అన్వేషించండి

Jabardasth Promo: పెళ్లికి.. పిల్లలకు సంబంధం ఏంటన్న రష్మీ, పండును మోసం చేసిన శివాజీ, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన కమెడియన్స్!

ఎప్పటి లాగే ఈ వారం కూడా బుల్లితెర ప్రేక్షకులకు ‘జబర్దస్త్’ షో ఫుల్ గా ఎంటర్ టైన్ చేయబోతోంది. అదిరిపోయే స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతున్నాయి.

Jabardasth Latest Promo: దశాబ్ద కాలంగా బుల్లితెరను ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్. ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఉభయ రాష్ట్రాల్లో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఎప్పటి లాగే ఈ వారం కూడా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేందుకు రెడీ అయ్యింది. తాజాగా ఈ షోకు సంబంధించిన  ప్రోమో విడుదల అయ్యింది. ఆయా టీమ్ లు చేసిన స్కిట్లు ఫుల్ ఫన్నీగా అలరించాయి. 

డ్యాన్స్ తో ఇరగదీసిన భాస్కర్, ఫైమా

ప్రోమో ప్రారంభం కానే.. బుల్లెట్ భాస్కర్, ఫైమా అదిరిపోయే డ్యాన్స్ తో అలరించారు. ‘అమ్మతోడు.. నాన్న తోడు.. పుట్టించిన బ్రహ్మ తోడు’ అనే పాటకు సూపర్ గా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. భార్య, భర్తలుగా పంచ్ లతో కడుపుబ్బా నవ్వించారు.

పెళ్లికి పిల్లలకు సంబంధ ఏంటన్న రష్మీ

కెవ్వు కార్తీక్ లేడీ గెటప్ లో ఆకట్టుకున్నాడు. వీడు నా కొడుకు అని చూపిస్తూ, “నీ కొడుకు ఏడి? ఫారిన్ కు పంపించావా?” అని రష్మిని అడుగుతాడు. “నాకు అలాంటివి ఏమీ లేదు” అని చెప్తుంది.  “పెళ్లి కాలేదా?” అంటాడు కార్తీక్. “పెళ్లికి, పిల్లలకు సంబంధం ఏంటి?” అని రష్మీ అనడంతో అందరూ షాక్ అవుతారు.

హోమ్ నీడ్స్ షాప్ తో అలరించిన ఆటో రామ్ ప్రసాద్

‘హోమ్ నీడ్స్’ షాపు ఓనర్ గా ఆటో రామ్ ప్రసాద్ ఫుల్ ఫన్ చేస్తాడు. పుట్టిన ప్రతి ఒక్కరికీ ఎన్నో నీడ్స్ ఉంటాయని, అందుకే హోమ్ నీడ్ షాప్ పెట్టానని చెప్తాడు. దొరబాబు చాప కొనేందుకు షాపుకు వస్తాడు. “మంచి బెడ్లు ఉన్నాయి.. తీసుకోవచ్చు కదా?” అంటే.. “బెడ్ బెడ్ రూమ్ లోనే ఉంటుంది. చాప అయితే, చుట్టి చంకలో పెట్టుకుని వెళ్లొచ్చు” అని చెప్పడంతో అందరూ నవ్వుతారు. “ఇది మంచి చాపేనా? లాస్ట్ టైమ్ ఓ వెధవ మంచి చాప అని ఇచ్చాడు. రెండు మోకాళ్లు కొట్టుకుపోయాయి” అనడంతో అందరూ నవ్వుతారు. “చాపకు మోకాళ్లు ఎందుకు కొట్టుకుపోయాయండీ” అని అడగడంతో “నేను యోగా టీచర్ ను. పొద్దున్నే యోగా చేస్తాను” అనడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోతారు.

తోటి కంటెస్టెంట్లపై పంచుల పటాసులు పేల్చిన రాఘవ

ఇక జబర్దస్త్ కంటెంటెస్ట్ లు అందరినీ తన స్కిట్ లో పెట్టుకున్న రాఘవ వారిపై ఫుల్ పంచులు వేశాడు. ‘శనివారం వస్తే వారికి కన్నీరు తప్ప.. పన్నీరు ఉండదంటూ ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. ఇక నూకరాజు, తాగుబోతు రమేష్ సాధువుల గెటప్ లలో అలరించారు. ఇక వర్ష, పండు కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. “రాత్రి నిద్రలేక నీరసం వచ్చిందని వర్ష చెప్పడంతో.. పండు తన వల్లే నిద్రలేదని పోజు కొడతాడు. రాత్రి అతడు ఇంటికి రాకపోవడం వల్లే నిద్రలేదని వర్ష చెప్పడంతో అందరూ నవ్వుతారు. ఒకరు లవ్ లెటర్ రాయడం వల్లే నిద్రలేని వర్ష చెప్తుంది. “శివాజీ దగ్గరికి పదా.. వాడి అంతు తేలుద్దాం” అంటాడు. “లవ్ లెటర్ రాసిందే తను” అని వర్ష చెప్పడంతో పండు షాక్ అవుతాడు” ఈ షోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఈ నెల 15, 16 నాడు ఈటీవీలో రాత్రి 9.30గంటలు ప్రసారం కానుంది.  

Read Also: సన్నీ డియోల్ మూవీలో ‘మసూద‘ బ్యూటీ, తెలుగమ్మాయి దశ తిరిగినట్టేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget