అన్వేషించండి
Advertisement
Pushpa: 'శ్రీవల్లి' సాంగ్ ఇంగ్లీష్ వెర్షన్, అదిరిపోలా?
'శ్రీవల్లి' సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క పాటకే లక్షల్లో రీల్స్ చేశారు. ఇప్పుడు ఈ పాటకు ఇంగ్లీష్ వెర్షన్ వచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందించిన సినిమా 'పుష్ప'. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన 'పుష్ప' ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో పాటలను, డైలాగ్స్ ను రీల్స్ గా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.
ఈ సినిమాలో పాటలన్నీ లక్షల వ్యూస్ ను సాధించాయి. ముఖ్యంగా 'శ్రీవల్లి' సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క పాటకే లక్షల్లో రీల్స్ చేశారు. ఇప్పుడు ఈ పాటకు ఇంగ్లీష్ వెర్షన్ వచ్చింది. ఎమ్మా హీస్టర్స్ అనే పాప్ సింగర్ 'శ్రీవల్లి' ఇంగ్లీష్ వెర్షన్ పాడి యూట్యూబ్ లో షేర్ చేసింది. దీన్ని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
శ్రీవల్లి సాంగ్ పాడిన సిద్ శ్రీరామ్ ను ట్యాగ్ చేస్తూ.. 'ఈ పాట రికార్డ్ చేసినప్పుడు సరదాగా ఇంగ్లీష్ వెర్షన్ కూడా రికార్డ్ చేద్దామని అడిగాను.. ఇప్పుడు ఎమ్మా హీస్టర్స్ ఇంగ్లీష్ వెర్షన్ కవర్ సాంగ్ చేశారు. మనం కూడా మన వెర్షన్ చేయాలి' అంటూ దేవిశ్రీప్రసాద్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఎమ్మా పాడిన ఇంగ్లీష్ వెర్షన్ ఇప్పుడు మీరు కూడా వినండి!
Loved this🎶❤️🎶
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 5, 2022
Hey @sidsriram bro,I told U when we recorded,lets do an English version 4 Fun,but here’s a lovely cover by @emmaheesters 😎🎶😍
May be we shud do our version too🎤 @alluarjun @aryasukku @javedali4u @boselyricist @adityamusic @TSeries https://t.co/9K3qAD4o1H
View this post on Instagram
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.365 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒక్క బాలీవుడ్ లోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక నటించింది. అలానే సునీల్, అనసూయ, అజయ్ ఘోష్ లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు. ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై తెరకెక్కించిన ఈ సినిమా పార్ట్ 2 రాబోతుంది. కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
తెలంగాణ
నెల్లూరు
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion