Devara Movie: జపాన్ నుంచి అమెరికా వచ్చిన ఫ్యాన్స్ - ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఉంటది మరి!
NTR Fans: ‘RRR’ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. ‘దేవర’ మూవీ కోసం జపాన్ నుంచి అమెరికాకు వచ్చిన పలువురు అభిమానులు.. యంగ్ టైగర్ ను కలిసి ఫుల్ ఖుషీ అయ్యారు.
NTR Japanese Fans meeting: ప్రపంచ వ్యాప్తంగా ‘దేవర’ జాతర షురూ అయ్యింది. మూడేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి అడుగు పెట్టింది. దేశ వ్యాప్తంగా తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తుతున్నారు. సినిమా చూసిన వాళ్లంతా పాజిటివ్ గా రివ్యూ ఇస్తున్నారు. థియేటర్ల దగ్గర ఎన్టీఆర్ అభిమానులు ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.
అమెరికాలోని ఎన్టీఆర్ సందడి
‘దేవర’ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. లాస్ ఏంజెలిస్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక బియాండ్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. ఈ సినీ వేడుకలో ‘దేవర’ సినిమాను ప్రదర్శించారు. బియాండ్ ఫెస్ట్ లో అభిమానులతో కలిసి ఎన్టీఆర్ సినిమా చూశారు. ఆ తర్వాత తనను కలిసేందుకు వచ్చిన ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించారు. దేశ విదేశాల నుంచి సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులను చూసి ఫుల్ ఖుషీ అయ్యారు.
What an incredible evening watching Devara in Los Angeles. Thank you to the @BeyondFest team and audience for giving me yet another cherished moment with your amazing applause… Much love always! pic.twitter.com/1WW3RyClCy
— Jr NTR (@tarak9999) September 27, 2024
జపాన్ కు వస్తానంటూ లేడీ ఫ్యాన్ కు హామీ
‘RRR’ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. జపాన్ లో ఆయనకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బియాండ్ ఫెస్ట్ లో పాల్గొంటున్నారని తెలుసుకుని, ఏకంగా టోక్యో నుంచి లాస్ ఎంజెలిస్ కు అభిమానులు తరలి వచ్చారు. సినిమా స్క్రీనింగ్ తర్వాత తమ అభిమాన హీరోతో కాసేపు ముచ్చటించారు. తమ దేశంలో ఎందో మంది అభిమానులు ఉన్నారని, వారంతా తనను చూడాలనుకుంటున్నట్లు ఎన్టీఆర్ కు చెప్పారు. తమ దేశానికి రావాల్సిందిగా ‘దేవర’ను ఆహ్వానించారు. జపాన్ అభిమానుల ప్రేమకు ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తప్పకుండా వస్తానని వారికి మాట ఇచ్చారు. త్వరలోనే జపాన్ కు వచ్చి అభిమానులతో కలిసి సినిమా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అభిమానులకు ఆయన ఇచ్చే గౌరవం పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
A fan traveled all the way from Tokyo to Los Angeles just to watch #Devara with @tarak9999 at the @BeyondFest.
— Teju PRO (@Teju_PRO) September 27, 2024
And when he met, her reaction was priceless! What a moment to witness! pic.twitter.com/ssPkh3m2Yz
బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శించిన తొలి ఇండియన్ మూవీ ‘దేవర’
ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. . బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శించిన తొలి భారతీయ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ వేడుకలో ఎన్టీఆర్ ప్రత్యేకంగా పాల్గొని సినిమా చూశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, సైఫ్ అలీఖాన్ నెగెటివ్ పాత్రపోషించారు. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పించిన ఈ సినిమాను మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఇవాళ విడుదలైంది. రెండు పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారంటూ ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Read Also: దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?