Dil Raju: ‘తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా’ - మీడియాకు దిల్ రాజు వార్నింగ్!
Dil Raju Speech: ప్రముఖ నిర్మాత దిల్ రాజు తనపై వస్తున్న వివాదాల గురించి మాట్లాడారు. మీడియాకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
Hanuman Controversy: 2024 సంక్రాంతి రేసు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సిటీలో ‘హనుమాన్’కు తక్కువ థియేటర్లు రావడంతో అందరి వేళ్లూ దిల్ రాజు వైపు మళ్లాయి. దీనికి తోడు ‘హనుమాన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కూడా చిరంజీవి థియేటర్ల గురించి మాట్లాడారు. ఇది కూడా దిల్ రాజును ఉద్దేశించే అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై దిల్ రాజు నేరుగా స్పందించారు. మీడియాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఆయన ఒక సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎన్నో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా వచ్చినప్పుడల్లా డైరెక్ట్‌గానో, లేకపోతే ఇన్‌డైరెక్ట్‌గానో నా మీద కాంట్రవర్సీలు చేస్తూనే ఉన్నారు. రాళ్లు విసురుతూనే ఉన్నారు. అది మీకు తెలియనిది కాదు. ఏడెనిమిది సంవత్సరాలుగా ఇది నడుస్తూనే ఉంది. నేను కష్టపడి ఎదిగి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. నిన్న చిరంజీవి మాట్లాడుతూ ఎంత బాగా చెప్పారు. దిల్ రాజుకు ఎప్పుడు ఎలా ఏం చేయాలో బాగా చెప్పారు. అతను చాలా అనుభవం గల వ్యక్తి అన్నారు.’
‘కానీ ఈరోజు కొన్ని వెబ్ సైట్లలో చిరంజీవి మాట్లాడిన దాన్ని ఇంకో లాగా టర్న్ చేసి రాశారు. అవి రెండూ ప్రముఖ వెబ్ సైట్లే. మీ వెబ్ సైట్ ఇంపార్టెన్స్‌ను పెంచుకోవడానికి నాపైన ఎందుకు ఏదేదో రాస్తున్నారు? మీకిది అవసరమా? దిల్ రాజు ఏమీ రియాక్టవ్వడు. సాఫ్ట్‌గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాట తీస్తా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నా. ఎందుకిలా... సాఫ్ట్‌గా వెళ్దాం అని. ఆ నిర్మాత వచ్చి మీతో మాట్లాడాడా? మీకు దమ్ముంటే ఆ నిర్మాతని, నన్ను ఈ స్టేజ్ పైన కూర్చోబెట్టి ప్రశ్నలు వేయించండి. ప్రతి సంక్రాంతికి నన్నే ఎందుకు టార్గెట్ చేయాలి? ఇంత మంది నన్ను అభిమానిస్తున్నారు. 95 శాతం మంది నన్ను అభిమానిస్తున్నారు. మిగతా ఐదు శాతం గురించి నాకు తెలీదు. అది వాళ్ల ఇష్టం. ఒక మనిషిగా నేను అందరినీ శాటిస్‌ఫై చేయలేను. శాటిస్‌ఫై చేస్తున్నాను కాబట్టే ఈరోజు నాకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది.’
‘దిల్ రాజు అంటే ఒక బ్రాండ్. బిల్డ్ చేశా. వ్యాపార పరంగా వచ్చే కొన్ని వివాదాలను మీరు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. మీ వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ కోసం వాడుకుంటున్నారు. అది 100 శాతం తప్పు. మొన్నటి సంక్రాంతి రిలీజుల గురించి ఛాంబర్‌లో మీటింగ్ పెట్టి, ఛాంబర్‌లో డీల్ చేసి, రవితేజని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపాం. అది ఎంత కష్టమో మాకు తెలుసు. తర్వాత మిగిలినవి నాలుగు సినిమాలు. దిల్ రాజు ఏదో తమిళ సినిమా (అయలాన్) రిలీజ్ చేస్తున్నారు అని ఎవడో రాశాడు. నేను రిలీజ్ చేస్తున్నా అని నీకు ఎవడు చెప్పాడ్రా. నేను చేస్తున్నా అని నీ దగ్గర ప్రూఫ్ ఉందా?. తెలుగులో రిలీజ్ వద్దు అని ఆ తమిళ సినిమాని కూడా పోస్ట్ పోన్ చేయించింది నేను.’ అని క్లారిటీ ఇచ్చారు.
Also Read : చిరుత వేట అలాగే ఉంటుంది - 'OG' ఎప్పటికీ మాదే, ఆ వీడియోతో పుకార్లకు చెక్ పెట్టిన మేకర్స్!