అన్వేషించండి

Dil Raju OTT: ఓటీటీలోకి దిల్‌రాజు, అసలు విషయం చెప్పేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

నిర్మాత దిల్ రాజు ఓటీటీ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ క్లారిటీ ఇచ్చింది.

కరోనా అనంతరం ఓటీటీల ప్రభావం బాగా పెరిగింది. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ తో దూసుకుపోతున్నాయి. చాలా సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యే పరిస్థితి వచ్చింది. ఓటీటీలో విడుదలైన సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు ఓటీటీ రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ రంగంలోకి అడుగు పెట్టారు. ‘ఆహా’ పేరుతో ఓటీటీ సంస్థను మొదలు పెట్టారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న సినిమాలతో పాటు పలు టాక్ షోలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. తెలుగు నాట ‘ఆహా’ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  ఈ నేపథ్యంలోనే ఓటీటీ రంగంలోకి మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చిన్న సినిమాల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపించింది.

ఓటీటీ వార్తలను ఖండించిన దిల్ రాజు నిర్మాణ సంస్థ

తాజాగా దిల్ రాజు ఓటీటీ గురించి వస్తున్న వార్తలపై ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ స్పందించింది. ఈ వార్తలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పింది. నిర్థారణ కాకుండా వార్తలను ప్రసారం చేయకూడదని వెల్లడించింది. “మా నిర్మాత దిల్ రాజు OTT ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలు అన్నీ అవాస్తవాలు. దయచేసి ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని మేము ప్రతి ఒక్కరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము” అని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.   

రీసెంట్​గా రూ.5 కోట్లలోగా బడ్జెట్‌తో దాదాపు 25 చిన్న సినిమాలను నిర్మించాని దిల్ రాజు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలు అన్నింటినీ తన సొంత ఓటీటీ వేదికగా విడుదల చేయాలని యోచిస్తున్నట్టు టాక్‌ వినిపించింది. అంతేకాదు, దిల్ రాజు ఓటీటీ సంస్థ 2024లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. తను నిర్మించే సినిమాలతో పాటు, డిస్ట్రిబ్యూట్‌ చేసే మూవీస్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయని ప్రచారం జరిగింది. తాజాగా వివరణతో ఆ వార్తలన్నీ అబద్దం అని తేలిపోయింది.

డిస్ట్రిబ్యూటర్‌గా సినీ కెరీర్‌ను మొదలు పెట్టిన దిల్ రాజు

ప్రస్తుతం దిల్ రాజు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. తొలుత ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా సినీ కెరీర్‌ను మొదలు పెట్టారు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ నెంబర్ వన్ నిర్మాతగా మారారు.  శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో హిట్ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం పలు సినిమాలు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాలకు కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రసుతం ఆయన బ్యానర్‌ లో రామ్‌ చరణ్‌ హీరోగా ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా తెరకెక్కుతున్నది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ  చెర్రీ సరసన మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది.

Read Also: సోషల్ మీడియోలో రష్మిక వీడియో వైరల్, అమితాబ్ బచ్చన్ ఆగ్రహం, కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
Embed widget