Ennenno Janmalabandham November 29th: యాక్సిడెంట్ టైమ్ లో మాళవిక తనతోనే ఉందని అబద్ధం చెప్పిన యష్- ప్రశ్నలతో ఆటాడుకున్న ఝాన్సీ
సులోచనకి యాక్సిడెంట్ చేసింది మాళవిక అనుకుని వేద తన మీద కేసు పెడుతుంది. దీంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద తరఫున లాయర్ ఝాన్సీ వాదిస్తూ ఉంటుంది. అప్పుడు మాళవిక లేచి నిలబడి ఎవరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు నేనే ఒప్పుకుంటున్నాను అని అంటుంది. జడ్జిని నమ్మించడానికి మాళవిక దొంగ ఏడుపు మొదలుపెడుతుంది. యశోధర్ మాజీ భార్యని అని చెప్పుకుంటూ తన సొంత కూతురు ఖుషిని మాయమాటలు చెప్పి వేద లాగేసుకుంది. కూతురు దూరం అయ్యిందన్న బాధలో ఉన్న నా మీద యాక్సిడెంట్ కేసు పెట్టి జైలుకి పంపాలని చూస్తుంది. అసలు క్రిమినల్ నేను కాదు ఆ వేద. అందరి దృష్టిలో ఆమె ఒక దేవత. నామీద కక్ష కట్టి నా ఇద్దరు పిల్లలని అనాథలని చెయ్యలని చూస్తున్నారు. అందుకే నేనే నేరం చేయకపోయినా ఒప్పుకుంటున్నా. నేరం నేనే చేశాను చేయకపోయినా కూడా ఈ మాటలు భరించలేక ఒప్పుకుంటున్నా అని నాటకం ఆడుతుంది.
Also Read: లాస్య నిజస్వరూపం తెలుసుకున్న నందు- పరంధామయ్యని ఇంటికి తీసుకొచ్చిన సామ్రాట్
కోర్టుని తప్పు దారి పట్టించడానికి ఇది డ్రామాలు ఆడుతుంది నువ్వేమి బాధపడకు అని మాలిని వేదకి ధైర్యం చెప్తుంది. రోజు రోజుకి వీళ్ళ ఆగడాలు భరించలేకపోతున్నా ఆ వేద నా కొడుకుని అనాథని చేయాలని చూస్తుంది నాకు శిక్ష వేసెయ్యండి. జైలుకి పంపించండి ఉరిశిక్ష వేసెయ్యండి బాధ భరించలేను అని ఏడుస్తున్నట్టు నటిస్తుంది. అవసరమా నేరం చేశాను అని ఒప్పుకుంటావ్ ఏంటి అవసరమా నీకు అని యష్ మాళవికని తిడతాడు. వేద వచ్చి మాళవికని తిడుతుంది. కాసేపటిలో నీ పరువు తియ్యకపోతే నాపేరు మాళవికనే కాదు అని వేదతో ఛాలెంజ్ చేస్తుంది. వేద కూడా తనకి గట్టిగానే బదులిస్తుంది. కోర్టు వాదనలు మళ్ళీ ప్రారంభవుతాయి.
లాయర్ ఝాన్సీ మాళవికని బోనులో నిలబెట్టి వరుస ప్రశ్నలు వేస్తుంది. మాళవికనే సులోచనని చంపడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని జడ్జి లయర్ ఝాన్సీని అడుగుతాడు. ఉన్నాయని చెప్తుంది. ‘యాక్సిడెంట్ జరగడానికి కొద్ది గంటల ముందు సులోచన గారు ఈ మాళవిక ఇంటికి వెళ్లారు తన కూతురు కాపురంలో నిప్పులు పొయ్యవద్దని వార్నింగ్ ఇచ్చారు. అది తట్టుకోలేని మాళవిక ఆమె బయటకి రాగానే కారులో ఫాలో అయ్యారు గుద్దేశారు. సులోచన గారు చచ్చిపోయారు అనుకుని మాళవిక వెళ్ళిపోయింది కానీ అదృష్టం బాగుండి సులోచన బతికారు’ అని ఝాన్సీ చెప్తుంది. మాళవిక ఇదంతా అబద్ధం అని అరుస్తుంది. అసలు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను పరిసర ప్రాంతంలో కూడా లేనని చెప్తుంది. మరి ఎక్కడకి వెళ్లారని ఝాన్సీ అడుగుతుంది. ఆ మాటకి మాళవిక నీళ్ళు నములుతూ ఇంట్లో లేను షాపింగ్ కి వెళ్ళాను అని కవర్ చేస్తుంది.
Also Read: నిజం తెలిసి గౌతమ్ ని ఛీ కొట్టిన రిషి- దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర
ఏ షాపింగ్ మాల్ కి వెళ్లారని ఝాన్సీ మళ్ళీ అడుగుతుంది. ఆరోజు ఏం షాపింగ్ చేశారు, ఏం కొన్నారు బిల్స్ ఉంటాయి కదా కోర్టుకి ప్రొవైడ్ చేశారా అని అడుగుతుంది. ఆరోజు ఏమీ కొనలేదు విండో షాపింగ్ చేశానని అబద్ధం చెప్తుంది. మీరు వెళ్ళాను అనే షాపింగ్ మాల సీసీటీవీ ఫుటేజ్ తెప్పిస్తాను అనేసరికి మాళవిక ఏం మాట్లాడలేక బిక్కమొహం వేస్తుంది. యాక్సిడెంట్ చేయలేదని మాళవిక అంటుంటే మరి ఎవరు చేశారు అని రెట్టించి రెట్టించి అడుగుతుంది. యష్ కోపంగా ఇనఫ్ అని అరుస్తాడు. మాళవిక చెప్పిందంతా అబద్ధం అని అంటాడు. మాళవిక అక్కడ లేకపోతే ఇంకెక్కడ ఉన్నారు ఎవరితో ఉన్నారని ఝాన్సీ అడుగుతుంది. మాళవిక ఎవరితో ఉన్నారని ఝాన్సీ గట్టిగా అడిగేసరికి నాతోనే ఉందని అబద్ధం యష్ అబద్ధం చెప్తాడు. ఆ మాటకి సులోచన, వేద, మాలిని షాక్ అవుతారు. ఆరోజు ఆ టైమ్ లో మాళవిక నేను కలిసే ఉన్నామని చెప్తాడు.