అన్వేషించండి

Jamal Kudu Song: బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?

Jamal Kudu Song in Animal: ‘యానిమ‌ల్’ మూవీలోని ‘జమల్’ సాంగ్ దేశ వ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయ్యింది. ఇప్పటికే 28 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇంతకీ ఈ పాట ఎక్కడ పుట్టిందో తెలుసా?

Bobby Deol Jamal Kudu Song: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్ నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నేషన్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ రణబీర్ తండ్రిగా కనిపించగా, మరో దిగ్గజ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా వసూళ్లు వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 500 కోట్ల మార్కును దాటింది. రణబీర్‌ నటన, సందీప్ రెడ్డి టేకింగ్ చూసి సినీ లవర్స్ ఆశ్చర్యపోయారు.  

సంగీత ప్రియులను అలరించిన ‘జ‌మ‌ల్ కుడు’ సాంగ్

ఈ చిత్రంలో బాబీ పాత్ర చిన్నదే అయినా, ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సుమారుగా 3 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయనకు ఈ సినిమాతో కనీవినీ ఎరుగని గుర్తింపు లభించింది. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన క్రేజ్ ఒక లెక్క అయితే, ఈ సినిమాలోని పాత్రకు దక్కిన ప్రశంసలు మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు. అబ్రార్ పాత్రలో అద్భుత నటనతో ఆకట్టుకున్నారు బాబీ. ఆయన ఎంట్రీ సమయంలో వచ్చే పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ‘జ‌మ‌ల్ కుడు’ అంటూ సాగే ఈ పాట ఆడియెన్స్ ను ఓ రేంజిలో అలరిస్తుంది.

‘జ‌మ‌ల్ కుడు’ సాంగ్ ఏ దేశంలో పుట్టిందో తెలుసా?

ఇక రీసెంట్ గా ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే 28 మిలియన్లకు పైగా వ్యూస్ తో మార్మోగిపోతోంది. యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్స్ లో టాప్ లో నిలిచింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ పాట నిజానికి ఇండియాకు చెందినది కాదు. ఇదో ఇరానియన్ సాంగ్.  ప్రముఖ ఇరానియ‌న్ క‌వి బిజాన్ స‌మాంద‌ర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ పాట ఇరాన్ లో జరిగే పెళ్లి వేడుకలలో పెట్టడం విశేషం.

పెళ్లిళ్లలోనే కాదు, ఇతర వేడుకలలోనూ ఈ పాటను ప్లే చేస్తుంటారు. ఈ పాటను 1977లో అనౌశిర్వాన్ రోహాని అనే సంగీత దర్శకుడు రీమిక్స్ చేశాడు. లేటెస్టుగా ‘యానిమల్’ మూవీలో దర్శకడు సందీప్ ఈ రీమిక్స్ పాటనే వాడుకున్నాడు. ఈ మూవీ సంగీత దర్శకుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, మేఘ‌న నాయుడు, ఐశ్వ‌ర్య‌ దాస‌రి, అభిక్య‌, స‌బీహతో పాటు కొందరు చిన్నారులతో ఈ పాటను పాడించారు. జానపద, సంప్రదాయాల కలబోతగా ఉన్న ఈ పాట దేశ వ్యాప్తంగా సంగీత ప్రియులను అలరిస్తోంది.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Singing Platform🎙️🎻 (@singing_platform_)

ఇక ఈ పాట మీద సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అద్భుతం అంటూ కామెంట్లు పెడుతున్నారు. “నేను గతంలో వెళ్లిన చాలా ఇరానియన్ పెళ్లిళ్లలో ఈ పాటను పెట్టారు. నా చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వస్తున్నాయి” అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. భారత్ లాంటి సాంస్కృతిక వైభవం కలిగిన దేశంలో ఈ పాట హిట్ కావడం సంతోషంగా ఉందని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ పాట బాబి డియోల్ కు అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిందని ఇంకొకరు వెల్లడించారు.

Read Also: బాబాయ్ హోటల్‌లో వెంకీ మామ సందడి - శ్రద్ధా శ్రీనాథ్‌తో కలిసి ఇంద్రకీలాద్రిపై వెంకటేష్ ప్రత్యేక పూజలు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి

వీడియోలు

Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
The Raja Saab Reaction : ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Embed widget