Ennenno Janmalabandham August 30th: ఖుషిని లాక్కునేందుకు అభి, మాళవిక కొత్త స్కెచ్- విలవిల్లాడిన తండ్రి మనసు
ఆదిత్యని అడ్డం పెట్టుకుని యశోధర్ మీద పగ సాధించాలని అభిమన్యు, మాళవిక ప్లాన్ వేస్తారు.
ఆదిత్యకి కారు గిఫ్ట్ గా ఇచ్చినందుకు యష్ అభిమన్యు మీద సీరియస్ అవుతాడు. మీరిద్దరూ తనకు ఆదిని దూరం చెయ్యాలనే కోపంతో వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నారని యష్ కొప్పడతాడు. ఆయనగారు ఇచ్చిన గిఫ్ట్ ఆది డ్రైవర్ కి ఇచ్చేశాడని ఈ కోపం ఉక్రోషం అని మాళవిక నవ్వుతుంది. ఎలా నవ్వు వస్తుందే నీకు కంటికి కనిపించని సుడిగుండం నీ వెనకాలే ఉంది అది ఈరోజు కనిపించకపోవచ్చు కానీ అది తెలిసిన రోజు నీకంటూ ఎవ్వరూ ఉండరు. 'ఆది మీద నేను పెంచుకున్న ప్రేమ నీకు అర్థం కాకపోయినా పరవాలేదు కానీ వాడితో పోల్చి మాత్రం చూడకు నా సంతోషాన్ని దూరం చెయ్యడం నా కొడుకుని కాదు ఒక్క రోజైనా నాటకాలు లేకుండా బతకండి. ఆదిని అడ్డం పెట్టుకుని నన్ను, నా కుటుంబాన్ని అవమానించారు నోటికొచ్చినట్టు మాట్లాడారు. నా ఓపిక నశించింది, ఇక ఒక్క మాట కూడా నా వల్ల గురించి మాట్లాడితే క్షమించను. ఆది జీవితాన్ని నాశనం చేస్తున్నారని అంటే నన్నే బ్లెమ్ చేస్తారా'? అని యష్ సీరియస్ అవుతాడు.
ఆదికి కారు ఇచ్చారు జరగకూడని ప్రమాదం జరిగితే అందరూ బాధపడాల్సి వస్తుందని యష్ అంటే జరిగితే జరగనివ్వు ఏమైంది ఇప్పుడు అని అభి నవ్వుతాడు. దీంతో యష్ కోపంగా అభిని కొడతాడు. వాళ్లిద్దరు కలబడుతుంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆపుతారు. ఎవరు మీరు అని యష్ అడుగుతాడు. మఫ్టీ లో ఉన్న పోలీసులం కోర్టు ఆర్డర్ ప్రకారం మీరు ఇక్కడకి రాకూడదని తెలియదా అంటే నా కొడుకు రమ్మని పిలిచాడు అందుకే వచ్చాము అని యష్ చెప్తాడు. ఆది చిన్నపిల్లవాడు తనకి రూల్స్ తెలియవు కానీ మీరు తనకి 100 మీటర్ల దూరంలో ఉండాలని తెలియదా అని లాయర్ అడుగుతాడు. తండ్రిగా కొడుకుని చూడటానికి వచ్చాను అని యష్ చెప్తాడు.
Also Read: అభిమన్యు ఇంట్లో ఖైలాష్ ని చితక్కొట్టిన యష్- తండ్రి ప్రేమ్ చూపించమని యష్ కి సవాల్ విసిరిన మాళవిక
యష్ జరిగింది తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటే మరోవైపు మాళవిక వాళ్ళు మాత్రం డాన్స్ వేస్తూ సంబరపడతారు. తన పగని తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందని మాళవిక హ్యాపీగా చెప్తుంది. ఖుషిని నీ దగ్గరకి తీసుకురావడానికి ఆదిత్యని అద్దం పెట్టుకోవాలి అందుకే తను చదివే స్కూల్ లోనే జాయిన్ చేస్తున్నాను. అన్న ప్రేమతో ఖుషికి నీ మీద ఉన్న కోపం పోయి ఇష్టం పెరిగేలా నీకు దగ్గర చేయగలిగేది ఆది ఒక్కడే. ఆది మాటల్లో నీ గురించి గొప్పగా చూశాను అవి ఖుషి విని తన మనసు మారాలంటే డ్రామా మొదలు పెట్టాలి అందుకు స్కూల్ వేదిక కావాలి అని అభి తన ప్లాన్ చెప్తాడు. ఆదిత్యను రెడీ చేసి స్కూల్ కి పంపిస్తాను ఆ యశోధర్ దగ్గర నుంచి ఖుషిని లాగేసుకుంటాను అని మాళవిక సంబరపడుతుంది.
యష్ పార్టీలో జరిగినదానికి బాధపడుతూ ఉంటే వేద ఓదార్చేందుకు ప్రయత్నిస్తుంది. యష్ వేదని కౌగలించుకుని చిన్న పిల్లడిలా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఆదిత్య పుట్టినప్పుడు ఈ చేతులతో ఎత్తుకున్నాను ఎంత మ్యాజికల్ గా ఉందో తెలుసా.. తన ప్రపంచం నుంచి నేను ఒక్క క్షణం కూడా బయటకి వచ్చేవాడిని కాదు. అలాంటిది ఈరోజు వాడి మాటలు ప్రవర్తన చూసిన తర్వాత నేను కట్టుకున్న ప్రపంచం అంతా పేక మేడలా కూలిపోయింది. మాళవిక వాడి మైండ్ పొల్యూట్ చేసింది నాన్న అనే పిలుపుకి నన్ను దూరం చేస్తుంది. తను మంచిది అని నిరూపించుకోవడానికి నన్ను బ్యాడ్ చేస్తుంది. కానీ ఆదిత్య ఫ్యూచర్ నాశనం అవుతుందని తను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని యష్ ఫీల్ అవుతాడు. అదే అర్థం చేసుకుంటే తను అర్థాంగిగా ఎందుకు ఉండకుండా వెళ్ళిపోతుంది. నాన్న అంటే పిలుపు కాదు భవిష్యత్ గెలుపు అని తనకి తెలియడం లేదు. ఆదిత్య మైండ్ లో మాళవిక నింపిన ద్వేషం ఉంది.. మీ ప్రేమతో దాన్ని దూరం చెయ్యాలి. తన కోసం ఆరేళ్లు వెయిట్ చేశారు మీ ప్రేమని అర్థం చేసుకోవడానికి మరీ కొన్ని రోజులు వెయిట్ చెయ్యలేరా. ఆదిత్యలో కూడా మార్పు వస్తుంది నాన్న ప్రేమ నిజమని తెలుసుకుంటాడు మీ దగ్గరకి వస్తాడు అని వేద ధైర్యం చెప్తుంది.
స్కూల్ లో పేరెంట్స్ మీటింగ్ ఉంది మనం ఇద్దరం కలిసి ఖుషితో వెళ్ళాలి అని వేద అంటుంది. కానీ తనకు అర్జెంట్ పని ఉంది రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ మీటింగ్ ఉందని యష్ చెప్తాడు. కానీ కొంచెం సేపు ఆ మీటింగ్ పోస్ట్ పోన్ చెయ్యండి స్కూల్ లో మీటింగ్ కి కొద్దిసేపు ఉండి వెళ్ళమని అడుగుతుంది కానీ యష్ మాత్రం కుదరదంటే కుదరదని చెప్తాడు. మాళవిక ఆదిత్యని తీసుకుని ఖుషి చదివే స్కూల్ కి తీసుకుని వస్తుంది.
తరువాయి భాగంలో..
ఖుషి, ఆదిత్య ఒక చోట కూర్చుని చాక్లెట్ తింటూ ఉంటుంటే అటు వేద, ఇటు మాళవిక చూసి మురిసిపోతారు. వాళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదని మాళవిక అంటుంది. అన్నాచెల్లెళ్ళు కలిస్తే కన్నుల పండుగగానే ఉంటుందని వేద చెప్తుంది. నేను ఒంటరిని అని మురిసిపోయావ్ అప్పుడు వచ్చాడు నా కొడుకు ఆదిత్య. వాడు ఏంటో వాడి పొగరు ఏంటో పుట్టినరోజు చూశారు కదా ఈసారి గెలిచేది నేనే రాసి పెట్టుకో వేద అని మాళవిక అంటుంది.