అన్వేషించండి
Advertisement
Sir Movie Teaser: ధనుష్ 'సార్' క్లాసులు మొదలెట్టేశాడు - టీజర్ చూశారా?
రోజు ధనుష్ పుట్టినరోజు కావడంతో 'సార్' మూవీ టీజర్ ను విడుదల చేశారు.
Sir Movie Teaser: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) తెలుగులో స్ట్రెయిట్ సినిమాలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ధనుష్. దీనికి 'సార్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని వదిలారు. ఈరోజు ధనుష్ పుట్టినరోజు కావడంతో టీజర్ ను విడుదల చేశారు.
సింపుల్ గా ఇంటెన్స్ గా టీజర్ ని కట్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చేసిన కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులతో హీరో చేసే పోరాటమే ఈ సినిమా. కథ ప్రకారం.. ధనుష్ 'బాల గంగాధర్ తిలక్' అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపించారు. అతడి లుక్ కూడా చాలా నేచురల్ గా ఉంది. టీజర్ లో కొన్ని డైలాగ్స్ కూడా బాగానే పేలాయి.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్(Samyuktha Menon) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ధనుష్ నటిస్తోన్న తొలి తెలుగు సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ధనుష్ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు స్ట్రెయిట్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తుండడంతో.. మంచి బజ్ క్రియేట్ అయింది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion