Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?
యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ తన కల నెరవేర్చుకుంది. ఎట్టకేలకు తన కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. ఈ ఇంటి నిర్మాణం కోసం నాగార్జున సాయం చేసినట్లు వెల్లడించింది.
‘మై విలేజ్ షో’తో యూట్యూబ్ స్టార్ గా మారింది గంగవ్వ. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో టెస్టెంట్ గా అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. ఎప్పటికైనా సొంతిళ్లు నిర్మించుకోవాలి అనుకున్న ఆమె, ఎట్టకేలకు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నిర్మించుకున్న ఇంట్లోకి గృహ ప్రవేశం చేసింది. ఈ వేడుకలో పలువురు బిగ్ బాస్ షో కంటెస్టెంట్లు, స్థానిక ఎమ్మెల్యే, మై విలేజ్ షో టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో నాగార్జునకు, బిగ్ బాస్ టీమ్ కు గంగవ్వ ధన్యవాదాలు చెప్పారు.
కోరిక చెప్పిన గంగవ్వ, నెరవేర్చుతానన్న నాగార్జున
బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పాల్గొన్న గంగవ్వ, 5 వారాల పాటు హౌస్ లో ఉంది. వారానికి 2 లక్షల చొప్పున ఆమె 10 లక్షల రెమ్యూనరేషన్ అందుకుంది. బిగ్ బాస్ లో అందరీ ఆకట్టుకున్న ఆమె, అనారోగ్య కారణాలతో బయటకు వచ్చింది. ఎలిమినేషన్ సందర్భంగా తనకు ఓ ఇల్లు నిర్మించుకోవాలనే ఆశ ఉన్నట్లు నాగార్జునకు చెప్పింది. ఆమె కలను తాను నెరవేర్చుతానని నాగార్జున హామీ ఇచ్చారు. గంగవ్వకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పారు.
కొత్త ఇంటి కోసం నాగార్జున రూ. 7 లక్షలు సాయం
చెప్పినట్లుగానే నాగార్జున తన ఇంటి నిర్మాణానికి సాయం చేసినట్లు చెప్పింది. కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ. 7 లక్షలు సాయం చేసినట్లు వెల్లడించింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు 5 వారాలకు రెమ్యూనరేషన్ కింద 10 లక్షలు ఇచ్చారని వెల్లడించింది. మొత్తం ఇల్లు కట్టేందుకు 20 లక్షలు ఖర్చు అయినట్లు వివరించింది. ఇక డీఎన్కే కన్ స్ట్రక్షన్స్ సంస్థ ఈ ఇంటిని అద్భుతంగా నిర్మించింది. రెండు బెడ్రూంలు, ఓ హాల్, కిచెన్, పూజ గది, మూడు బాత్రూంలు.. చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసింది. నాగార్జున నుంచి ఇంటికోసం చెక్కుతో పాటు బిగ్ బాస్ రెమ్యూనరేషన్ కూడా వచ్చినట్లు ఇప్పటికే గంగవ్వ చెప్పింది. బిగ్ బాస్ షో తర్వాత హైదరాబాద్ కు వెళ్లినప్పుడు నాగార్జునను కలిసి మాట్లాడినట్లు చెప్పింది.
View this post on Instagram
అప్పుడు ఉండలేకపోయా, ఇప్పుడైతే..
అటు బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీ గురించి గుర్తు చేసుకుంది గంగవ్వ. బిగ్ బాస్ ఇంట్లో ఉండటం అప్పట్లో తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు అయితే, ఇంకా ఎక్కువ రోజులు ఉండేదానని చెప్పుకొచ్చింది. అక్కడ తిని పడుకోవమే పనిగా ఉండేదన్నారు. వేరే పనేమీ లేకపోవడంతో తాను ఉండలేక పోయినట్లు వివరించింది. కరోనా క్వారంటైన్ కింద 15 రోజులు హోటల్ లో ఉంచడం కూడా తనకు విసుగు కలిగించినట్లు చెప్పుకొచ్చింది. తనకు నటన అంటే చాలా ఇష్టం అని చెప్పిన ఆమె, ప్రస్తుతం యూట్యూబ్ షోలు చేస్తున్నట్లు వివరించింది.
Read Also: చావు అంచుల్లోకి వెళ్లి వచ్చా, గుండె పోటుపై సుస్మితా సేన్ ఎమోషనల్!