Ester Noronha: అందుకే అలాంటి సినిమాలు చేస్తున్నా - అసలు విషయం చెప్పేసిన నటి ఎస్తర్!
సత్యం రాజేష్ హీరో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టెనెంట్’. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా నటి ఎస్తర్ నోరోన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Ester Noronha About Her Movies: సత్యం రాజేష్, మేఘా చౌదరి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'టెనెంట్'. వై యుగంధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మహా తేజ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెరకెక్కుతోంది. మొగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత. ఎమోషనల్ మర్డర్ మిస్టరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. సమాజంలో మన చుట్టూ జరిగే సంఘటనలకు ఈ చిత్ర కథాంశం చాలా దగ్గరగా ఉంటుందని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాను మహిళలు కచ్చితంగా చూడాలని కోరారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంత ట్విస్టులతో ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నానంటే?- ఎస్తర్
ట్రైలర్ లాంఛ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నటి ఎస్తర్ నోరోన్హా కీలక విషయాలు వెల్లడించింది. ‘ఎక్కువగా క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు చేయడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. “నేను సినిమా పరిశ్రమలోకి 2013లో ఎంటర్ అయ్యాను. అప్పుడు ఒక జానర్ ఉండేది. అన్ని ఒకేలా సినిమాలు ఉండేవి. వేరే సినిమాలు చేయాలని ఉన్నా, అలాంటి స్ర్కిప్ట్స్ ఉండేవి కాదు. ఇప్పుడు క్రైమ్, థ్రిల్లర్ జానర్ లో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఇప్పుడు అలాంటి సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. టీవీ షోలో కూడా క్రైమ్ చుట్టూనే తిరుగుతున్నాయి. అప్పట్లో చాలా మంది బ్యాంకాక్, పారిస్, స్విట్జర్ లాండ్ చూడలేదు. అందుకే, సినిమాల్లో పాటలు అక్కడ తీసేవాళ్లు. హీరో, హీరోయిన్లు అక్కడ డ్యాన్స్ చేయడాన్ని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేసేవాళ్లు. మనకు తెలియని వాటిని చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకే, ఇప్పుడు సరికొత్త క్రైమ్, థ్రిల్లర్ జానర్ లో సినిమాలు వస్తున్నాయి. నేనూ అవే చేస్తున్నాను. ఇప్పుడు ఇండియన్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రేక్షకులు కూడా మేకర్స్ కు మంచి మద్దతు ఇస్తున్నారు” అని చెప్పుకొచ్చింది.
సినిమాకు ఎందుకు A సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు
‘టెనెంట్’ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లో ఎక్కడా అశ్లీలత కనిపించకపోయినా, ఎందుకు మీ సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చారు? అనే ప్రశ్నకు దర్శకుడు యుగంధర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. ఈ సినిమాకు A సర్టిఫికేట్ ఇవ్వడం పట్ల అందరం సర్ ప్రైజ్ అయ్యాం. మేము రాసుకున్న కథ, తెర మీద చూపించిన ఎమోషన్స్ కు A సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అర్థం కాలేదు. ఈ సినిమా విడుదలయ్యాక నిజానికి ఈ సినిమాకు A సర్టిఫికేట్ అవసరమా? ఇవచ్చా? ఇవ్వొద్దా? అనేది మీకే తెలుస్తుంది” అని చెప్పారు.
ఇక 'టెనెంట్' సినిమాలో చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, 'ఆడుకాలం' నరేన్, ఎస్తేర్ నొరోన్హా, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేఘ్న కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: పెళ్లి తర్వాత రకుల్ కీలక నిర్ణయం - మొన్నే పెళ్లి, అప్పుడే గుడ్‌న్యూస్‌తో వచ్చేసింది!