహనాయుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. హిందీలో ‘లవ్ ఇన్ నేపాల్’, ‘దబంగ్-2’, ‘ధనక్’, ‘ స్త్రీ’ లాంటి సినిమాల్లో నటించింది.
Read Also: అసభ్యకరంగా అక్కడ తాకాడు, పసుపు బట్టలంటేనే భయం పుడుతోంది: ఐశ్వర్య లక్ష్మి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)