Ennenno Janmalabandham July 21 Update: వేదని ఇంటికి తీసుకొచ్చేందుకు రత్నం ప్రయత్నం- మీ అమ్మ మీ డాడీని వదిలేసిందని ఖుషికి చెప్పిన కాంచన
వేద నిజాయితిని తన కుటుంబ సభ్యుల ముందు యష్ నిరూపిస్తాడు. కానీ వేద మాత్రం యష్ ఇంటికి వచ్చేందుకు నిరకరిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
తన మర్యాద తను నిలబెట్టుకోవాలంటే ఆ యశోధర్ వచ్చి మన వేదకి క్షమాపణ చెప్పి తీరాలని సులోచన అంటుంది. అటు యష్ కూడా బతిమలాడి తీసుకెళ్ళే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తాడు. భార్య భర్తల మధ్య గెలుపనేది ఉండదు ఓటమి అయిన గెలుపైన ఉమ్మడిగానే ఉంటుందని రత్నం యష్ కి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ యష్ వినిపించుకోడు. నేను ప్రత్యేకంగా వెళ్ళి ప్రత్యేకంగా క్షమించమని అడగనని తేల్చి చెప్పేస్తాడు. రెండిళ్ళ మధ్య దూరం ఉంటే కలుపుకోవచ్చు, ఇద్దరి మనుషుల మధ్య దూరం ఉంటే కలుపుకోవచ్చు కానీ రెండు మనసుల మధ్య దూరం ఏర్పడితే కలిసి ఉన్నట్టా కలవనట్టా అని యష్ ఆలోచిస్తుంటాడు. అప్పుడే వేద ఇంట్లో నుంచి బయటకి వచ్చి సాంబ్రాణి వేస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు.
రత్నం మరోసారి వేదని తీసుకురమ్మని యష్ తో చెప్పేందుకు చూస్తాడు. వేద మనసు నొప్పించి పంపించాం మళ్ళీ తనని ఒప్పించి తీసుకురావాలని యష్ ని అడుగుతాడు. ఇంతకన్నా నేనేం చేయాలి నాన్న అని యష్ అంటాడు. ఖైలాష్ ని జైలుకు పంపించాం కదా ఇంతకన్నా ఏం చేయాలి అని అనకూడదు వేదకి జరిగింది చాలా పెద్ద అవమానం, ఆమె మీద పడింది చాలా పెద్ద నింద అని రత్నం అంటాడు. తనకి భర్త నుంచి ఓదార్పు, బుజ్జగింపు కావాలి ఏ భార్య అయిన భర్త నుంచి ఇదే కోరుకుంటుందని రత్నం చెప్తాడు. నేను తన కోసం అన్నీ ఆలోచించి తనని నిర్దోషిగా నిరూపించిన దానికి వేద మళ్ళీ ఈ ఇంటి నుంచి అస్సలు వెళ్ళి ఉండకూడదు, ఇక్కడే ఆగిపోవాల్సిందని యష్ అంటాడు. వేద తనకి తానుగా ఇల్లు వదిలి వెళ్లలేదు మనమే ఆ పరిస్థితులు కల్పించాము ఇప్పుడు వెనక్కి వచ్చేలా కూడా మనమే చెయ్యాలని రత్నం అంటాడు. ఇగో ఆవిడకే కాదు నాకు కూడా ఉంటుంది, హార్ట్ అయ్యిందంట కూల్ చేయాలంట గాడిద గుడ్డు ఏం కాదు అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతాడు.
Also Read: తప్పు తెలుసుకున్న సామ్రాట్- ప్రేమ్ ని ఇంటికి రమ్మని పిలిచిన తులసి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన శ్రుతి
వసంత్ వేద దగ్గరకి వచ్చి ఇంటికి రమ్మని అడిగే ప్రయత్నం చేస్తాడు. 'మీ అన్నయ్య చేయాల్సిన పని చేశాడు, సారికను తీసుకొచ్చి నా మీద పడిన నిందని చెరిపేశారు. కానీ ఆయన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు అందరి ముందు ఒక నీచుడు నన్ను వేలెత్తి చూపినప్పుడు, అందరి కళ్ళు నన్ను అనుమానంగా చూసినప్పుడు నేను ఆయన వైపే చూశాను, ఆయన కళ్ళలోకే చూశాను, ఆయన కళ్లలో అనుమానం కనిపించిదని నేను చెప్పను.. కానీ నేను చూడాలనుకున్న నమ్మకం కనపడలేదు. ఒక్క మాట నాకు భరోసాగా ఆయన నోటి నుంచి వినాలని అనుకున్న కానీ ఆయన అనలేదు. దానికి నా మనసు నొచ్చుకుంది ఫీల్ అయ్యాను' అని వేద తన బాధని వసంత్ తో షేర్ చేసుకుంటుంది. మళ్ళీ వసంత్ ఇంటికి రమ్మని అడుగుతాడు కానీ అందుకు వేద రానని చెప్తుంది. ఖుషి మాలిని దగ్గరకి వచ్చి అమ్మని పిలుద్దాం రా నానమ్మ అని అడుగుతుంది. ఆ మాటకి కాంచన కోపంగా అరుస్తుంది. మీ అమ్మ లేదు ఇక రాదు, మీ డాడీని వదిలేసి వెళ్ళిపోయింది, రానని మీ అమ్మే చెప్పింది, ఇక ఈ ఇంట్లో మీ అమ్మ ఊసే ఎత్తకూడదు అని అరుస్తుంది. చిన్నపిల్లతో అలాగేనా మాట్లాడేది అని రత్నం కాంచనని తిడతాడు.
Also Read: మాధవ మీదకి చెయ్యెత్తిన రాధ, మాధవనే తన నాయన అన్న దేవి - ఆవేదనలో సత్య
వేదని ఇంటికి తీసుకెళ్లేందుకు రత్నం వేద ఇంటికి వెళతాడు. నీకు జరగకూడని అవమానం జరిగినప్పుడు మాట్లాడాల్సిన నేను మాట్లాడకుండా ఉండిపోయాను క్షమించమ్మా, కానీ యష్ మాత్రం తను చేయాల్సింది చేశాడు. నువ్వు నిర్దోషివని నిరూపించాడు అయ్యిందేదో అయిపోయింది అదంతా మర్చిపోయి ఇంటికి రమ్మని అడుగుతాడు. ఆ మాటకి సులోచన కోప్పడుతుంది. జరిగిన దానికి అందరి కంటే యశోధర్ ఎక్కువగా బాధపడుతున్నాడని చెప్తాడు. అందరి తరుపున నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంటికి రమ్మని అడుగుతాడు. 'మీ అబ్బాయి నన్ను నిర్దోషి అని నిరూపించాడు సంతోషం, సీత నిజాయితిని నిరూపించేందుకు రాములవారు అగ్నిపరీక్ష చేయించారు. కానీ మీ అబ్బాయి నన్ను అంత ఇబ్బంది పెట్టలేదు నా గౌరవం నిలబెట్టారు అందుకు థాంక్యూ, కానీ సాక్ష్యాధారాలు దొరికే దాకా ఆయన నన్ను నమ్మలేదు, నన్ను ఓదారుస్తూ నీకు నేనున్నాను అని ఒక్క మాట కూడా అనలేదు. ఆయనకి ఆయనగా వచ్చి రా వేద మన ఇంటికి వెళ్దామని నోరార పిలవలేదు, నింద కడిగేసుకుని ఇంట్లోకి రాలేను' అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.
తరువాయి భాగంలో..
డాడీ, నువ్వు, నేను ఒక పార్టీ కదా అని ఖుషి వేదని అడుగుతుంది. అవునమ్మా అని అంటుంది. మరి అయితే మమ్మల్ని వదిలేసి ఇక్కడికెందుకు వచ్చావ్ పదమ్మా మన ఇంటికి వెళ్దాం, నేను విలిస్తే కూడా రావా, నువ్వు నాకు కావాలమ్మ, నువ్వు నాతో ఉంటే చాలమ్మా అని ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది.