Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు: చిరు.. నాగ్.. రికార్డులను బ్రేక్ చేసిన ఎన్టీఆర్, టీఆర్పీ అదుర్స్!
ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాలిటీ షో.. పాత రికార్డులను బద్దలకొడుతోంది. ఏ సీజన్‌కు ఎంత రేటింగ్ వచ్చిందో చూడండి.
![Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు: చిరు.. నాగ్.. రికార్డులను బ్రేక్ చేసిన ఎన్టీఆర్, టీఆర్పీ అదుర్స్! Evaru Meelo Koteeswarulu TRP Rating: Jr NTR Beats Chiranjeevi and Nagarjuna’s records Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు: చిరు.. నాగ్.. రికార్డులను బ్రేక్ చేసిన ఎన్టీఆర్, టీఆర్పీ అదుర్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/63f4f961cfd6729e1a37a2fc917c2c6d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో వీక్షకుల మనసు దోచుకుంటోంది. హీరో రామ్ చరణ్ ఎంట్రీతో మొదలైన ఈ షో ఇప్పుడు టీఆర్పీ రేటింగ్స్‌లో కూడా దూసుకెళ్తోంది. ‘బిగ్ బాస్’ తర్వాత.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోతో ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. షో కూడా ఆధ్యాంతం ఆసక్తికరంగా సాగుతుండటంతో అంతా టీవీలకు అతుక్కుపోతున్నారు.
ప్రముఖ కాలమిస్ట్, సినీ విశ్లేషకుడు మనోబాల విజయ్ బాలన్ తెలిపిన శుక్రవారం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. నాగర్జున హోస్ట్‌గా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మొదటి సీజన్‌కు టీఆర్పీ రేటింగ్ 9.7 లభించింది. సీజన్ 2కు 8.2, సీజన్ 3కి 6.72 లభించింది. చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించిన సీజన్ 4కు టీఆర్పీ 3.62 మాత్రమే లభించింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ (సీజన్ 5)కు 11.4 టీఆర్పీ రేటింగ్ లభించడం గమనార్హం. అయితే, ‘మా టీవీ’లో బిగ్‌బాస్ సీజన్ 5 మొదలైన తర్వాత ఈ రేటింగ్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
ఆగస్టు 22 నుంచి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ (EMK) ప్రారంభమైంది. ప్రతి సోమవారం నుంచి బుధవారం వరకు రాత్రి 8.30 గంటలకు ప్రసారం ఈ షో ప్రసారమవుతుంది. ఒకప్పుడు ఈ కార్యక్రమం.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో మాటీవీలో ప్రసారమయ్యేది. ఈ కార్యక్రమానికి అప్పట్లో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. మొదటి మూడు సీజన్స్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా నాలుగో సీజన్‌కు మాత్రం మెగాస్టార్ చిరంజీవి బాధ్యత వహించారు. దీని ప్రకారం చూస్తే ఎన్టీఆర్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ను సీజన్-5గా చెప్పుకోవచ్చు. అయితే, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే టైటిల్‌ను ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’గా మార్చడం ఒక్కటే ఇందులో మార్పు. అలాగే.. ఇప్పుడు ఈ షోను ‘మాటీవీ’కి బదులుగా ‘జెమినీ టీవీ’ ప్రసారం చేస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్ అనగానే ఈ షోపై అంచనాలు బాగా పెరిగాయి. తప్పకుండా ఈ షో.. మాంచి టీఆర్పీ ఇస్తుందని అంచనా వేశారు. ఊహించినట్లే ఇది రికార్డు స్థాయిలో రేటింగ్ సాధించింది.
Also Read: మత్తులో మాణిక్యాలు.. ఎఫ్-క్లబ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ కథ, ఆ పార్టీయే కొంప ముంచిందా?
Also Read: ‘బిగ్‌బాస్’ విన్నర్ మృతిపై సందేహాలు.. ఆ రాత్రి ఏం జరిగింది? పోలీసులు ఏమన్నారంటే..
Also Read: ఆర్జీవీ చెంప పగలగొట్టిన అషూ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్.. వర్మ మళ్లీ తెగించారు
Also Read: బొమ్మరిల్లు సిద్ధార్థ్ చనిపోయాడంటూ ప్రచారం.. కావాలనే చేస్తున్నారంటూ ఆవేదన
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)