News
News
X

Dhamaka: వినాయకచవితి స్పెషల్ - 'ధమాకా' రొమాంటిక్ గ్లింప్స్ చూశారా?

ఈరోజు వినాయకచవితి సందర్భంగా 'ధమాకా' సినిమాకి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను విడుదల చేశారు.   

FOLLOW US: 
Share:

మాస్ మహారాజ రవితేజ (Raviteja) కథానాయకుడిగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ధమాకా'(Dhamaka). 'డబుల్ ఇంపాక్ట్'... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఆ ట్యాగ్ లైన్ వెనుక కారణం అదే. అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు.

Dhamaka Romantic glimpse: ఈరోజు వినాయకచవితి సందర్భంగా సినిమాకి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇందులో హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్ ను చూపించారు. కళ్లతో సైగలు చేస్తూ హీరోయిన్ ను పక్కకు పిలుస్తుంటారు రవితేజ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ వీడియోను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే రవితేజ, శ్రీలీల కాంబినేషన్ అనేది చూడడానికి కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఈ గ్లింప్స్ లో అయితే ఇద్దరి మధ్య రొమాన్స్ పెద్దగా పండలేదనే చెప్పాలి.  

'పెళ్లి సందడి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా..కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. 

సినిమా స్టోరీ:

అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో రవితేజ రెండు డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నారు. హీరో క్యారెక్టర్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడి ఉంటుందని.. ఈ క్యారెక్టర్ చుట్టూనే సినిమా కథ తిరుగుతుందని తెలుస్తోంది.

ఓ కంపెనీకి సీఈవోగా కనిపించే రవితేజ.. మరోవైపు ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా కూడా కనిపిస్తాడట. అయితే కంపెనీ సీఈవో అనుకొని పొరపాటున మిడిల్ క్లాస్ వ్యక్తిని రౌడీలు కిడ్నాప్ చేయడం అనేదే ఈ సినిమాలో అసలు ట్విస్ట్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కథలో కామెడీతో పాటు.. యాక్షన్ సీన్స్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. 

రవితేజ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్:

ఈ సినిమాతో పాటు 'రావణాసుర', 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' సినిమాల్లో నటిస్తున్నారు రవితేజ. 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక 'రావణాసుర' సినిమాను యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ గా రూపొందిస్తున్నారు. ఇందులో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. 

Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు

Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ

Published at : 31 Aug 2022 05:13 PM (IST) Tags: raviteja sreeleela Dhamaka Movie Dhamaka Dhamaka romantic glimpse

సంబంధిత కథనాలు

Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!

Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!

Akshay Kumar: మూవీ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

Akshay Kumar: మూవీ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!

New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!

Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి

Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి

Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం

Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల