By: ABP Desam | Updated at : 24 Dec 2022 01:36 PM (IST)
'ధమాకా' సినిమాలో రవితేజ, శ్రీలీల
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ధమాకా' (Dhamaka Movie). శుక్రవారం థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? పది కోట్లకు పైగా! అవును... మాస్ మహారాజ్ థియేట్రికల్ బాక్సాఫీస్ దగ్గర తన పవర్ చూపించారు.
ధమాకా @ 10 క్రోర్స్ ప్లస్!
'ధమాకా' సినిమా తొలి రోజు థియేటర్లలో పది కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. నిజం చెప్పాలంటే... 'ధమాకా'కు ముందు ఈ ఏడాది రవితేజ నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఆ రెండూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. బాక్సాఫీస్ బరిలో డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే... 'ధమాకా' మీద ముందు నుంచి పాజిటివ్ బజ్ నెలకొంది. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లోకి వెళ్ళాయి. మాస్ మహారాజ్ రవితేజ కూడా జోరుగా ప్రచారం చేశారు. దాంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు.
రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్!
ఈ ఏడాది రవితేజకు విజయం వస్తుందా? ఈ సినిమా వసూళ్ళు రవితేజ పరీక్ష పెడతాయి? వంటి మాటలు సినిమా విడుదలకు ముందు వినిపించాయి. అయితే, ఆ అనుమానాలు అన్నిటినీ 'ధమాకా' పటాపంచలు చేసింది. రవితేజ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. వీకెండ్ కూడా వసూళ్లు బావుండే అవకాశం ఉంది. 'ధమాకా'తో 2022కి రవితేజ వీడ్కోలు పలికారు.
'ఇంద్ర' స్పూఫ్ సూపర్!
'ధమాకా' సినిమా విడుదలకు ముందు యూనిట్ సభ్యులు ఇదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ అని చెబుతూ వస్తున్నారు. రౌడీ అల్లుడు తరహాలో ఉంటుందనే మాటలు కూడా వినిపించాయి. థియేటర్ల నుంచి వచ్చిన ప్రేక్షకులు కూడా కామెడీ గురించి మాట్లాడారు. 'ఇంద్ర' స్పూఫ్ థియేటర్లలో సూపర్ ఉందని కామెంట్లు వినబడుతున్నాయి. దాంతో సినిమా పాస్ అయిపొయింది. కామెడీకి తోడు రవితేజతో హీరోయిన్ శ్రీలీల వేసిన స్టెప్పులు ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేస్తున్నాయి. ఎంటర్‌టైన్ చేశాయి.
Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?
త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన 'ధమాకా'కు బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించారు. ఈ సినిమాకు 'డబుల్ ఇంపాక్ట్'... అనేది ఉపశీర్షిక. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతానికి కూడా మంచి పేరు వచ్చింది.
మళ్ళీ మూడు సినిమాలతో... 2023లో!
ఈ ఏడాది రవితేజ నుంచి మూడు సినిమాలు వచ్చాయి. వచ్చే ఏడాది కూడా ఆయన నుంచి మూడు సినిమాలు రావడం ఖాయంగా కనబడుతోంది. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమా చేస్తున్నారు రవితేజ. అది కాకుండా 'ధమాకా' సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఉంది. అది పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.
Also Read : బాలకృష్ణ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ - ముగ్గురు హీరోయిన్లు ఏం చెప్పారంటే?
Shakuntalam: అట్లుంటది గుణశేఖర్‌తో - 'శాకుంతలం' కోసం ఎన్ని కేజీల బంగారం వాడారో తెలుసా?
‘దసరా’కు ‘రావణాసుర’ సాయం - రవితేజను కలిసిన నాని, పెద్ద ప్లానే వేసినట్లున్నారుగా!
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Kangana Ranaut on Thalaivii: కంగనాకు ‘తలైవి’ రూపంలో కొత్త చిక్కులు, ఆరు కోట్లు ఇవ్వాలంటూ ఆ సంస్థ డిమాండ్?
Padipotunna Song : ప్రేమలో 'పడిపోతున్న' అబ్బాయ్ - 'గేమ్ ఆన్'లో కొత్త సాంగ్
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?
Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు