By: ABP Desam | Updated at : 17 May 2023 12:42 PM (IST)
Photo Credit: Chris Hemsworth/Instagram
క్రిస్ హేమ్స్ వర్త్ తాజా చిత్రం 'ఎక్స్ ట్రాక్షన్ 2' చిత్రానికి సంబంధించి మరో ట్రైలర్ విడుదల అయ్యింది. తొలి భాగం మాదిరిగానే రెండో పార్ట్ ను కూడా నేరుగా ఓటీటీ విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీని జూన్ 16న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 'ఎక్స్ ట్రాక్షన్' మొదటి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా రెండో భాగాన్ని తీర్చిదిద్దారు. ఈ ట్రైలర్ యాక్షన్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ‘టైలర్ రేక్’ పాత్రలో క్రిస్ హేమ్స్ వర్త్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ అలరిస్తోంది.
'అవెంజర్స్' సినిమాతో హాలీవుడ్ ఓ సంచలనం సృష్టించిన క్రిస్ హేమ్స్ వర్త్.. 'థార్' పాత్రలో నటించి ప్రపంచ యాక్షన్ సినీ లవర్స్ ను ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో నటించడంలో తనను మించిన వారెవ్వరూ ఉండరనే పేరు తెచ్చుకున్నారు. 2020లో సామ్ హర్‌గ్రేవ్ దర్శకత్వంలో 'ఎక్స్ ట్రాక్షన్' సినిమాలో హీరోగా తన అద్భుతన నటనను కనబర్చారు. ఈ సినిమా పార్ట్ 1 ఎండింగ్ లో క్రిస్ చనిపోయినట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత ఏమైందన్న ఉత్కంఠను కలిగించేలా, మరో పార్ట్ కోసం వెయిట్ చేసేలా మొదటి భాగాన్ని చిత్రీకరించారు. ఈ మూవీ మొదటి భాగం తెలుగులో కూడా అందుబాటులో ఉంది. సీక్వెల్‌ను సైతం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్ బుధవారం తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఆగిపోయిందో, అక్కడ నుంచే 'ఎక్స్ ట్రాక్షన్' సీక్వెల్ ను స్టార్ట్ చేసినట్లు రుస్సో బ్రదర్స్ వెల్లడించారు. క్రిస్ హెమ్స్ వర్త్, తాను ఎక్కడైతే ఓడిపోయాడో అదే ప్రాంతం నుంచి తన పోరాటాన్ని కంటిన్యూ చేసినట్లుగా ఈ ట్రైలర్‌లో అద్భుతంగా చూపించారు. ట్రైలర్ ఆద్యందం పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మంచు కొండల్లో హెలికాప్టర్‌పై గన్‌తో అటాక్ చేయడం, రైలులో రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ లో హైలైట్ గా ఉన్నాయి. యాక్షన్ అండ్ ఇంట్రస్టింగ్ సీన్స్ తో రెండున్న నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. కాగా సోషల్ మీడియాలోనూ దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది.
డైరెక్టర్ సామ్ హర్‌గ్రేవ్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతుండడంతో ఈ చిత్రంపై అభిమానులు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇంతకుముందు సామ్.. 'మార్వెల్ సూపర్ సిరీస్' సినిమాలతో పాటు 'హంగర్ గేమ్స్' చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇక 'ఎక్స్‌ట్రాక్షన్' మూవీ సీక్వెల్ మూడేళ్ల తర్వాత రాబోతుండడంతో యాక్షన్ మూవీ లవర్స్ ఈ సినిమా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Read Also: 'ఆదిపురుష్' టీమ్ భయపడుతోందా? - ప్రభాస్ ఫ్యాన్స్ లో భయం భయం!
'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?
Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్
HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?
Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?
అఖిల్‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!