News
News
X

Dhanush Sir Release Date : విడుదల తేదీ మారింది సార్ - డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి

ధనుష్ హీరోగా రూపొందుతోన్న 'సార్' సినిమా విడుదల వాయిదా పడింది. ఈ ఏడాది రావాల్సిన సినిమా వచ్చే ఏడాదికి వెళ్ళింది.

FOLLOW US: 
 
ధనుష్ (Dhanush) హీరోగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ , త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'సార్' (SIR Movie). తమిళంలో 'వాతి' (Vaathi Movie)గా విడుదల చేస్తున్నారు. ధనుష్‌కు తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రమిది. తొలుత ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడం లేదు. వచ్చే ఏడాదికి వాయిదా పడింది. 

డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి...
వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న 'సార్' సినిమాను విడుదల చేయనున్నట్లు గురువారం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. విద్యా వ్యవస్థ తీరు తెన్నులు మీద సాగే కథతో సినిమా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. 'సార్' ప్రచార చిత్రాలు చూస్తే... ఎడ్యుకేషనల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అనేది తెలుస్తోంది. ఇందులో ఆయన టైటిల్ రోల్ చేశారు. 

తొలి పాటకు స్పందన బావుంది!
ఇటీవల 'సార్' సినిమాలో తొలి పాటను విడుదల చేశారు. 'మాస్టారు మాస్టారు... నా మనసును గెలిచారు! అచ్చం నే కలగన్నట్టే... నా పక్కన నిలిచారు' అంటూ సాగే ఈ గీతానికి తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా... తమిళంలో తమిళంలో ధనుష్ రాశారు. జీవీ ప్రకాష్ బాణీ అందించగా... శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు వస్తున్న స్పందన తమకు సంతోషాన్ని ఇస్తోందని చిత్ర బృందం పేర్కొంది. 

Also Read : 'మసూద' రివ్యూ : భయపెట్టడం కోసమే తీసిన సినిమా - భయపెట్టిందా? లేదా?

News Reels

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్. 'భీమ్లా నాయక్', నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రమిది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. వరుణ్ తేజ్ 'తొలిప్రేమ', అఖిల్ అక్కినేని 'మిస్టర్ మజ్ను', నితిన్ 'రంగ్ దే' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

Also Read : గాలోడు రివ్యూ: సుడిగాలి సుధీర్ పెద్ద స్క్రీన్‌పై కూడా హిట్ కొట్టాడా?

'సూదు కవ్వం', 'సేతుపతి', 'తెగిడి', 'మిస్టర్ లోకల్', 'మార' తదితర చిత్రాలకు పనిచేసి దినేష్ కృష్ణన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కాగా... నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జీవీ ప్ర‌కాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి కుమార్,తనికెళ్ల భ‌ర‌ణి, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌), ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా, స‌మ‌ర్ప‌ణ: పి.డి.వి. ప్ర‌సాద్‌.

నాలుగు సినిమాలతో 2022లో ధనుష్ సందడి!
ధనుష్ హీరోగా నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటిది 'మారన్' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కాగా... 'తిరు', 'నేనే వస్తున్నా' సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్'లో కూడా ధనుష్ కనిపించారు. ధనుష్‌కు 'సార్' ఈ ఏడాది ఐదో రిలీజ్ అవుతుంది.  

Published at : 18 Nov 2022 03:08 PM (IST) Tags: Dhanush Sir New Release Date Vaathi New Release Date Dhanush SIR Release Date Dhanush SIR On Feb 17th

సంబంధిత కథనాలు

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

Bandla Ganesh: తండ్రి మాట వినకపోతే బన్నీలా అవుతారు - అల్లు అర్జున్‌పై బండ్ల గణేష్ సెటైర్లు

Bandla Ganesh: తండ్రి మాట వినకపోతే బన్నీలా అవుతారు - అల్లు అర్జున్‌పై బండ్ల గణేష్ సెటైర్లు

టాప్ స్టోరీస్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?