By: ABP Desam | Updated at : 12 Dec 2022 09:04 PM (IST)
Edited By: Mani kumar
Chiranjeevi-Balakrishna
సంక్రాంతి వచ్చిందటే చాలు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. ఈ సీజన్ లో చాలా మంది హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలో దిగుతారు. ప్రతీయేటా సంక్రాంతికి టాలీవుడ్ లో పెద్ద హీరోలు సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈసారి సంక్రాంతికి కూడా బడా హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలు సంక్రాంతికే విడుదల కానున్నాయి. ఇప్పటికే విడుదల తేదీలను కూడా ప్రకటించారు మేకర్స్.
దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు దర్శకత్వం వహించగా.. గోపిచంద్ మలినేని ‘వీర సింహారెడ్డి’ సినిమాకు దర్శకత్వం వహించారు. విశేషం ఏంటంటే.. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థే నిర్మించింది. ఈసారి సంక్రాంతికి తెలుగులో ఈ రెండు సినిమాలూ పోటీ పడనున్నాయి. అందుకే ఈ రెండు చిత్రాలు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయ్యాయని సమాచారం. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ రెమ్యూనరేషన్లతో కలిపి రూ.140 కోట్లకు చేరుకుందని టాక్, అలాగే బాలయ్య ‘వీర సింహారెడ్డి’ కూడా దాదాపు రూ.110 కోట్ల రూపాయల వరకూ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు స్థాయిలో ధర పలికాయని వినికిడి. ప్రస్తుతం యూరప్ లో చిరంజీవి, శృతిహాసన్ ల పాటల చిత్రీకరణ జరుగుతోంది. అలాగే, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ క్యారెక్టర్ పై హైదరాబాద్ లో వర్క్ జరుగుతోంది. ఇక నందమూరి బాలకృష్ణ డిసెంబర్ 18 నుంచి హైదరాబాద్ లో పెండింగ్‌లో ఉన్న పాటను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత మొత్తం షూటింగ్ ను పూర్తి చేస్తారని సమాచారం. ఈ రెండు సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమాలపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
ఈసారి సంక్రాంతి బరిలో టాలీవుడ్ బడా హీరోల సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. తమిళ హీరో అజిత్ నటించిన ‘తునివు’ సినిమా తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అలాగే నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి, తమిళ నటుడు విజయ్ ఈ ముగ్గురి కలయికలో ‘వారిసు’ సినిమా వస్తోంది. ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’గా సంక్రాంతికే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారనే టాక్ రావడంతో ఎవరికి ఎన్ని థియేటర్లు బుక్ అవుతాయి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వీటితో పాటు తెలుగులో ‘విద్య వాసుల అహం’, ‘కళ్యాణం కమనీయం’ లాంటి సినిమాలు కూడా సంక్రాంతికే విడుదల కానున్నాయి. ఇక బాలకృష్ణ సినిమా జనవరి 12న విడుదల అవుతుండగా.. చిరంజీవి సినిమా జనవరి 13న విదుదల కానుంది. మరి ఈ సినిమాలన్నిటిలో ఈసారి సంక్రాంతి విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి.
K Viswanath Death: కె.విశ్వనాథ్ కెరీర్లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!
Sankarabharanam: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ‘శంకరాభరణం’ రిలీజైన రోజే అస్తమించిన కళాతపస్వి!
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Gruhalakshmi February 3rd: ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయేందుకు అభి ప్లాన్- నందు వ్యాపారానికి లాస్య కండిషన్
Guppedantha Manasu February 3rd Update: రాజీవ్ అరెస్ట్ తో రిషికి నిజం తెలిసిపోయింది, తనెవరో తెలియాలన్న రిషికి ఫజిల్ వదిలేసిన వసు!
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక