'Aarya 2' Trailer: చెప్పేవాళ్లు ఏమైనా చెబుతారు..నేను జస్ట్ వర్కింగ్ మదర్ అంటున్న సుస్మితా సేన్
రామ్ మాధ్వాని దర్శకత్వంలో 'ఆర్య 2' రెండవ సీజన్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో సుస్మితాసేన్ నటనకి ఫిదా కానివారు ఉండరేమో..
తండ్రి ఆజ్ఞపై తన భర్త (చంద్రచూర్ సింగ్) హత్యకు గురైన తర్వాత ఆర్య (సుస్మిత) తన పిల్లలతో దేశం విడిచి వెళ్లాలని ప్లాన్ చేయడంతో మొదటి సీజన్ ముగిసింది. కొన్ని అక్రమ వ్యాపారాల్లో చిక్కుకున్న తర్వాత, ఆర్య ఇప్పుడు ఆకతాయిల రాడార్‌లో ఉంటుంది. తాజాగా విడుదలైన 'ఆర్య 2 ' ట్రైలర్లో సుస్మిత నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
This season,her weakness is her greatest strength. Sherni aarahi hai #AaryaIsBack #HotstarSpecials #AaryaSeason2 all episodes streaming from 10th Dec only on @DisneyPlusHS
— sushmita sen (@thesushmitasen) November 25, 2021
@officialRMFilms @EndemolShineIND @RamKMadhvani @amita_madhvani #VinodRawat #KapilSharma @RheaPrabhu ❤️ pic.twitter.com/7X9U8O1wyq
నిజానికి ఆర్య దేశం విడిచి వెళ్లిపోయిందని, అయితే ఇప్పుడు తిరిగి వచ్చి మళ్లీ తన పంజాకు పదును పెడుతుందని ట్రైలర్లో తెలుస్తోంది. షెకావత్ (మనీష్ చౌదరి) తండ్రి ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, సొంత సోదరుడితో పాటూ రష్యా టీమ్ కూడా తమ డబ్బు కోసం ఆమెపై ఒత్తిడి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆర్య మరోసారి హింసను ఆశ్రయించినట్టు ట్రైలర్‌లో స్పష్టమవుతోంది. వికాస్ కుమార్ ఏసీపీ ఖాన్‌గా కనిపిస్తున్నాడు. మీరు డాన్ అయ్యారని విన్నాను అనే మాటకి... చెప్పేవాళ్లు ఏదైనా చెబుతారు నేను జస్ట్ వర్కింగ్ మదర్ మాత్రమే అని సుష్మిత చెప్పే డైలాగ్ అదుర్స్ అనిపించింది.
మొదటి సీజన్ కి ప్రేక్షకుల నుంచి వచ్చిన రియాక్షన్ చూసి సెకెండ్ సీజన్ తీయాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు నిర్వాహకులు. ఫస్ట్ సీజన్లో తమకు లభించిన ఆదరణ సెకెండ్ సీజన్లోనూ తప్పకుండా దక్కుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ సీజన్లో ఆర్య తన కుటుంబానికి ఎలాంటి హానీ జరగకుండా ఉంచడంతో పాటూ ప్రతీకారం తీర్చుకోవడాన్ని చూపించామన్నారు. రామ్ మాధ్వాని దర్శకత్వం వహించిన 'ఆర్య' ఉత్తమ డ్రామా సిరీస్ విభాగంలో అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ 2021కి నామినేట్ అయింది. ఈ అవార్డును ఇజ్రాయెల్ సిరీస్ టెహ్రాన్ గెలుచుకుంది. ఈ సీరీస్ లో సుస్మితా సేన్‌తో పాటు, సికిందర్ ఖేర్, చంద్రచూర్ సింగ్, నమిత్ దాస్, జయంత్ కృప్లానీ మరియు మనీష్ చౌదరి తదితరులు నటించారు. 'ఆర్య 2' డిసెంబర్ 10న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
Also Read: షన్ముఖ్‌పై సిరి తల్లి షాకింగ్ కామెంట్స్.. అలా చేయడం నచ్చలేదంటూ క్లాస్
Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
Also Read:'నగలు తిరిగిచ్చేయ్'.. ఆ లెటర్ నిజంగానే ఉదయ్ కిరణ్ రాశాడా..?
Also Read: కాష్మోరా ప్రయోగిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. 'తులసీ దళం' కి మించి 'తులసి తీర్థం'.
Also Read: శివ శంకర్ మాస్టర్‌కు సోనూసూద్ భరోసా.. నేను సాయం చేస్తా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి