Deepthi Sunaina: ‘ఫీలింగ్స్ ఒకేలా ఉంటాయనుకోవడం నా తప్పే’ - ఏడిపించేస్తున్న దీప్తి సునయనా, అందుకే నెంబర్ వన్!
‘‘ఏమై ఉంటుంది? అది ప్రేమ, స్నేహమా?’’ అంటూ సాగే ఈ పాట నెటిజనులను మెప్పిస్తోంది. చివర్లో దీప్తి సునయన భావోద్వేగ సన్నివేశాలను చూస్తే తప్పకుండా మనసు బరువెక్కుతుంది.
‘‘ఫీలింగ్స్ కదా, ఎవరికైనా మారుతుంటాయ్. ఒకేలా ఉంటాయనుకోవడం నా తప్పే’’ ఈ మాట మరెవ్వరిదో కాదు, మన ‘యూట్యూబ్’ క్వీన్ దీప్తి సునయనది. అయితే, ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన అభిప్రాయం కాదు. ఓ పాటలో ఓ సన్నివేశంలో వచ్చే డైలాగ్ ఇది. ప్రస్తుతం దీప్తి సునయన ఉన్న పరిస్థితులకు ఈ డైలాగ్ సింక్ అవుతుందని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. అందుకే కాబోలు.. ఇప్పుడు ఆ పాట యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండవ్వుతోంది.
ఇక పాట విషయానికి వస్తే.. వినయ్ షన్ముక్ దర్శకత్వంలో రూపొందించిన ‘ఏమై ఉండొచ్చో’ అనే ఆల్బమ్ సాంగ్ ఇటీవలే యూట్యూబ్‌లో విడుదలైంది. విజయ్ బాల్గానిన్ ఈ పాటకు సంగీత దర్శకత్వం మాత్రమే కాదు, గాత్రం కూడా తానే అందించాడు. ఇందులో దీప్తి సునయనకు జోడిగా సుగి విజయ్ నటించాడు. అతడి ప్రియురాలిగా దివ్య నటించింది.
ఈ పాటలో మంచి ఫీల్ మాత్రమే కాదు, మనోవేదన కూడా ఉంటుంది. గత కొన్నేళ్లుగా విజయ్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్న దీప్తీకి అతడిపై ఫీలింగ్స్ మారుతాయి. అతడిని స్నేహితుడి కంటే ఎక్కువగా, ప్రేమికుడిగా భావిస్తుంది. ఈ విషయాన్ని స్లామ్ బుక్‌లో రాస్తుంది. పుట్టిన రోజు సందర్భంగా అతడిని విష్ చేయడం కోసం దీప్తి.. మనాలిలో ఉన్న విజయ్‌ను కలవడానికి వెళ్తుంది. కానీ, స్లామ్ బుక్‌ను అతడికి ఇచ్చి ప్రపోజ్ చేయాలని అనుకుంటుంది. కానీ, అప్పటికే అతడు వేరో అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడితో మనాలిలో ఉంటుంది.
అతడి ప్రేమ ఉన్నా.. మనసు చంపుకుని పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు మనసులోనే కుమిలిపోతూ కన్నీళ్లు ఆపుకుంటుంది. పెళ్లి రోజు విజయ్ గర్ల్‌ఫ్రెండ్ దీప్తి స్లామ్ బుక్ చూస్తుంది. ఆమె విజయ్‌ను ప్రేమిస్తుందని తెలుసుకుంటుంది. కానీ, ఆ విషయాన్ని ఆమె మనసులో ఉంచుకుంటుంది. ఆమె కూడా విజయ్‌ను ప్రేమిస్తుండటంతో దీప్తి ప్రేమను అతడికి చెప్పదు. చివరికి వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు. దీప్తి వారి పెళ్లి చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే, దీప్తీది నిజంగానే ప్రేమా? స్నేహమా ఇంకా ఏమైననా అనేది సురేష్ బనిశెట్టి తన లిరిక్స్‌తో చాలా చక్కగా వెల్లడించాడు. ఒక్క రోజు వ్యవధిలోనే ఈ పాట 1.6 మిలియన్ పైగా వ్యూస్‌ను సంపాదించుకుంది. దీప్తి గతంలో నటించిన ‘మలుపు’, ‘తట్టుకోలేదే’ బ్రేకప్ సాంగ్స్ కూడా మంచి వ్యూస్ సంపాదించుకున్నాయి. అయితే, ఈ పాటను స్వయంగా ‘సోనీ మ్యూజిక్ సౌత్’ స్వయంగా తమ యూట్యూబ్ చానెల్‌లో విడుదల చేయడం గమనార్హం.
Also Read: 'రాధే శ్యామ్'కు రెండోసారి సెన్సార్ ఎందుకు చేశారు? దీని వెనుక రాజమౌళి సలహా ఉందా?
Also Read: లక్ష్మీ మంచుకూ తప్పని కాస్టింగ్ కౌచ్ - బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై మోహన్ బాబు కుమార్తె లేటెస్ట్ రియాక్షన్