By: ABP Desam | Updated at : 22 Mar 2023 05:17 PM (IST)
దసరా నుంచి ధూమ్ ధామ్ దోస్తాన్ వీడియో సాంగ్ వచ్చేసింది.
నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'దసరా'. ఈ సినిమా మార్చి 30వ తేదీన ఐదు భాషల్లో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. హీరో నాని దేశవ్యాప్తంగా అనేక నగరాలు తిరుగుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇటీవలే విడుదల అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇప్పుడు తాజాగా సినిమాలోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ముంబైలో జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్‌లతో పాటు మరో నటుడు దీక్షిత్ శెట్టి పాల్గొన్నారు. రానా కూడా ఈ ఈవెంట్‌లో భాగం కావడం విశేషం. నాని, రానాలకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇందులో నేచురల్ స్టార్ నాని తన మాస్ డాన్స్ స్టెప్స్ తో అదరగొట్టారు.
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలైంది. ఊర మాస్ లుక్ లో నాని సరికొత్తగా కనిపించాడు. గతంలో ఎప్పడూ చూడని నానిని ఈ ట్రైలర్ లో చూపించారు. కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది. అదిరిపోయే ఫైట్లు, పవర్ ఫుల్ డైలాగులు ‘దసరా’ సినిమాలో నాని ధరణిగా నటిస్తున్నాడు. హీరో, హీరోయిన్లు పూర్తి స్థాయిలో డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా హింసతో చెలరేగిపోయాడు నాని. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
ట్రైలర్ ‘చిత్తు చిత్తుల గుమ్మ’ అంటూ బతుకమ్మ పాట ప్రారంభం అయ్యింది. హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి కూతురు గెటప్ లో కనిపించింది. “నా లాంటి అమ్మాయి దొరికిందంటే ధరణిగా పెట్టి పుట్టావురా నాకొడకా” అంటూ కీర్తి సురేష్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటున్నది. “ఒక్కొక్కనికి మొల్తాడు కింద గుడాల్ రాల్తయ్ బ్యాంచెత్” అంటూ నాని చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. కీర్తి సురేష్ నటన, నాని ఫైట్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ప్రముఖ పాటల రచయత కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, గొట్టే కనకవ్వ, గొన్నారా దస లక్ష్మి, పాలమూరు జంగిరెడ్డి, నరసన్న, కాసర్ల శ్యామ్ కలిసి ఆలపించారు. ఈ సినిమాలో మాసిన గడ్డంతో మాస్ లుక్ లో నాని కనిపిస్తున్నారు. నాని సరసన కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే నాని, కీర్తి ఇద్దరూ కలిసి ‘నేను లోకల్‘ సినిమాలో నటించారు. కొత్త దర్శకుడు అయినా ఈ సినిమాపై నాని ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తెలంగాణలోని గోదావరిఖని సమీపంలో ఉన్న సింగరేణి ప్రాంతానికి చెందిన ‘ఈర్లపల్లి’ అనే ఫిక్షనల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తీస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్, షైన్ టామ్ చాకో లాంటి ప్రముఖ తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు