News
News
వీడియోలు ఆటలు
X

Ennenno Janmalabandham April 20th: ఫస్ట్ నైట్ కి ముస్తాబైన మిసెస్ న్యూసెన్స్ - వేద జీవితంలో నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయిన యష్

వేద, యష్ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

విన్నీ వేదని కలవడానికి హాస్పిటల్ కి వస్తాడు. యశోధర్ ని కలిసిన విషయం చెప్తాడు. నీ భర్త గుండెల్లో నీ బొమ్మ ఉంది అది యష్ కి సొంతం. అది సరిగా అర్థం చేసుకోలేకపోవడం నీదే తప్పు. ప్రతి భర్తకి భార్య విషయంలో కొన్ని స్వార్థాలు ఉంటాయి. అది అర్థం చేసుకోకపోతే బాధపడేది భార్య, నష్టపోయేది భర్త. మీరిద్దరూ ఎంత పిచ్చి వాళ్ళు. ఒకరికొకరు ఎంత ఇష్టం. చెప్పాల్సింది చెప్పి చేయాల్సింది చేసేయ్. మనసుకి బట్టలు వేయకూడదు దిగంబరంగా ఉండాలి. అన్నీ సార్లు భర్త చొరవ తీసుకోవాల్సిన అవసరం లేదు భార్య కూడా చొరవ తీసుకోవచ్చు అని చాలా చక్కగా చెప్తాడు.

Also Read: క్షణక్షణం ఉత్కంఠభరితం- కృష్ణ, భవానీలో గెలుపు ఎవరిది? మురారీ ఎవరికిచ్చిన మాట నిలబెట్టుకుంటాడు

యష్ వేద గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన ఎదురుగా నిలబడే అర్హత కూడా లేదని అనుకుంటూ ఉండగా తన అంతరాత్మ బయటకి వస్తుంది. నాకు నేనే శిక్ష విధించుకుంటాను. వేద నిప్పు, తనకి నువ్వు దూరంగా ఉండాలి. నీ వల్ల వేదకి దూరం అయిన సంతోషం దగ్గర అవాలంటే నువ్వు దూరం అవాలి. అవుతాను నేను వేదకి దూరం అవుతాను. తన కోసం ఏమైనా చేస్తాను తన సంతోషం కోసం ఎంత త్యాగమైన చేస్తాను. నా కోసం ఖుషి కోసం వేద చాలా త్యాగం చేసి మా లైఫ్ లోకి వచ్చింది. అలాంటి తన ఆశలు అన్నీ చంపేసి కష్టపెట్టాను. ఇంత చేసిన నాకు వేద నీడను తాకే అర్హత కూడా లేదు. అందుకే వేద జీవితం నుంచి తప్పుకుంటాను. తనకి చాలా దూరంగా శాశ్వతంగా ఎక్కడికైనా వెళ్లిపోతాను. తన లైఫ్ బాగుండాలంటే వెళ్లిపోవాలని డిసైడ్ అవుతాడు.

Also Read: వేద జీవితాన్ని నిలబెట్టిన విన్నీ, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న యష్- మాళవికని వెర్రిదాన్ని చేసిన అభిమన్యు

ఇంట్లో వేద యష్ సూట్ చూసుకుని మురిసిపోతుంది. మీ చేతిని ఎప్పటికీ వదలను. మీతోనే కలిసి నడవాలని అనుకుంటున్నా. ప్రతిక్షణం మీతోనే గడపాలని కోరుకుంటున్నా. నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నా. ఐలవ్యూ ఎలాట్. అని సూట్ సోఫాలో వేయగానే యష్ వచ్చినట్టు ఊహించుకుంటుంది. ఐలవ్యూ.. ఐలవ్యూ.. ఐలవ్యూ సో మచ్. సెట్ అయిపోయింది నా ఫిలింగ్స్ కి మొత్తం క్లారిటీ వచ్చింది. శ్రీవారితో షేర్ చేసుకుంటానని ఫోన్ చేస్తుంది. త్వరగా ఇంటికి రండి మీతో బోలెడు కబుర్లు చెప్పాలి హ్యాపీగా ఉండాలని చెప్తుంది. వేద మాటలకు యష్ చాలా బాధపడతాడు. నా గుండెల నిండా నీమీద ప్రేమ ఉంది కానీ అది నీ జీవితానికి అడ్డు కాకూడదు. ఇది నా గురించి నేను ఆలోచించుకుని తీసుకున్న నిర్ణయం కాదు నీ గురించి నీకోసం తీసుకున్న నిర్ణయమని ఫీల్ అవుతాడు. వేద యష్ కోసం గది మొత్తం అందంగా అలంకరిస్తుంది. ఖుషి వచ్చి భలే క్యూట్ గా ఉన్నావ్ రూమ్ చక్కగా డెకరేట్ చేశావ్ ఎందుకని అడుగుతుంది. డాడీకి హెల్త్ రికవర్ అయ్యింది కదా అందుకే చేశానని చెప్తుంది.

Published at : 20 Apr 2023 07:22 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial April 20th Episode

సంబంధిత కథనాలు

Dheekshith Shetty : ధరణి ఫ్రెండ్ సూరిగాడికి తెలుగులో ఇంకో వెబ్ సిరీస్ - ఈసారి కాలేజీ పోరగాడిగా!

Dheekshith Shetty : ధరణి ఫ్రెండ్ సూరిగాడికి తెలుగులో ఇంకో వెబ్ సిరీస్ - ఈసారి కాలేజీ పోరగాడిగా!

Daggubati Abhira: టాలెంట్ లేకే ఇన్నాళ్లు సినిమాల్లోకి రాలేదు: దగ్గుబాటి అభిరామ్

Daggubati Abhira: టాలెంట్ లేకే ఇన్నాళ్లు సినిమాల్లోకి రాలేదు: దగ్గుబాటి అభిరామ్

అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్

అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం