Dhamaka Box Office : తెలుగు రాష్ట్రాల్లో 'అవతార్ 2'కు పైన - ఆల్ ఇండియాలో 'సర్కార్' తర్వాత రవితేజ 'ధమాకా'
తెలుగులో రవితేజ 'ధమాకా' అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 'అవతార్ 2' కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. హిందీలో 'సర్కస్' తర్వాత స్థానంలో నిలిచింది. 'ధమాకా' ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ చూస్తే...
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'ధమాకా' (Dhamaka Movie). బాక్సాఫీస్ పరంగా ఈ సినిమా అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 'అవతార్ 2' కంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్ట్ చేసింది. ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తే... మూడో స్థానంలో ఉంది.
డిసెంబర్ 23 నుంచి 29 మధ్యలో...
'ధమాకా' సినిమా డిసెంబర్ 23న విడుదలైంది. దానికి వారం ముందు 16న జేమ్స్ కామెరూన్ తీసిన దృశ్య కావ్యం 'అవతార్ 2' విడుదలైంది. తొలి వారంలో తెలుగు ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అందువల్ల, రెండో వారంలో ఆ ధాటిని తట్టుకుని మరో సినిమా కలెక్ట్ చేయడం కష్టమని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, 'అవతార్ 2' కంటే రవితేజ 'ధమాకా' ఎక్కువ కలెక్ట్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో 'అవతార్ 2' రెండో వారం కలెక్షన్స్ కంటే ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా రవితేజ 'ధమాకా' నిలిచింది. ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తే... 'ధమాకా'ది మూడో స్థానం. తొలి స్థానంలో 'అవతార్ 2', రెండో స్థానంలో రణ్‌వీర్ సింగ్, పూజా హెగ్డే జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన 'సర్కస్' రెండో స్థానంలో ఉంది. హిందీలో మినిమమ్ పబ్లిసిటీతో రవితేజ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.
View this post on Instagram
'ధమాకా' @ 69 క్రోర్స్!
రవితేజ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్, బెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ సాధించిన సినిమా 'ధమాకా'. ఏడు రోజుల్లో ఈ సినిమా 62 కోట్లు కలెక్ట్ చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. సెకండ్ వీక్ ఫస్ట్ డే... రెండో శుక్రవారం కూడా ఏడు కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలియజేసింది.
Also Read : లిప్ కిస్సుతో గుడ్ న్యూస్ చెప్పిన నరేష్, పవిత్రా లోకేష్ - త్వరలో పెళ్లి
View this post on Instagram
'ధమాకా'కు ముందు ఈ ఏడాది రవితేజ నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఆ రెండూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. బాక్సాఫీస్ బరిలో డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో ఈ ఏడాది రవితేజకు విజయం వస్తుందా? లేదా? 'ధమాకా' వసూళ్ళు రవితేజ పరీక్ష పెడతాయి? వంటి మాటలు విడుదలకు ముందు వినిపించాయి. ఆ అనుమానాలు అన్నిటినీ మాస్ మహారాజా పటాపంచలు చేశారు.
త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన 'ధమాకా'కు బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించారు. ఈ సినిమాకు 'డబుల్ ఇంపాక్ట్'... అనేది ఉపశీర్షిక. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతానికి కూడా మంచి పేరు వచ్చింది.
Also Read : 'కోరమీను' రివ్యూ : మీసాలు తీయడమే కాదు, అంతకు మించి ట్విస్టులు ఉన్నాయ్ - ఆనంద్ రవి సినిమా ఎలా ఉందంటే?
'ధమాకా' విజయంతో 2022కి వీడ్కోలు పలుకుతున్న రవితేజ... సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన ఆ సినిమాలో నటించారు. అది కాకుండా ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమా చేస్తున్నారు రవితేజ. అది కాకుండా 'ధమాకా' సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు 'ఈగల్' టైటిల్ ఖరారు చేసినట్లు టాక్. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఉంది. అది పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.