Drushyam 2: ఓటీటీ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. దృశ్యం 2 వచ్చేసింది.. ఇందులో చూసేయండి!
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం 2 సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది.
తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘దృశ్యం 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మీ ఇంట్లోనే కూర్చుని అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాని చూసేయవచ్చు. విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.
మలయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2కి అధికారిక రీమేక్‌గా ఈ సినిమా రూపొందించారు. ఒరిజినల్ వెర్షన్‌కి కూడా జీతూ జోసెఫే దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఈ ఒరిజినల్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
2014లో వచ్చిన దృశ్యం సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. దృశ్యం కథ జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత నుంచి దృశ్యం 2 కథ జరగనుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం 50 రోజుల్లోనే ముగిసిపోయింది. మలయాళంలో విడుదలైన దృశ్యం 2 సూపర్ హిట్ కావడంతో దీన్ని తెలుగులోకి కూడా తీసుకువచ్చారు.
వెంకటేష్, మీనాలతో పాటు కృతిక, ఎస్తేర్ అనిల్, నరేష్, నదియా, సంపత్ రాజ్, వినయ్ వర్మ కూడా ఇందులో నటించారు. సురేష్ బాబు, ఆంటోని పెరంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతిలు ఈ సినిమాను నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
గతంలో ఈ సినిమా థియేటర్లకు వస్తుందా, ఓటీటీకి వెళ్తుందా అనే సందిగ్ధం నెలకొంది. థియేటర్ల పరిస్థితి సర్దుకోవడంతో ఈ సినిమాను నేరుగా థియేటర్లో విడుదల చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. నిర్మాతలు ఓటీటీకే ఫిక్స్ అయ్యారు. ఈ సంవత్సరం వెంకటేష్ నటించిన నారప్ప కూడా అమెజాన్ ప్రైమ్‌లోనే విడుదల అయింది. ఇప్పుడు దృశ్యం 2 కూడా ఓటీటీలోకే వెళ్తుంది. అయితే వచ్చే సంవత్సరం విడుదల కానున్న ఎఫ్3 మాత్రం థియేటర్లలోనే అని వెంకటేష్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయిందా..?'
Also Read: స్కైలాబ్ పోస్టర్‌తో ఫోటో దిగి పంపిస్తే... బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తానంటున్న నిత్యా మీనన్
Also Read: Ind vs Nz, 1st Test: అరెరె..! కోహ్లీని పలకరించిన ఈ కొత్త గెస్ట్ ఎవరో తెలుసా!!
Also Read: IPL 2022: ఐపీఎల్ 2022 మొదలయ్యేది ఆరోజే? మొదటి మ్యాచ్ ఎక్కడ.. ఎవరికి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి