అన్వేషించండి

Diwali 2022 Movies: ఒకే రోజు 4 సినిమాలు రిలీజ్, అంచనాలూ ఎక్కువే - దీపావళి విన్నర్ ఎవరో!

దీపావళి నేపథ్యంలో ఒకే రోజు (అక్టోబరు 21న) నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. మరి, వీటిలో ఈ చిత్రానికి విజయం దక్కనుందో చూడాలి.

ఏడాది దీపావళి పండుగ సందర్భంగా తెలుగు సినిమాల సందడి మొదలైంది. తెలుగు బాక్స్ ఆఫీసు వద్ద సినీ పటాసులు పేల్చేందుకు ఓకేసారి నాలుగు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి దీపావళికి భారీ బడ్జెట్ సినిమాలు లేకపోవడంతో మిడ్ బడ్జెట్ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు  ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీపావళి రేసులో ఉన్న ఆ నాలుగు తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. ఓరి దేవుడా:
ఈ సినిమాను తమిళ్  2020 లో వచ్చిన 'ఓ మై కడవులే' సినిమాకు రీమేక్ వెర్షన్.  అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్, హీరోయిన్స్ గా మిథిలా పాల్కర్, ఆశా భట్ నటించారు. ఫాంటసీ, లవ్, కామెడీ జోనర్ లో రాబోతోన్న ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కావడంతో సినిమాపై ఇంకా హీట్ పెరిగింది. అంతేకాకుండా తమిళ్ సూపర్ హిట్ సినిమా రీమేక్, అందులోనూ వెంకటేష్ లాంటి  పెద్ద హీరోలతో మల్టీ స్టారర్ కావడంతో సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

2. ప్రిన్స్:
జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా ఈ ప్రిన్స్. తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా ఉక్రెయిన్ నటి మరియా హీరోయిన్ గా నటించారు. లవ్, కామెడీ జోనర్ లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు అనుదీప్ కెవి. సినిమా ట్రైలర్ లో కూడా అనుదీప్ పంచ్ డైలాగ్స్, శివకార్తికేయన్ కామెడీ టైమింగ్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. శివకార్తికేయన్ నటించిన రెమో, డాక్టర్ లాంటి సినిమాలు తెలుగులో మంచి ఆదరణ పొందాయి. అదే నమ్మకంతో సినిమాను ఒకేసారి తెలుగు తమిళ్ వెర్షన్ లలో విడుదల చేస్తున్నారు మూవీ టీమ్.

3.జిన్నా:
ఈ సినిమాతో ఈషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సినిమాలో హీరోగా మంచు విష్ణు హీరోయిన్లుగా సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటించారు. హరర్, కామెడీ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాతో మంచు విష్ణు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. మరి ఈ దీపావళికైనా మంచు విష్ణు సినీ జీవితంలో వెలుగులు పూస్తాయో లేదో చూడాలి. ట్రైలర్ బాగుండటం, సన్నీ లియోన్ లాంటి తారలు సినిమాలో ఫుల్ లెన్త్ రోల్  చేయడంతో సినిమాపై అంచనాలు బానే ఉన్నాయి.

4. సర్దార్:
తమిళ్ హీరో కార్తీకి తెలుగులో మంచి డిమాండ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు కొన్ని ఇక్కడ బ్లాక్ బస్టర్ కూడా అయ్యాయి. అందుకే సర్దార్ ను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. కె పి.ఎస్.మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్పై, త్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీఖన్నా, రాజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. గతంలో దీపావళి సమయంలోనే ఖైదీ సినిమా విడుదలై తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంది. అందుకే ఈ ఏడాది కూడా అదే నమ్మకంతో దీపావళికి సర్దార్ ను తెలుగులో రిలీజ్ చేస్తోంది మూవీ టీమ్.

రకాల జోనర్ లతో వస్తోన్న ఈ నాలుగు సినిమాల్లో ఈసారి దీపావళికి తెలుగు బాక్స్ ఆఫీసు వద్ద ఏ మూవీ సత్తా చాటుతుందో చూడాలి మరి.

Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget