News
News
X

Eternals తెలుగు ట్రైలర్: ‘అవేంజర్స్’ను మించిన ‘ఇటర్నల్స్’.. థానోస్‌ను ఎందుకు ఆపలేకపోయారు?

‘అవేంజర్స్’కు కొనసాగింపుగా ఈసారి ‘ఇటర్నల్స్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అవేంజర్స్’లో ఉండే థ్రిల్‌ను ఏ మాత్రం మిస్ కాకుండా ఈ చిత్రం ఉండబోతుందని దర్శక నిర్మాతలు అంటున్నారు.

FOLLOW US: 
 
మార్వెల్ సంస్థ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సంస్థ నుంచి విడుదలయ్యే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారు. ఇందుకు ‘అవేంజర్స్’ సినిమానే నిదర్శనం. ‘అవేంజర్స్’ సీరిస్‌కు లభించిన ఆధరణను దృష్టిలో పెట్టుకుని మార్వెల్ మరో సూపర్ హీరోస్ చిత్రంతో వచ్చేస్తోంది. ‘అవేంజర్స్’ సినిమాను అనుసంధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఇటర్నల్స్’గా మన ముందుకు వస్తున్న ఈ సూపర్ హీరోస్.. ‘అవేంజర్స్‌’ను మించినవారు. ‘అవేంజర్స్’ ఈ భూమి మీదకు రాకముందే.. ఏడు వేల ఏళ్ల కిందట.. చెడుతో పోరాడేందుకు ఏర్పడిన సూపర్ హీరోస్ టీమ్ ఇది. 

ఈ చిత్రంలో హాలీవుడ్ సీనియర్ నటులు ఎంజేలినా జోలీ థేనా పాత్రలో కనిపిస్తుండగా, సల్మా హయక్ ఎజాక్ అనే పాత్రలో కనిపించనుంది. వీరితోపాటు జెమ్మా చాన్, రిచర్డ్ మాడెన్, కుమాయిల్ నంజియాని, లియా మెక్‌హగ్, బ్రియాన్ టైరీ హెన్రీ, లారెన్ రిడ్‌లాఫ్, బారీ కియోఘన్, డాన్ లీ, హరీష్ పటేల్, కిట్ హారింగ్టన్ వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. ‘అవేంజర్స్-ఎండ్ గేమ్’లో నాశనమైన జనాభా మళ్లీ తిరిగి ప్రత్యక్షమవుతారు. దీనివల్ల అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. డివియన్స్ అనే రాక్షసుల నుంచి భూమికి ముప్పు ఏర్పడుతుంది. వారితో పోరాడేందుకు ఏడువేల కిందటే భూమి మీదకు వచ్చిన ‘ఇటర్నల్స్’ సాధారణ మనుషుల తరహాలో జీవిస్తుంటారు. డివియన్స్‌తో పోరాడేందుకు మళ్లీ వారంతా ఒక్కటవుతారు. హాలీవుడ్‌లో వస్తున్న మరో అత్యధిక నిడివి గల చిత్రం ఇదేనని ఇండస్ట్రీ టాక్. దాదాపు 2.30 గంటలు సేపు ఈ చిత్రం థ్రిల్ చేస్తుందని అంటున్నారు. 

ఈ ఏడాది నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇంగ్లీషులోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘ఇటర్నల్స్’ తెలుగు ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘అవేంజర్స్’ అంతం చేయాలనుకున్న థానోస్.. తన పవర్‌తో ఐదేళ్ల కిందట ప్రపంచంలోని సగం జనాభాను నాశనం చేశాడని, ఐదేళ్ల తర్వాత ‘అవేంజర్స్’ వల్ల తిరిగి పొందగలిగామని అందులోని ఓ పాత్ర ద్వారా చెప్పించారు. థానోస్‌ తర్వాత ఈ భూమికి పొంచివున్న మరో ముప్పు నుంచి కాపాడేందుకు ‘ఇటర్నల్స్’ రావడాన్ని ట్రైలర్‌లో చూపించారు. మీరంతా థానోస్‌ను అంతం చేయడానికి ఎందుకు రాలేదు, చరిత్రలో జరిగిన యుద్ధాలను ఎందుకు ఆపలేదు? ప్రశ్నకు.. ఇటర్నల్స్ సమాధానమిస్తూ.. ‘‘డివియన్స్ వల్ల ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాలని ఆదేశించడం వల్ల’’ అని చెబుతారు. అనంతరం కొన్ని శతాబ్దాల కిందట విడిపోయిన ‘ఇటర్నల్స్’ అంతా ఒక్కటి కావడం.. శత్రువులతో పోరాడటం.. వంటి సన్నివేశాలు చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఆ ట్రైలర్‌ను చూసేయండి మరి. 

‘ఇటర్నల్స్’ తెలుగు ట్రైలర్:

News Reels

ఈ చిత్రంలో హాలీవుడ్ సీనియర్ నటులు ఎంజేలినా జోలీ థేనా పాత్రలో కనిపిస్తుండగా, సల్మా హయక్ ఎజాక్ అనే పాత్రలో కనిపించనుంది. వీరితోపాటు జెమ్మా చాన్, రిచర్డ్ మాడెన్, కుమాయిల్ నంజియాని, లియా మెక్‌హగ్, బ్రియాన్ టైరీ హెన్రీ, లారెన్ రిడ్‌లాఫ్, బారీ కియోఘన్, డాన్ లీ, హరీష్ పటేల్, కిట్ హారింగ్టన్ వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. 

‘అవేంజర్స్’ పాత్రలతో మరో ట్రైలర్:

Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Oct 2021 09:01 PM (IST) Tags: Eternals Telugu Trailer Eternals Eternals in telugu Eternals movie ఇటర్నల్స్

సంబంధిత కథనాలు

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam